మానసిక హత్య
-ఆర్ శర్మ దంతుర్తి
పదహరేళ్ళ అమెరికన్ అమ్మాయి వెండీ కార్సన్ టేన్నిస్ కోర్టులోకొచ్చేసరికి చప్పట్లు వినిపించాయి. కొత్తగా అప్పుడే టెన్నిస్ ప్రొఫెషనల్ గా మారిన వెండీకి వింబుల్డన్ లో ఎదురే లేదు ఫైనల్ కి రావడానికి. దాదాపు అరడుగులు ఉన్న వెండీ చేసే పవర్ సర్వీస్ తోనూ, కొట్టే గ్రౌండ్ స్ట్రోక్ లతోనూ చూసేవాళ్లకి ఔరా అనిపించే ఆట; అసలు మొదటిసారి ఫైనల్స్ కి వచ్చినప్పుడు కొత్త ఆటగాళ్ళు పడే స్ట్రెస్ గానీ ఉన్నట్టే లేదు మొహంలో. ఎప్పుడో బోరిస్ బెకర్ కి ‘బూమ్ బూమ్ బెకర్’ అని పేరు తగిలించినట్టూ ఇప్పుడు ‘బూమ్ బూమ్ వెండీ’ అనడం మానలేదు చూసేవాళ్ళు. అటువైపు వెండీతో ఆడబోయేది క్రితం ఏడాది వింబుల్డన్ నెగ్గిన కామినిస్కోవా అనే రష్యన్ భామ. ఇప్పటివరకూ ఒక్క సెట్ కూడా పోగొట్టుకోకుండా ఫైనల్ కి వచ్చినావిడ. బెట్టింగ్ రాయుళ్ళ ప్రకారం కామినిస్కోవా ఈ ఫైనల్స్ గెలిచి తీరుతుంది, కానీ వెండీ నెగ్గడానికి పది శాతం ఇచ్చారు ఛాన్సు; ఆటలో ఎట