Author: Sujanaranjani
పదవీ విరమణ
రచన: సోమ సుధేష్ణ
నీరజ నవ్వుతూ వెనక్కి తిరిగి “బాగుంది మీ వరస. పిల్లలు లేని ఇంట్లో ముసిలాడు పాకినట్టుంది. మరీ కొంగుకు వేళ్ళాడుతున్నారేమిటి! ”
“కొంగు లేదుగా అందుకే నీ షర్ట్ చివర పట్టుకుని వేళ్ళాడుతున్నాను.” నవ్వుతూ ఆ పక్కనే ఉన్న కుర్చీని బట్టలు ఐరన్ చేస్తున్న నీరజ పక్కకు లాక్కుని కూర్చున్నాడు వివేక్.
‘పదవీ విరమణ తర్వాత మాఆయన మరీ కొంగుకే వెళ్ళాడుతున్నాడు, చిరాగ్గా ఉంది.’ అలవాటైన లేడీస్ లంచులకు, షాపింగులకు ఫ్రీగా వెళ్ళలేక పోతున్నానని స్నేహితురాలు శోభ గొణగడం గుర్తుకు వచ్చి ‘అలా వెంట తిరుగుతూ ఉంటె నాకిష్టమే’ నవ్వుకుంది నీరజ.
ఎలాగు ఉద్యోగ పర్వం అయిపొయింది ఇక వాన ప్రస్త పర్వం మొదలు పెడితే మంచిది అని చెప్పిన రావుగారి మాట కాదన లేక వివేక్ ఒక రోజు సత్ సంఘుకు వెళ్ళాడు.
“మొక్కుబడిగా రెండు శ్లోకాలు చదివామనిపించి, ఆవురావురు మంటూ భోజనం మీద దాడి ఆ తర్వాత ఒహటే ముచ్చట్లు. ఊళ్ళోని వాళ్ళని, దేశంలోని వాళ్ళన
కొప్పరపు కవులు
-టీవీయస్.శాస్త్రి
భారతీయ భాషా సాహిత్యాలలో మరే భాషకు లేని విలక్షణమైన స్థానాన్ని తెలుగు భాషా సాహిత్యాలకు తెచ్చిపెట్టిన ప్రక్రియ అవధానం. పద్య విద్యకు పట్టంగట్టిన సాహిత్య ప్రదర్శన కళగా అవధాన ప్రక్రియ ప్రత్యేక గుర్తింపును పొందింది నాటి తిరుపతి వెంకటకవులు, కొప్పరపు సోదర కవులు మొదలుకుని ఆధునిక కవుల వరకు పద్యాన్ని అవధాన వేదికలపై ఊరేగించిన మహాకవులెందరో ఉన్నారు. కాళిదాసు కావ్యాలకు సంజీవనీ వ్యాఖ్య రాసి విశ్వవిఖ్యాతి గడించిన మల్లినాథసూరి మెదక్ జిల్లావాడే. వీరి తాతగారైన మల్లినాథుడు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుని ఆస్థానంలో శతావధానం నిర్వహించి కనకాభిషేక సత్కారాన్ని పొందాడని ప్రతీతి. బహుశా వీరే మొట్టమొదటి అవధాని అయి ఉంటారు. ఈ విషయమై విస్తృతమైన పరిశోధన చేయవలసి ఉంది.కొప్పరపు సోదర కవులు తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదరకవులు. కొప్పరపు కవులుగా ప్రఖ్యాతులైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, కొప్పరప
అన్నమయ్య శృంగార నీరాజనం జనవరి 2020
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
పూవుటమ్ములు మరుఁడు
అన్నమయ్య శ్రీ వేంకటనాధుని విరహవేదనను వివరిస్తున్నాడు. ఆ మన్మధుడు నా మదిలో మరులు రేపుతున్నాడు. చిలిపి కయ్యాలెందుకు? నేను శ్రీవేంకటేశ్వరుడను. నీ పతిని అంటూ శ్రీనివాసుడు అమ్మ పద్మావతిని కోరుతున్నాడు. శ్రీకృష్ణావతార రీతిలో వేడుకుంటున్నాడు. అన్నమయ్య ఊహ మరియూ భావనా ప్రపంచ విహారానికి ఈ కీర్తన అద్దం పడుతున్నది. ఆ విశేషాలు చూద్దాం.
కీర్తన:
పల్లవి: పూవుటమ్ములు మరుఁడు పూఁచినాఁ డేమరఁడు
రావే నామాఁట విని రవ్వపడనేఁటికే ॥పల్లవి॥
చ.1 వద్దు నీచలము వలపించఁగలము! నీ
కొద్ది దెలిసిన దాఁకా గొంకే మింతే
అద్దొ యిటువలె నలిగేవా నెంతలేదు
చద్దికి వేఁడికి నవి సాగ వింతేకాక ॥పూవు॥
చ.2 యింతేలే నీకోపము యిందు కెల్లా నోపము! నీ-
పంతము చూచినదాఁకా పాటించే నింతే
యెంతో బిగువుతోడ యెలయించే దెంతలేదు
సంతతము పతి వద్ద జరగదుగాక ॥పూవు॥
చ.3 మానవే నీబిరుదు మాకు నివి యరుదు
నానఁబెట్టి క
వీక్షణం – 88
- రూపారాణి బుస్సా
గొల్లపూడి మారుతీరావు గారికి నివాళులర్పిస్తూ రెండు నిముషాల పాటు మౌనం పాటించి 88 వ వీక్షణ సభ ప్రారంభించబడినది.
తరువాతి కార్యక్రమంగావెంకట రమణ రావు గారు తాము వ్రాసిన కథ చదివారు. ఈ కథ పుట్టిల్లు అన్న శీర్షికతో 2008లో నవ్యలోప్రచురింపబడినది.ఈఛ్Fఆఈ సంస్థ వాళ్ళు పెట్టిన పోటీలో మొదటి బహుమతి పొందింది.
కథ నేపథ్యం అనంతపురంలోజరిగినట్టు చెప్పబడినది. కొన్ని సంభాషణలలోప్రాంతీయ భాషా శైలి కనబడుతుంది.
కథ ఇలా కొనసాగుతుంది:-
పార్వతి తన కూతురి ఇంటికివెళ్ళినప్పుడు తన ఊరి స్నేహితురాలు అలిమేలును కలిసి సొంత ఊరి వాళ్ళ గురించి తెలుసుకునిఏదో స్వగతాలలో మునుగుతుంది. స్నేహితురాళ్ళంతా కలిసినపుడు తోట, స్నేహం ఉన్నంత వరకు ఇదేమన పుట్టిల్లు అని అనుకున్నారు. ఊరులో ఒంటరిగా ఉంటున్న పార్వతమ్మకు కొడుకు, కోడలు వచ్చిఎంత పిలిచినా తన అవసరం ఉన్న వారి దగ్గర ఉండడమే న్యాయం మరియు ఈ ఇంట్లో చివరి కాలం గడపడమేసమంజసం అ
రంగ్ దే బసంతి
-ఆర్ శర్మ దంతుర్తి
ఒకానొక రాజ్యంలో రాజు తెలుపు, ప్రథానమంత్రి తెలుపు, అనుయూయులూ తెలుపే. ప్రజలందరూ తెలుపు. అన్నీ సజావుగా సగిపోతున్న రోజుల్లో ఓ తెల్లవాడు అడవుల్లో వేటకెళ్ళాడు. అక్కడో చిన్న తండా అందులో కొంతమంది మనుషులూ ఉంటే, దాహం కోసం వాళ్ళదగ్గిరకెళ్ళిన ఈ తెల్లవాణ్ణి ఆ తండా మనుషులు వింతగా చూడ్డం మొదలుపెట్టారు. కారణం ఏవిటంటే తండాలో మనుషులందరూ నల్లవాళ్ళు. బావిలో కప్పల్లా బతుకుతున్న వాళ్ళకి మనుషులు తెల్లగా ఉంటారని తెలీదు ఈ తెల్లవాణ్ణి చూసేవరకూ. తెల్లవాడిక్కూడా అదే పరిస్థితి. వీడూ తెల్లబావిలో కప్పే కానీ ఆ నల్లవాళ్లలా ‘నాకూ ఇలా నల్లవాళ్ళు ఉంటారని తెలియదు’ అనే మాట బయటకి చెప్పలేదు. వీడు దాహం తీర్చుకున్నాక వేట చాలించి తన రాజ్యానికికొచ్చి తను చూసిన విషయం తెల్ల రాజ్యంలో చెప్పేసేడు ఇలా తాను నల్ల మనుషులని చూసినట్టు. కొంతమంది నమ్మితే, కొంతమంది నమ్మలేదు. నమ్మనివాళ్లని కొంతమందిని పోగు చేసి తెల్లరాజు ఓ తెల్ల