Author: Sujanaranjani

సంగీత రాగాలు

-డా. కోదాటి సాంబయ్య 1. భీమ్ పలాశ్రీ \భీమ్ పలాసి \ అభేరి : కాపి థాట్ కు చెందిన రాగం. ఔడవ-సంపూర్ణ రాగం. ఒక సంగీత విద్వాంసుడు పలాస (మోదుగు) చెట్టు కింద కూర్చుని భీమ్ రాగాన్ని పాడుతుంటే అనుకోకుండా కొన్నిస్వరాలను వర్జ్యం చేస్తే కొత్త రాగం వచ్చింది దానికే భీమ్ పలాసి అని పేరు పెట్టారని ఒక కథ ప్రచారం లో ఉంది. కర్ణాటక సంగీతం లో ఈ రాగానికి దగ్గరి రాగం అభేరి. అభేరి లో రిషభ,ధైవతాలు తక్కువగా వాడతారు, భీమ్ పలాసి లో తరుచుగా వాడతారు, అదొక్కటే తేడా రెంటికీ. ఈ రాగం పాడితే మానసిక ఆందోళనలు తగ్గి ప్రశాంతత నెలకొంటుందని పెద్దల మాట. భక్తి, శృంగార, విరహ భావాలను కలుగ చేస్తుంది. ఆరోహణ: స గ మ ప ని స....అవరోహణ: స ని డ ప మ గ రి స ...వాది స్వరం: పంచమం,కొందరు మధ్యమం అంటారు, సంవాది: షడ్జమం. పకడ్ మరియు చలన్....ని స మ, మ గ ప మ, గ మ గ రి స ..పాడవలసిన సమయం..మధ్యాహ్నం . ... హిందీ చలన చిత్రాలలోని కొన్ని భీమ్ పలాసి పాటల

ప్రథమ స్నాతకోత్సవం

ఈ మాసం సిలికానాంధ్ర
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం రెండు సంవత్సరాల క్రితం స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటయి భారతీయ కళలు, భాషలలో మాస్టర్స్, డిప్లమా, సర్టిఫెకెట్ స్థాయి కోర్సులను అందిస్తోన్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. తొలి బ్యాచ్‌లో చేరి కోర్సు పూర్తి చేసిన 31 మంది విద్యార్థులకు సిలికానాంధ్ర విశ్వ విద్యాలయ అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, విశ్వ విద్యాలయ పాలకవర్గ చైర్మన్ శ్రీ లకిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా ఈ స్నాతకోత్సవంలో పట్టాలను అందించారు. కాంప్ బెల్ హెరిటేజ్ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభంలో నిర్వహించిన శోభాయాత్ర చూపరులను ఎంతో ఆకట్టుకుంది. విశ్వవిద్యాలయం ప్రొవొస్ట్ రాజు చమర్తి ముందు నడవగా పాలక వర్గ సభ్యులు అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, చైర్మన్ డా.హనిమిరెడ్డి లక్కిరెడ్డి, డా.పప్పు వేణుగోపాల రావు, నీరజ్ భాటియా, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ దీనబాబు

కొత్త సూర్యుళ్ళు మొలిచితీరాలి

కవితా స్రవంతి
- డా. రావి రంగారావు అప్పుడే నాకు మీసాలు మొలుస్తున్నాయి, మిర్చి బజ్జీ మషాళా పొట్లం నా గొంతు విప్పాను.... అప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కొత్త సూర్యుళ్ళే కత్తు ల్లాంటి గొంతులతో పొడుచుకొచ్చేవాళ్ళు, ఎండల మీసాలు తిప్పుకుంటూ కిరణాల రోషాలు పెంచుకుంటూ... స్థూల కాయం చీకటి తొక్కేసిన కాలాన్ని ఇవతలకు లాగి కాపాడిన చంద్రుళ్ళు కూడా వచ్చి సూర్యుళ్ళ ఎదురుగా వినయంగా కూర్చునేవాళ్ళు, చంద్రుళ్ళలో చాలా మంది సూర్యుళ్ళుగా మారిపోయేవాళ్ళు... సూర్యుళ్ళను చూడటానికి పొలాలు నడిచి వచ్చేవి కలాలు కదిలి వచ్చేవి కొడవళ్ళు పారలు వివిధ ఉపకరణాలు ఎక్కడెక్కడినుంచో సైకిళ్ళమీద ఎడ్ల బండ్ల మీద బస్సుల్లో రైళ్లల్లో సాగి వచ్చేవి సూర్యుళ్ళ కిరణాలను గుండెల్లోకి తీసుకొని అన్నీ సూర్యుళ్ళయ్యేవి... జగ మంతా సూర్య మయం అవుతుందని నేనూ ఓ సూర్యుడినై నిప్పులు తొక్కటం మొదలుపెట్టా... కాలం మారిపోయింది, ప్రవాహం ఆరిపోయి

అమెరికా ఉద్యోగ విజయాలు-2

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న ముఖాముఖీయం కృష్ణ ఆదివారం మధ్యాహ్నం ఖాళీగా కూర్చుని బేస్బాల్ గేమ్ చూస్తుండగా ఫోన్ మ్రోగింది. అర్జున్ పిలుస్తున్నాడు. ఆ ఆట కూడా ఎటూ తెగకుండా నెమ్మదిగా నడుస్తుంటే బోరు కొట్టి, వెంటనే ఫోన్ తీసుకున్నాడు కృష్ణ. ‘నేను బావా.. అర్జున్ని’ ‘అవును. కాల్ ఐడీలో చూశాను. ఏదన్నా శుభవార్త వుందా?’ అడిగాడు కృష్ణ. ‘నువ్వు చెప్పినట్టే రెస్యూమే తయారుచేసి నాకు తెలిసిన, తెలియని కంపెనీల అన్ని సైట్లలోనూ అప్లోడ్ చేశాను. మా నాన్న అంటుండేవాడు పది రాళ్ళు వేస్తే, ఒకటైనా తగలక పోదా అని’ ‘అవును మా పాండురంగం మామయ్య, అదే మీ నాన్న, ముందు రాళ్ళ వ్యాపారం చేసేవాడులే. అందుకనే అలా చెప్పుంటాడు. ఆ వ్యాపారంలో దివాలా తీశాకనే గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాడు! అవన్నీ ఇప్పుడు ఎందుకుగానీ, ఎన్ని రాళ్ళు తగిలాయి ఇప్పటికి?’ అడిగాడు కృష్ణ నవ్వుతూ. ‘బాగానే తగిలాయి. ముగ్గురు పిలిచి ఫోన్ ఇంటర్వూ చేశారు. నువ్వు చెప్పినట్

కుండలినీ యోగం

సారస్వతం
-శారదాప్రసాద్   ఆధ్యాత్మిక మార్గంలో చాల కష్టతరమైన సాధనామార్గం కుండలినీ యోగం.దీనిని అభ్యసించటానికి అనుభవం కలిగిన గురువు తప్పనిసరి. పుస్తకాలు చదివి, ఎక్కడో విని విషయ సేకరణ చేసి కుండలినీ యోగ సాధనకు ఉపక్రమించరాదు. అసలు కుండలినీ అంటే ఏమిటో తెలుసుకుందాం!ఇదొక అనంతమైన శక్తి! దీని స్థావరం మూలాధారం! లలితా సహస్ర నామాల్లో అమ్మవారికి 'కుండలినీ' అనే పేరు కూడా ఉండటం మీరు గమనించే ఉంటారు. ముందు పురీష నాళం ,వెనక మలాశయం -వీటి మధ్యనే ఉంది మూలాధారం. ఇదే మన జన్మ స్థానం! మూలాధారంకు ఆధారం మూల(Root). విశేషమేమంటే అమ్మవారి నక్షత్రం కూడా మూలా నక్షత్రమే!అందుకే శక్తి ఆరాధకులు కుండలినీ యోగాన్ని చేస్తుంటారు. మన కర్మ ఫలాలు అన్నీ కుండలినిలోనే నిక్షిప్తం అయి ఉంటాయి. జీవితమంతా అంతా కుండలిని ఆజ్ఞ ప్రకారమే సాగుతుంటుంది.రాజయోగ సాధకులు కూడా దీన్ని అభ్యసిస్తారు. నూతన యోగ మార్గ ప్రవక్త మాస్టర్ CVV యోగ మార్గాన్ని అనుసరించే

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య “మదనుని తండ్రికి మజ్జనవేళ” శ్రీవేంకటేశ్వరునికి స్నానానంతరం జరిగే విశేష భోగాలను అన్నమయ్య వివరిస్తున్నాడు ఈ కీర్తనలో. మదనుడికే తండ్రి అయిన శ్రీనివాసుడు ఎంత అందగాడయి ఉంటాడు. ఆయనకు కర్పూరకాపు, పుణుగుకాపు, పన్నీరు కుంకుమకాపు వంటివెన్నో సేవలు చేస్తారు. ఆ వైభోగం విని మనమూ తరిద్దాం రండి అంటున్నాడు అన్నమయ్య. కీర్తన: పల్లవి: మదనుని తండ్రికి మజ్జనవేళ పొదిగొనీ సింగారపు భోగములెల్లాను ॥ మదనుని ॥ చ.1 పడఁతుల నవ్వులెల్లా పైనంటుకొన్నట్టు కడలేక పొగడొందెఁ గప్పురకాపు నిడివిఁ గల్ప వృక్షము నిండాఁ బూచినట్టు కడుఁ దెల్లనై యమరెఁ గప్పురకాపు ॥ మదనుని ॥ చ.2. సుదతుల చూపులు సొరిది పైఁగప్పినట్టు పొదిగొని జొబ్బిలీని పుణుఁగుకాపు అదన నల్లగలువలట్టె ముంచుకొన్నట్టు పొదలెఁ దిరుమేనను పుణుఁగుకాపు ॥ మదనుని ॥ చ.3. అలమేలుమంగ వురమందుండి యనురాగము కులికినట్టు పన్నీరుఁ గుంకుమకాపు యెలమి శ్రీ వెంకటేశుఁ

వీక్షణం-77

వీక్షణం
-- విద్యార్థి   వీక్షణం 77వ సమావేశం జనవరి 13, 2019 నాడు, శ్రీమతి విజయా ఆసూరి, శ్రీ వేణు ఆసూరి దంపతుల స్వగృహమునందు జరిగినది. భోగి పండుగ నాడు జరిగిన ఈ సమావేశం సంక్రాంతి సాహిత్య సభగా, ఒక ఆత్మీయ సమావేశంగా సాగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన వారు ఆచార్య చెన్న కేశవ రెడ్డి గారు. ఈ సభలో మొదటి అంశం రావి శాస్త్రి గారి "పిపీలికం" కథా పఠనం మరియు చర్చ. కథ ఎంత బాగుందో, వేణు ఆసూరి గారి కథా పఠనం కూడా అంత ఆసక్తికరముగా సాగింది. ఈ కథ గురించి వేణుగారు వివరిస్తూ, "రావి శాస్త్రి గారు ఆంధ్ర జ్యోతి పత్రిక వారివద్ద అప్పు తీసుకుని, ఆ అప్పు తీర్చటం కోసం వ్రాసి ఇచ్చిన బాకీ కథలలో పిపీలకం ఒక కథ" అని వివరించారు. ఈ కథ శ్రామిక వర్గాలలో చైతన్యం నింపే కథ. వేరే వారెవరూ కాకుండా, పీడిత ప్రజలు తమకు తాము చైతన్యవంతులై దోపిడీవర్గాలను ఎదుర్కోవటాన్ని తెలిపే కథ. కథా శైలి గురించి విపులంగా జరిగిన చర్చ ఆసక్తికరముగా సాగింది.

సారస్వతం

సారస్వతం
డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి (డా. జుర్రు చెన్నయ్య సౌజన్యంతో) తెలుగు గడ్డ మీద పుట్టిన, తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకొనే సాహితీమూర్తి 'సినారే' సాహిత్య సాగరం మీ గుప్పెట్లో ఉండాలనుకొంటున్నారా? అయితే, ఈ క్రింది వెబ్ సైట్ దర్శించండి. "కర్పూర వసంతరాయులు", "ఋతు చక్రం", "ప్రపంచపదులు", "విశ్వంభర", "గజల్స్" మొదలీనవి, ఇంకా ఇతర రచనలు ప్రింట్, ఆడియో, వీడియో రూపాల్లో చదవండి, వినండి, చూడండి! www.drcnarayanareddy.com