Author: Sujanaranjani

కవితా, ఓ కవితా!

కవితా స్రవంతి
-శ్రీశ్రీ నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో, నిను నే నొక సుముహూర్తంలో, అతిసుందర సుస్యందనమందున దూరంగా వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో, నీకై బ్రదుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందున నిషాలందున, ఎటు నే చూచిన చటులాలంకారపు మటుమాయల నటనలలో, నీ రూపం కనరానందున నా గుహలో, కుటిలో, చీకటిలో ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా? నీ ప్రాబల్యంలో, చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో, నిశ్చల సమాధిలో, స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా మస్తిష్కంలో ఏయే ఘోషలు, భాషలు, దృశ్యాల్ తోచాయో? నే నేయే చిత్రవిచిత్ర శ్యమంత రోచిర్నివహం చూశానో! నా గీతం ఏయే శక్తులలో ప్రాణస్పందన పొందిందో? నీకై నే నేరిన వేయే ధ్వనులో, ఏయే మూలల వెదకిన ప్రోవుల ప్రోవుల రణన్నినాదాలో! నడిరే యాకస మావర్తించిన, మేఘా లావర్షించిన, ప్రచండ ఝంఝా ప్రభంజనం గజగజ లాడించిన నడిసంద్రపు కెరటాల్లో మ్రోగిన శంఖారావం, ఢంకాధ్వానం! ఆ రాత

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
స్త్రీ గురించి రాసే మరో కవయిత్రి జయప్రభ. ' స్వేచ్చకోసం కవిత్వం వ్రాస్తున్నాను, స్వేచ్చకోసం కవిత్వం రాస్తాను' అని ఈవిడ ప్రకటించుకున్నారు. ఈవిడ తన కవిత్వం ఫెమినిస్టు ధోరణికి చెందినదని చెప్పుకుంటారు. సమాజంలో తనకు జరిగిన అన్యాయాల వల్ల ఒక స్త్రీ సానిగా మరవలసి వచ్చింది. అటువంటి స్త్రీని ' సానిపాప' అనే ఖండికలో సమాజంపై తిరగబడమని చెప్తున్న సందర్భంలో - "రగులుతున్న ఆవేశాన్ని ఆరానీకు, చైతన్య తూరుపులా ప్రజ్వరిల్లు ! అప్పుడు బిగిసిన నీ పిడికిలి మాటున సూర్యుడు కూడా ఉదయిస్తాడు "32 అంటూ స్త్రీ జాతికి సూర్యోదయం కావాలని ఈవిడ కోరుకుంటున్నారు. సమాజంలో జరిగే అనేక సంఘటనలు ఈవిడకు వస్తువులుగా మారాయి. స్త్రీలపై మగవాళ్ళు చూసే చూపులను వర్ణిస్తూ, వాటిని ఎదుర్కొంటే జయం స్త్రీలదే అని ఆవిడ తెలిపారు. అందుకని - " అప్పుడనుకుంటాను కళ్ళకే కాదు ఈ దేశంలోని ఆడదానికి వాళ్ళంతా ముళ్ళుండే రోజు ఎప్పుడొస్తుందా అని 33" ప్రతి

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
రావణాసుర సంహారం అప్పుడాయన తన తమ్ములతో ఈ ఉపద్రవం గూర్చి ప్రస్తావించి, 'లవణుణ్ణి వధించే బాధ్యత మీలో ఎవరు తీసుకుంటార'ని ప్రశ్నించగా లక్ష్మణుడు చిరకాలం అరణ్యవాసం చేసి సౌఖ్యధూరుడై ఉన్నాడని, భరతుడు పద్నాలుగేళ్ళు వ్రతోపవాస తపోదీక్షలో ఉన్నాడని అందువల్ల లవణుణ్ణి సంహరించే కర్తవ్యం తనదని శత్రుఘ్నుడు శ్రీరామచంద్రుడికి విన్నవించుకున్నాడు. దానికి శ్రీరాముడు ఆమోదించి శత్రుఘ్నుణ్ణి అభినందించాడు. 'అట్లా లవణుణ్ణి హతమారిస్తే, వాడి రాజ్యానికి నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను' అని వాత్సల్యం చూపాడు శత్రుఘ్నుడి మీద. అప్పుడే లాంఛనంగా తక్కిన తమ్ములను ఆనందిస్తూ ఉండగా శ్రీరాముడు మధురాజ్యానికి శతృఘ్నుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఈ సన్నివేశంలో లవణుడు పారాలోకగతుడైనట్లు అని అందరూ ఆనందించారు. అప్పుడు శ్రీ రాముడు తన తమ్ముడుకి ఒక దివ్యాస్త్రాన్ని బహుకరించాడు. అది శ్రీమన్నారాయణుడు సృష్త్యాదిని మధుకైటభులను సంహరించిన మహా

Man is a Social Animal

శీర్షికలు
కరోనా నేర్పుతున్న ఒక గొప్ప పాఠం "మనిషి సంఘజీవే " మనిషి తన జీవన ప్రయాణంలో తనకు ఎదురయ్యే ఎన్నెన్నో సంఘటనల ద్వారా కావాల్సినన్ని అనుభవాలు పొందుతూనే ఉంటాడు. అందుకే ప్రతి సమస్యలో, ప్రతి సంక్షోభంలో ఎన్నెన్నో కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాడు. ఈ నేపధ్యం లో భాగంగా ప్రస్తుత సామాజిక ప్రపంచం లో వందల కోట్ల మంది ప్రజలు కరోనా రక్కసి కారణంగా "ఆరోగ్య సంక్షోభంలో" కూరుకొని పోయి స్వీయరక్షణ మార్గాల ద్వారా తమ ఆరోగ్యాలను కాపాడుకొనే దిశగా అడుగులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మన దేశంలో కోట్లాది ప్రజలు "లాక్ డౌన్ " ప్రక్రియలో భాగంగా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. దీనివలన ప్రధానంగా ఉద్యోగులు ,వ్యాపారస్తులు లేదా ఇతర వృత్తులలో ఉన్నవారికి కళ్ళ ముందే కుటుంబ సభ్యులు, వేళకు ఆహారం,పిల్లలతో ఆహ్లాదం అలాగే వృత్తి ,వ్యాపారాలలో ఇంటికే పరిమితమై పని చేసే వారికి పెద్దగా ఒత్తిడి లేని స్వేచ్ఛాయుత పని విధానాలు, కొంతలో క

అన్నమయ్య శృంగార నీరాజనం

ధారావాహికలు
ఏవం దర్శయసి హితమతిరివ -టేకుమళ్ళ వెంకటప్పయ్య ఇది ఒక సంస్కృత శృంగార సంకీర్తన. అన్నమయ్య, చెలులలో ఒకచెలికత్తెగా మారి శ్రీ మహావిష్ణువు ప్రియురాలైన తులసి మాతను ఆ తల్లి వైభవాన్ని కీర్తిస్తూ అన్నమయ్య చెప్పిన చక్కని కీర్తన. ఆ విశేషాలు చూద్దాం. కీర్తన: పల్లవి: ఏవం దర్శయసి హితమతిరివ కేవలం తే ప్రియసఖీ వా తులసీ ॥పల్లవి॥ చ.1 ఘటిత మృగమద మృత్తికా స్థాసకం పటు శరీరే తే ప్రబలయతి కుటిలతద్ఘనభారకుచవిలగ్నంవా పిటర స్థలే మృత్ప్రీతా తుళసీ ॥ఏవం॥ చ.2 లలిత నవ ఘర్మలీలా విలసనో- జ్జ్వలనం తవ తనుం వంచయతి జల విమలకేలీవశా సతతం అలిక ఘర్మాంచిత విహరా తులసీ ॥ఏవం॥ చ.3 సరస నఖచంద్రలేశా స్తే సదా పరమం లావణ్యం పాలయతి తిరువేంకటేశ తత్కరుణా గుణా వా వరరూప నవచంద్రవదనా తులసీ ॥ఏవం॥ (రాగం: ధన్నాసి ; రేకు: 30-1, కీర్తన; 5-167) విశ్లేషణ: పల్లవి: ఏవం దర్శయసి హితమతిరివ కేవలం తే ప్రియసఖీ వా తులసీ స్వామీ! నాహితం కోరే వాడిలా క

చిరంజీవి శంకరశాస్త్రి

సారస్వతం
-శారదాప్రసాద్ జె.వి. సోమయాజులు గారు తెలుగుప్రేక్షక హృదయాల్లో శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు. రంగస్థలం, వెండితెర, బుల్లితెర వంటి మాధ్యమాలన్నింటిలో నటించాడు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. జె.వి. సోమయజులు 1928 జూన్ 30 వ తెదీన శ్రీకాకుళం జిల్లా , లుకలాం అగ్రహారం గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశివరావు. ఈయన సోదరుడు చలన చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నటుడు జె.వి. రమణమూర్తి. ఇతని తండ్రి ప్రభుత్వోద్యోగి. సోమయాజులు విజయంనగరంలో మహారాజా కళాశాలలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవాడు.తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. జె.వి.సోమయాజులు తన పదహారవ ఏట నుంచి రంగస్థల నటనపై కాంక్ష పెంచుకున్నారు. ముఖ్యంగా కన్యాశుల్కంలో "రామప్ప పంతులు" పాత్రకు ప్రసిద్ధుడయ్యాడు. సోమయాజులు తల్లి

పదవీ విరమణ

కథా భారతి
రచన: సోమ సుధేష్ణ నీరజ నవ్వుతూ వెనక్కి తిరిగి “బాగుంది మీ వరస. పిల్లలు లేని ఇంట్లో ముసిలాడు పాకినట్టుంది. మరీ కొంగుకు వేళ్ళాడుతున్నారేమిటి! ” “కొంగు లేదుగా అందుకే నీ షర్ట్ చివర పట్టుకుని వేళ్ళాడుతున్నాను.” నవ్వుతూ ఆ పక్కనే ఉన్న  కుర్చీని బట్టలు ఐరన్ చేస్తున్న నీరజ పక్కకు లాక్కుని కూర్చున్నాడు వివేక్. ‘పదవీ విరమణ తర్వాత మాఆయన మరీ కొంగుకే వెళ్ళాడుతున్నాడు, చిరాగ్గా ఉంది.’ అలవాటైన  లేడీస్ లంచులకు, షాపింగులకు ఫ్రీగా వెళ్ళలేక పోతున్నానని స్నేహితురాలు శోభ గొణగడం గుర్తుకు వచ్చి ‘అలా వెంట తిరుగుతూ ఉంటె నాకిష్టమే’ నవ్వుకుంది నీరజ. ఎలాగు ఉద్యోగ పర్వం అయిపొయింది ఇక వాన ప్రస్త పర్వం మొదలు పెడితే మంచిది అని చెప్పిన  రావుగారి మాట కాదన లేక వివేక్ ఒక రోజు సత్ సంఘుకు వెళ్ళాడు. “మొక్కుబడిగా రెండు శ్లోకాలు చదివామనిపించి, ఆవురావురు మంటూ భోజనం మీద దాడి ఆ తర్వాత ఒహటే  ముచ్చట్లు. ఊళ్ళోని వ