Author: Sujanaranjani

ప్రమీలాదేవి హఠాన్మరణం

జగమంత కుటుంబం
-తమిరిశ జానకి నవంబర్ ఒకటి 2018 వ తేదీన డా.మంగళగిరి ప్రమీలాదేవి గారు దివంగతులయ్యారు. ఆవిడ వయసు 75 సంవత్సరాలు. మచిలీపట్నంలో హిందూకాలేజ్ లో తెలుగులెక్చరర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు.చిన్నవయసులోనే సంగీతం లో డిగ్రీ పొందడమేకాక సాహిత్యంలో కూడా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. నలభైగ్రంధాలు రచించారు. తెలుగు, హిందీ, సంస్కృతం భాషలలో పాండిత్యంఉన్న వ్యక్తి. పదసాహిత్యంలో పరిశోధనలు చేసి పి.హెచ్.డి.పట్టా పొందారు.పదసాహిత్యపరిషత్ అనే సంస్థ స్థాపించి అనేక సాహిత్య సభలు మచిలీపట్నం లోనూ, హైదరాబాద్ లోనూ ఘనంగా నిర్వహించారు. ఆవిడ రాసిన పద్యగేయనాటికలకు 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.ఈమధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు ఆవిడకు సరస్వతీ సమ్మాన్ పురస్కారం ఇచ్చి సత్కరించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారం ఇచ్చి గౌరవించింది. సుమారు నలభై సంవత్సరాలుగా ఆవిడ నాకు మంచి స్నేహితురాలు. స

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి అనుభూతివాదం, అనుభూతి కవిత్వం అనే పేర్లు శ్రీకాంతశర్మగారి తర్వాత సాహిత్యంలో మరింత బలంగా పాతుకున్నట్లుగా తోస్తుంది. 1982లో నందిని సిద్దారెడ్డిగారి 'అనుభూతివాదం', 1982లో కొడవంటి లీలామోహనరావుగారి 'అనుభూతి కవిత్వం', 1983లో డా, ముదిగొండ వీరభద్రయ్యగారి 'అనుభూతి కవిత్వం' (కొన్ని వ్యాసాలు), 1987లో డా|| జి.వి. సుబ్రహ్మణ్యంగారి 'అనుభూతి కవిత్వం', 1989లో ఆర్. యస్. సుదర్శనంగారి ‘అనుభూతి కవిత్వం’ - ఈ వ్యాసాలన్నీ వివిధ పత్రికలలోనూ, సంకలన గ్రంథాలలోనూ ప్రచురితమయ్యాయి. వీరి తర్వాత పైన పేర్కొన్న విమర్శ వ్యాసాలు ప్రచురితం కావటమే ఇందుకు తార్కాణం. ఈ కాలంలో అత్యధిక విమర్శకులు అనుభూతిని కవిత్వ ప్రధాన లక్షణంగా గుర్తించటం కూడా మనం గమనించాల్సిన అంశం. కుందుర్తిగారి అనుభూతివాదం అనే పదాన్ని ప్రయోగించటమే కాకుండా, “తిలక్ తాను ప్రధానంగా అనుభూతి వాదినని బల్లగుద్ది చెప్పుకున్నాడు” అని వీరు చెప్పారు. “పాఠక

తనదాకావస్తే?

కథా భారతి
-డా. పి. కే . జయలక్ష్మి “అన్నయ్యా ! నీ దగ్గర రెండు పెన్సిల్ బాక్సులున్నాయిగా నాకోటివ్వవా!’’ గారంగా అడిగింది భవ్య. .’’అమ్మా ఆశ ! ఒకటి డాడీ కొన్నారు . ఇంకోటి నా బర్త్ డే కి నా ఫ్రెండు ఇచ్చాడు . ఐనా రెండో క్లాస్ లో ఉన్నావు, నీకప్పుడే పెన్సిల్ బాక్స్ ఎందుకే ? నాలాగా సిక్స్త్ కొచ్చాక ఇస్తాలే !” అన్నాడు వెక్కిరిస్తూ భరత్ ఇద్దరి సంభాషణ తన చెవుల్లో పడటంతో చేతిలో పని ఆపి నడుం మీద చేయి వేసు కొని ఏం మాటలు భరత్ ? అని కోప్పడింది తల్లి శ్రావణి . “లేకపోతే ఏంటమ్మా, నా దగ్గిర ఏం చూస్తే అవి తనకి ఇచ్చేయ మంటుంది చెల్లి...... ” ఇంకా వాడి మాటలు పూర్తవకుండానే “ తప్పేంట్రా ,అదేమైనా పరాయి పిల్లా ?నీ స్వంత చెల్లెలు . అన్న దగ్గిర ఏమైనా తీసుకునే హక్కు చెల్లికి కాక ఇంకెవరికి ఉంటుంది ? ఇవ్వడం అలవాటు చేసుకో ! ఆడపిల్లని బాధ పెట్ట కూడదు . ముందు దానికి ఆ బాక్స్ ఇచ్చేయ్ నేను చెప్తున్నాను ” అంటూ కసిరింది కొడుకుని . గొణుక్కు

సంగీత రంజని – డిసెంబర్ 2018

అనూష ఆరంగ్రేటం సిలికానాంధ్ర సంస్థ అమెరికాలో తెలుగు యువతకు కల్పిస్తున్న స్ఫూర్తితో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భారతీయ సంస్కృతిలో భాగమైన కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యత సంపాదించి ఆరంగ్రేటం చేసింది కూచిభొట్ల అనూష. అందుకు సంబంధించిన మూడూ కీర్తనలను వినండి. Nagumomu - Abheri - Anusha Kuchibhotla @ Shirdi Sai Parivar Nagumomu galaneni Ragam: Abheri Vocal : Anusha Kuchibhotla (disciple of Dr. Nagavalli Nagaraj) Violin: Sasidhar ... https://www.youtube.com/watch?v=rRSR5fQ5BZQ Nagumomu - Abheri - Anusha Kuchibhotla @ Shirdi Sai Parivar Jayalakshmi Varalakshmi - Vasantha- Anusha Kuchibhotla @ Shirdi Sai Parivar Jayalakshmi Varalakshmi Ragam: Vasantha Vocal : Anusha Kuchibhotla https://www.youtube.com/watch?v=ccdpCeNrz3M Abang Pandarise bhoot mote- chandrakauns - Anusha Kuchibhotl

నా శ్రీశైల యాత్ర అనుభవాలు

శీర్షికలు
ఉమాదేవి అద్దేపల్లి అసలు శివుడు అంటేనే గొప్ప ధన్వంతరి .ఆయుర్వేదానికి మారుపేరు .ఆయువును వృద్ది చెందించేది ఆయుర్వేదం .అందుకే అతను మృత్యుంజయుడు.హిమాలయ పర్వతాలు అతని ఆవాసాలు.అక్కడ ప్రవహించే నదీనదాలే కాదు ,ప్రతి చెట్టు ,ప్రతి వేరు ఔషదీ గుణాలను కలిగి ఉంటాయన్నది జగద్విదితమే.అంతటి మహిమాన్విత ప్రదేశాలలో నివశించే తపోధనులే కాదు సామాన్యవ్యక్తులు కూడా దీర్ఘాయురారోగ్యాలు కలిగి ఉంటారన్నది ప్రత్యక్ష ప్రమాణంగా చూచిన వారెందరో . హనుమంతుడు కూడా నేటికీ హిమవత్పర్వతాలలో జీవించే ఉన్నాడన్న నమ్మకం చాలామందికి వుంది.అక్కడ గాలి ,నీరు , హరిత సంపదతో అలరారే పరిశుద్ద వాతావరణంలో అడుగుపెట్టిన ఏ వ్యక్తీ అయినా తమకున్న రుగ్మతలన్నీ మందు మాకు అవసరం లేకుండానే పోగొట్టుకొని సంపూర్ణ స్వస్థతతో తిరిగి వస్తాడు. అంతటి దివ్య శక్తి సంపన్నమయిన హిమగిరులలో నెలకొన్న కైలాసపతి ఎక్కడ వుంటే అక్కడే ఆరోగ్యమనే మహాభాగ్యంతో తులతూగుతుంది ఆ పరమ శివుడు

వీక్షణం సాహితీ గవాక్షం- 75

వీక్షణం
వజ్రోత్సవ సమావేశం -ఆర్. దమయంతి కాలిఫోర్నియా బే ఏరియాలో నెలకొన్నవీక్షణం సాహితీ సంస్థ 75 మాసాలను పూర్తి చేసుకున్న శుభ తరుణాన వజ్రోత్సవ వేడుకలనుఎంతో ఘనంగా జరుపుకుంది. మిల్ పిటాస్ లో నివసిస్తున్నరచయిత శ్రీ అనిల్ ఎస్ రాయల్ గారి స్వగృహం లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆ నాటి సభలో పాల్గొన్న వారిలో తెలుగు సాహిత్యంలో ఘనాపాటీలు గా కీర్తింపబడుతున్నవారు, వేద పండితులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు, ప్రసిద్ధ కవులు, రచయితలు, విశేష విశ్లేషకులు,మధుర గాయనీ గాయకులు పాల్గొని , తమ తమ ప్రతిభాపాటవాలతోసభికులను రంజింప చేసారు. సభని ప్రారంభిస్తూ, డా. గంగిశెట్టిలక్ష్మీ నారాయణ వీక్షణం వారి సాహితీ సేవలనుకొని యాడారు. ఆనాటి ప్రధానోపన్యాసకులు, కేంద్రసాహిత్య అకడెమీ అవార్డ్ గ్రహీతలు అయిన శ్రీ సదాశివ మూర్తి గారిని గారిని వేదిక మీదకి సాదరం గా ఆహ్వానించారు. శ్రీ సదాశివ మూర్తి గారు - రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ

భయం వద్దు! జయమే నీ హద్దు!

సారస్వతం
-అమరనాథ్ జగర్లపూడి దుక్కి దున్నందే మొక్క మొలవదు! ప్రయత్నం చేయకుండా ఫలితం రాదు! జయానికి, అపజయానికి మూలాలివే. ప్రతి విజయం వెనక నిరంతర సాధన, ప్రతి అపజయంలో జయం సాధించటం వెనుక పట్టు వదలని దృఢ నిశ్చయం అనేది మరవద్దు! అపజయం అనేది ప్రతికూలం (నెగటివ్) కాదు తిరిగి ప్రయత్నం చేయకపోవటమే నిజమైన అపజయం. ఇది ప్రతి విద్యార్ధి , ప్రతి యువకుడు ఖచ్చితం గా మనస్సులో బలంగా ముద్ర వేసుకొని ప్రయత్నాలు ప్రారంభించాలి. నేటి విద్యార్ధి, యువత చదువుల్లో మరియు ఉద్యోగాల్లో ఉద్వేగాలకు ముగింపు చెప్పే సమయం ఆసన్నమైంది. దానికి తగ్గట్టుగా ధీటుగా చదువుల్లో నైనా,ఉద్యోగ ప్రయత్నాలలోనైనా పట్టువదలని కృషి పెరగవలసిన ఆవశ్యకం ఎంతైనా వుంది. ముఖ్యంగా విద్యార్థులైనా, యువకులైనా అవసరమైనప్పుడే అవగాహన పెంచుకుంటే చాలానే అభిప్రాయాలకు అడ్డుకట్ట వేసి నిత్య సాధన ద్వారా అనుకున్న ఫలితాలను అవలీలగా సాధించ వచ్చు .ఉదాహరణకు” ఈ రోజు పని రేపటికి వాయిదా వే