ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం
-సునీత పావులూరి
తిలక్ కవిత్వంలో భావ, అభ్యుదయ కవిత్వాలతో పాటుగా, రాబోయే అనుభూతివాద కవితా పరిణామం కన్పిస్తుందనీ, దానికి తిలక్ కవిత్వమే ఆరంభ సూచకమనీ టి.ఎల్. కాంతారావుగారు పేర్కొన్నారు.
1981లో ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు ఆలోచన అనే గ్రంథంలో ప్రత్యేకంగా 'అనుభూతివాదం' అనే వ్యాసాన్ని రాశారు. ఈ వాదం 'ఏ ఇజానికీ కట్టుబడి ఉందనీ’. ‘ఆత్మాశ్రయ కవిత్వానికి ప్రాణప్రదమైనదనీ’, అంతేకాక ‘అనుభూతికి అగ్రప్రాదాన్యం ఇస్తుంద’నీ వీరు చెప్పి సాహిత్యంలో దీనికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.
కడియాల రామమోహనరాయ్ గారు 1982లో "తెలుగు కవితా వికాసం" అనే గ్రంథంలో 'అనుభూతివాదం', ‘అనుభూతి కవిత్వం' అని పేర్లు పెట్టి ప్రత్యేకంగా రాయటం జరగలేదు. కానీ నూతన కవితారీతులను పరిచయం చేసేటప్పుడు మాత్రం 'అనుభూతివాదం', ‘అనుభూతి కవిత్వం', అనుభూతి కవుల' గురించి వీరు పేర్కోవటం జరిగింది. వీరు అనుభూతివాదాన్ని 'భావ కవితా సంబంధి'గానే చూసినా, ఈ