Author: Sujanaranjani

*పరవశం*

కవితా స్రవంతి
~ శాంతి కృష్ణ సమీపాన నువ్వుంటే ఎందుకింత పరవశం గాలులన్నీ గంధాలై కమ్మినంత పరవశం విరిసెనులే పెదవులపై గులాబీల నవ్వులే ఎదలోపల ఏమున్నదో తెలియనంత పరవశం అక్షరాలు రెక్కలొచ్చి మబ్బులపై ఎగిరెనులె, కవితలన్ని వర్షమల్లె కురిసినంత పరవశం నన్ను నేను చూసుకునే అద్దంలో నువ్వేలె అందులోనె నాకెంతో చెప్పనంత పరవశం వరమల్లే వలచినావు మనసంతా ‘శాంతి’గా బతుకంతా నీలోనే ఒదిగినంత పరవశం!!

భక్తి-ముక్తి

సారస్వతం
​-శారదాప్రసాద్ ఈ నాడు తెలుగుదేశంలో భక్తి విపరీతంగా ప్రవహిస్తుంది. ఎన్నో భక్తి చానళ్ళు, ఎందరో ప్రవచనకారులు, స్వాములు, పీఠాధిపతులు భక్తిని గురించి అనేక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కొంతమంది స్వాములకు, మహర్షులకు(?) ఏకంగా స్వంత చానళ్ళు ​కూడా ఉన్నాయి ​.​అందరి ప్రవచనాలు ​వినటానికి జనం కూడా విపరీతంగా వెళ్ళుతున్నారు. ఒకవైపు భక్తి విపరీతంగా పెరుగుతున్నా మరొకవైపు అశాంతి, ​అవినీతి,​ అన్యాయం ​దానికి రెట్టింపుగా ​పెరుగుతున్నాయ​నది కూడా వాస్తవమే. ఈ మధ్య ఒక రాజకీయనాయకుడు మాట్లాడుతూ, దేవాలయాల ఆదాయం పెరగటానికి భక్తులు ఎక్కువగా చేస్తున్న పాపాలు కూడా కారణం అన్నారు.అది కొంతవరకు వాస్తవం కూడా కావచ్చు.ఆయన అవి స్వానుభవం వలన చెప్పిన మాటలు కూడా కావచ్చు! ఎందుకంటే, సదరు నాయకుడు ఆ మధ్యనే ఆయన మనవడి జన్మదినం సందర్భంగా అధికంగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చాడు. నిజమైన భక్తుడు భక్తికొలది ఏదో ఒకటి ముడు

అమెరికా ఉద్యోగ విజయాలు – 12

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న జయం మనదే! “బావా! నువ్వు నాకు రెస్యూమే వ్రాయటం దగ్గర మొదలు పెట్టి, దాని ముఖ్య ప్రయోజనం ఇంటర్వ్యూ తెప్పించటం మాత్రమేననీ, అది రాగానే ఇంటర్వ్యూలో ఎలా ప్రవర్తిస్తే ఉద్యోగం తెచ్చుకోవచ్చో చెప్పావు. ఆఫీసులో సరైన సంభాషణ ఎలా చేయలో, మాట్లాడేటప్పుడు నా శరీరవాణి ఎలా వుండాలో చెప్పావు. మన శతకాలలోని మేనేజ్మెంట్ సూత్రాలు సూక్షంగా చెప్పావు. ఆఫీసుల్లోని రకరకాల మనస్థత్వాలు ఎలావుంటాయో, వాళ్ళతో ఎలా మెలగాలో చెప్పావు. రంగుటద్దాలలోనించీ కాకుండా, మనం ఇతరులని వాళ్ళని వాళ్ళలాగే చూడటం ఎంత అవసరమో చెప్పావు. అలాగే ఆ రంగుటద్దాలలోనించీ మనల్ని సరిగ్గా చూడని వారితో ఎలా ప్రవర్తించాలో చెప్పావు. పాల్ గెట్టీ, లీ అయోకోకా, స్టీవ్ జాబ్స్ మొదలైన వారి మేనేజ్మెంట్ సూత్రాలు చెప్పావు. జాన్ మాక్స్వెల్ మొదలైన వారి పుస్తకాల గురించి చెప్పావు. అడగందే అమ్మయినా పెట్టదనీ, ప్రమోషన్లు ఎలా తెచ్చుకోవాలో చెప్పావు. ఉద్యోగ వై

పౌరికుడు

సారస్వతం
-శారదాప్రసాద్ ధర్మరాజు ! " పితామహా ! చాలామంది లోపల సౌమ్యంగా ఉండి పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. మరి కొందరు లోపల దుర్మార్గంగా ఉండి పైకి చాలా సౌమ్యులుగా కనిపిస్తుంటారు. మరి వారిని గుర్తించడం ఎలాగో వివరించండి " అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు " ధర్మరాజా! నీవు అడిగిన దానికి నేను ఒక పులి నక్క కథ చెప్తాను.శ్రద్ధగా వినుము! పురిక అనే పట్టణాన్ని పౌరికుడు అనే రాజు పాలించే వాడు. ఆ రాజు చాలాక్రూరుడు. అతడు మరణించిన అనంతరం ఒక నక్కగా పుట్టాడు. పూర్వ జన్మజ్ఞానం కలిగిన ఆ నక్క కనీసం ఈ జన్మలో బాగా బ్రతుకుదామన్న కోరికతో అహింసావ్రతం ఆచరించి ఆకులు అలములు తింటూ చిక్కిశల్యమైంది. అది చూసిన తోటి నక్కలు " ఇదేమి వ్రతం? మాంసాహారులం అయిన మనం ఇలా శాకములు తిన వచ్చా ? " అని అడిగాయి . అందుకు నక్క బదులు చెప్పలేదు. ఈ విషయం తెలిసిన ఒక పులి నక్క వద్దకు వచ్చి " నక్కా ! నీవు చాలా సౌమ్యుడివి అని విన్నాను. నువ్వు న

తెలుగు సాంస్కృతికోత్సవం – సమీక్ష

ఈ మాసం సిలికానాంధ్ర
అద్భుతంగా సిలికానాంధ్ర తెలుగు సాంస్కృతికోత్సవం పద్దెనిమిది సంవత్సరాలు నింపుకొన్న సిలికానాంధ్ర అక్టోబర్ 5న సిలికాన్ వ్యాలీలోని హేవర్డ్ నగరంలో తెలుగు సాంస్కృతికోత్సవాన్ని కన్నులపండుగగా నిర్వహించింది. అందంగా అలంకరించిన వేదికపై ఆద్యంతం తెలుగు సంస్కృతిని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను ఏడు గంటలపాటు ఆహ్లాదపరిచింది. ముద్దులొలికే చిన్నారులు 'బాల గాంధర్వం'లో మూడు గతులలో ఆరు రాగాలను వయోలిన్, వీణ, ఫ్లూటు, మృదంగా వాయిద్య సహకారాంతో ముప్పై నిమిషాలపాటు గానంచేసి అబ్బురపరిచారు. సంగీతకారిణి సుధా దూసి పర్యవేక్షణలో సింఫొనీ రూపంలో జరిగిన గాత్ర, వాయిద్యగోష్ఠిలో నలభైమందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. తెలుగుభాషకే సొంతమైన పద్యం యొక్క అందమైన నడకలను తెలియబరుస్తూ 'వేనోళ్ళ వెయ్యేళ్ళ తెలుగుపద్యం' రూపకం తెలుగుపద్య రీతులను విచ్చేసిన ఆహుతులకు మరొక్కమారు గుర్తుచేసింది. శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్యంలో సంచరిస్తూ ఒక గ్రామంలో బసచ

తెలుగు సాహితీ ద్వయం

సుజననీయం
ఈ నెల ముఖచిత్రంపై ఇద్దరు తెలుగు సాహితీ ఉద్ధండులు కొలువుదీరారు. ఇద్దరు పుట్టినరోజులు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఒక మొట్టమొదటి తెలుగు 'జ్ఞానపీఠ అవార్డు ' గ్రహీత కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మరొకరు తెలుగు భావకవిత్వంలో తనకొక అధ్యాయాన్ని ఏర్పరుచుకొన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి. వీరిరువరిని ఈ విధంగా స్మరించుకోవటం తెలుగు సాహిత్యానికి వందనం చేయటమే. ఈ సందర్భంగా విశ్వనాథవారి కథ 'మాక్లీదుర్గంలో కుక్క ' ప్రచురిస్తున్నాం. విశ్వనాథ సత్యనారయణ గారు ఎంతటి వవిధ్యమైన రచనలు చేశారో తెలియటానికి ఇదొక చిన్న ఉదాహరణ. జై తెలుగు! -తాటిపాముల మృత్యుంజయుడు

భారతీయ – సాహిత్యం – ఆధ్యాత్మికత

సారస్వతం
[ - కల్లూరి సత్యరామ ప్రసాద్ (హైదరాబాద్) చిన్మయ మిషన్; కొత్తపట్నం - 523 286 (ప్రకాశం జిల్లా) ఆం.ప్ర. చరవాణి -> 919493403972 ] "సహిత" అనే మాటనొక విశేషణపదంగా తీసుకుంటే - దానిని 1) స+హిత = "హితము (శ్రేయస్సు)తో కూడిన" లేదా 2) "కలిసి ఉన్న" (సంస్కృతంలోని 'సహ' అనే మాట దీనికి ప్రాతిపదిక కావచ్చునేమో?) - అనే అర్థాలున్న మాటగా మనం భావించవచ్చు. కాబట్టేనేమో - దీనిలోనుండి వచ్చిన "సాహిత్యం" అనే మాటకు 1) "అర్థగౌరవం/చమత్కారంతో కూడిన రచన (rhetoric composition); 2) కూడిక/కలయిక (association/fellowship) అనే నిఘంటు-నిర్వచనాలున్నాయి. తరచి చూస్తే - నిజానికి "సాహిత్య"మనే మాటకు "పై రెండర్థాల కలయికే" సరైన నిర్వచనమేమోననిపించక మానదు! అయితే, మన వ్యవహారంలో "సాహిత్యమంటే - ఒక ప్రత్యేక అంశంపైన చేయబడిన రచన" అని చెప్పుకుంటున్నాం కదా! వివిధాంశాలపైన ఆధారపడి ఈ సాహిత్యం రకరకాలుగా ఉండచ్చు - "పద్యసాహిత్యం

వృద్ధాప్యం

శీర్షికలు
వృద్ధాప్యం వేదన కాదు! ముందు తరాలకు నివేదన! (వృద్ధుల శారీరక, మానసిక ,సామాజిక పరిస్థితులపై ఒక వ్యాసం) అమరనాథ్. జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ . 9849545257 మానవ జీవన దశల్లో బాల్యం ,యవ్వనం తర్వాతది వృద్ధాప్యం. సహజంగానే ఈ మూడవ దశలోనే అనేకానేక శారీరక, మానసిక మార్పులకు గురి అవుతుంటుంది ఈ శరీరం. పెరుగుతున్న వయసుతో పాటు తరుగుతున్న శారీరక ధారుడ్యం దానికి తోడుగా దాడికి సిద్ధంగా పొంచివున్న రకరకాల వ్యాధులు, దీంతో సహజంగానే ఏర్పడే మానసిక సమస్యలు. నిజానికి పెరిగే వయస్సు కంటే కూడా తరిగే మానసిక స్థైర్యమే మానసిక సమతూల్యతను దెబ్బతీసి శారీరక, మానసిక సమస్యల తీవ్రతను పెంచుతుంది . సమాజంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న కొలది దీర్ఘకాలిక సమస్యలు కూడా పెరుగుతుంటాయి. వీటిని ఆత్మస్తైర్యం తో ఎదుర్కొంటూ జీవితాన్ని నిబ్బరంగా సాగించాల్సిందే తప్ప తప్పించుకొనే అవకాశమే లేదు ! దీనికి జీవనశీలి లో మార్పులు చేసుకుంటూ వీటిత