Author: Sujanaranjani

అన్నమయ్య శృంగార నీరాజనం మార్చ్ 2020

సారస్వతం
జానామ్యహంతే సరసలీలాం -టేకుమళ్ళ వెంకటప్పయ్య ఇది ఒక శృంగార మధురభక్తి సంకీర్తన. అన్నమయ్య ఒక నాయికగా మారి ఈ శృంగార సంస్కృత కీర్తనలో స్వామిని ఎలా వేళాకోళం చేస్తున్నాడో, ఎలా దెప్పిపొడుస్తున్నాడో చూడండి. నాయకుడైన శ్రీనివాసుడు నాయిక వివిధ ప్రశ్నలకు సమాధానం ఏమిచ్చాడో తెలీదు. ఆయన ప్రత్యుత్తరాలకు కినుక వహించిన నాయిక స్వామిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నాయిక ఖండిత అనవచ్చు. ఆ విశేషాలు చూద్దాం. కీర్తన: పల్లవి: జానామ్యహంతే సరసలీలాం నానావిధ కపటనాటక సఖత్వమ్ ॥పల్లవి॥ చ.1 కిం కరోమి త్వాం కితవ పరకాంతాన- ఖాంకురప్రకటన మతీవ కురుషే శంకాం విసృజ్య మమసంవ్యాన కర్షణం కింకారణమిదం తే ఖేలన మిదానీం ॥జానా॥ చ.2 కిం భాషయసి మాం కృతమానసతయా డాంభికతయా విట విడంబయసి కిం గాంభీర్యమావహసి కాతరత్వేన తవ సంభోగ చాతుర్య సాదరతయా కిం ॥జానా॥ చ.3 కిమితి మామనునయసి కృపణ వేంకటశైల- రమణ భవదభిమతసురతమనుభవ ప్రమదేన మత్ప్రి

వీక్షణం- 90

వీక్షణం
-రూపారాణి బుస్సా వీక్షణ 90వ సమావేశం ఫిబ్రవరి 9, 2020 న ఫ్రీమౌంట్ లోని సుభాష్ గారు, వందన గారింట్లో అతి ఉత్సాహకరంగా జరిగింది. అపర్ణ గారు అధ్యక్షత వహింహారు. సభ ప్రారంభంలో సమావేశమైన రచయితలందరు తమ పరిచయంతో పాటు తాము ఇటీవల చదివిన కథ లేక కవిత గురించి చెప్పి ఎందుకు నచ్చిందన్న విషయాన్ని తెలియపరిచారు. మొదట గోకుల్ రాచి రాజు గారు తమ పరిచయం తరువాత సైరాబి పొయట్రీ గురించి తెలియపరిచారు. అలాగే ఒక కొరియాన్ చలనచిత్రం గురించి కూడా చెప్పారు. తదుపరి రమణా రావు గారు కథకు కథాశిల్పం ఎంత ముఖ్యం అని చెబుతూ "పడవప్రయాణం" అనే కథ అద్భుతంగా ఉందని ఏ కథకైన క్రమ పద్ధతి పెట్టుకుని వ్రాస్తారు ఏ రచయితైనా అని చెప్పారు. వాస్తవ పరిస్థితి తీసుకువచ్చిన కథా శైలి బాగా నచ్చిందని చెప్పారు. ఆ తరువాత ఉదయలక్ష్మిగారు గొల్లపూడి మారుతిరావుగారి గురించి మాట్లాడుతూ కిరణ్ ప్రభగారు గొల్లపూడి గారికి సన్నిహిత ఆప్తులుగా ఉండేవారని కిరణ్

*గజల్*

కవితా స్రవంతి
~ తిరునగరి శరత్ చంద్ర హైదరాబాద్ అనురాగమె గీతంగా రాయాలని ఉంది సమభావన గమ్యంగా సాగాలని ఉంది జుత్తులూగె మతులుంటే మునుముందుకు రమ్మంటా కుటిలమతుల గుండెలనూ చీల్చాలని ఉంది నిరుపేదల వసంతానికెదురుపడే శిశిరాన్ని కత్తిలాంటి కలము తోటి కూల్చాలని ఉంది పదునెరిగిన భావంతో గేయమొకటి రాసేసి ప్రళయం ఎదురైన వేళ పేల్చాలని ఉంది మహనీయులు చూపినట్టి ప్రగతిపూల బాటలో వినయంగా బతుకంతా నడవాలని ఉంది మంచిని వంచన జేసే దుర్మతులెదురైనప్పుడు నిప్పులెగయు కన్నులతో కాల్చాలని ఉంది కుళ్ళుకునే కళ్ళెన్నో పైబడినా ఓ ‘శరత్’ ఆత్మశక్తితో జగాన్ని గెలవాలని ఉంది

ముష్టివాడు

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి అమెరికా నుంచి వచ్చిన స్నేహితుడు రమ్మంటే రామ్మూర్తి ఊరి బయట శివాలయానికి బయల్దేరాడు. ఇదే ఊళ్ళో ఉంటూ ఎన్నాళ్ళనుంచో చూస్తున్న శివాలయంలో రామ్మూర్తికి పెద్దగా చూడ్డానికేమీ లేదు; వెళ్ళడం ఇష్టం లేదు కూడా. గుడి ఆవరణలో ఉండే బిచ్చగాళ్ళూ, కుష్టివాళ్ళనీ చూడ్డం అంటే రామ్మూర్తికి చిరాకు. పైన గుడిలో లోపలకి వెళ్ళాక పూజారి చేత్తో చాచిన కంచంలో ఏదో దక్షిణ వేయాలి. లేకపోతే ఈ పంతులు గారు ఊళ్ళో అందరితోనూ ఫలానా రైస్ మిల్లు రామ్మూర్తిగారు దేవుడికి కూడా దక్షిణ ఇవ్వలేదు అని అందరితో చెప్తాడు. సుబ్రహ్మణ్యం, ఉరఫ్ - సుబ్బుడు తనతో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాడు. అసలే అమెరికా అంత దూరం నుంచి వచ్చి పిలిచినవాడు రమ్మంటే వెళ్ళకపోతే బాగోదు కనక బయల్దేరాడు – జేబులో కాసిని చిల్లర డబ్బులు పెట్టుకుని. సుబ్బుడు, రామ్మూర్తీ కలుసుకుని చాలా ఏళ్ళయింది కనక కబుర్లు చెప్పుకుంటూ దారిలో వచ్చేపోయే వాహనాలని దాటుకుంటూ ఆవు

బాలబడి

మనబడి
బుడిబుడి నడకలనుండి చిట్టిపొట్టి మాటలనుండి మూణ్ణెళ్ళ క్రితమే బాలబడిలో చేరి నేర్చుకున్న ముచ్చటైన తెలుగు పలుకులను మూడేళ్ళ తన చిట్టి చెల్లికి నేర్పుతున్న తీరు ఆశ్చర్యం! అద్భుతం!! అమితానందం!!! ఇదిగో నా మనవడు, ఇదీ మనబడి ప్రభావం అంటూ అమ్మమ్మ పంపింది ఈ వీడియో మీరూ చూసి ఆశీస్సులందించండి! వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలకు మరియు అమ్మ, నాన్నలకో వందనం! మనబడి ఉపాధ్యాయులకో అభివందనం!! అమెరికాలో ఎక్కడైనా! సంవత్సరంలో ఎప్పుడైనా!! 4 నుండి 6 సంవత్సరాల మధ్య మీ పిల్లలుంటే వెంటనే వారిని బాలబడిలో చేర్పించండి! ప్రస్తుత ఫీజు (Pro-rated from quarter 2) $200 మాత్రమే! వివరాలకు manabadi.siliconandhra.org లేక 1-844-626-BADI (2234) ని సంప్రదించండి!

ఆ అడుగు

కవితా స్రవంతి
- డా . మీసాల అప్పలయ్య ఆ అడుగు నీ జాడనే చెరిపేసింది నీ రేఖా చిత్రాన్నిచించేసి నీ నీడపై ఉమ్మేసి నీ తలంపును కూడా పిసర్లగా కోసి గొనె సంచికెత్తి మౌన వాసనలను విసర్జించే గబ్బిలాల నూయిని గోరి చేసింది అది నీ బ్రతుకు డెడ్ ఎండ్ కు టికెట్ రాసి ఇచ్చింది కన్నెత్తి కూడా చూడని కాలధర్మాన్ని నీ ముంగిటిలోకి విసిరి నిన్ను రెచ్చ్చగొట్టిన ఉచ్చు అయింది నీవు నిలబడ్డానికి చోటునిచ్చిన జీవనాడి కూడా నీ చెయిదం తోనే కుత్తుక తెగి కార్చిచ్చు అంతః కేంద్రంలో నిర్జీవ రేణువయింది ముకుళిత హస్తాలుగా ఆదమరచి నీచుట్టూ నిలబడ్డ నీ బలగం నీ చేతల సైనైడ్ తో కుప్పకూలిన గోడయింది నీవు నిలబిడ్డ నేల నీ మరణపు రొంపయింది నీ సమాధి పై రాయి అయింది చీకటిగోడల మధ్య వెక్కివెక్కి ఏడ్చిన నిందయి పిడిగుద్దులు ఓర్చుకొన్న పచ్చిపుండయింది పెను తుఫాన్లకు ఒరిగి విరిగిన కొంపయి చిరిగిన ఎముకల గూడయి అరచేతులమధ్య బరువుగా ఒద