అహంకారం
-శారదాప్రసాద్
నిఘంటువు అర్థం ప్రకారం “అహం” అంటే “నేను”, “నా” అనే స్వంత సామర్థ్యానికి సంబంధించిన భావన. “నేను”, “నా”, అని సూచించేంతవరకు “అహం” అనేది ఒక పదం మాత్రమే. ఆత్మగౌరవానికి, అహంకారాకి తేడా ఏమిటంటే, “ఈ సామర్థ్యం నాకుంది” అనడం ఆత్మగౌరవం. “ఈ సామర్థ్యం నాకొక్కడికే ఉంది” అనడం అహంకారం . విద్య, ఐశ్వర్యం, అందం, అన్నిటిలో ఉన్నతులైన వారు రాణించాలంటే ముఖ్యంగా వారిలో ఉండవలసినది తగినంత అణకువ, వినయం . అహంకారానికి వయస్సు, ధన, కుల, మత ప్రాంత, భాష- ఇవేమీ సంబంధం లేదు. కొంతమంది (అతి)తెలివిగా తమ అహంకారాన్ని ఆత్మాభిమానం అని చెప్పుకుంటారు. అదే ఇతరుల గురించి చెప్పేటప్పుడు వారిది (అహంకారానికి) ‘గర్వం’ అని అంటారు. అహంకారం పెరిగితే ఈర్ష్య,అసూయ లాంటి మిగిలిన దుర్లక్షణాలు దాన్ని అనుసరిస్తాయి!పాండవుల కన్నా అన్నిటా నేనే గొప్పవాడిగా ఉండాలనే సుయోధనుడు దురాలోచనే కౌరవ వంశాన్ని నాశనం చేసింది. “మనోబుధ్ధి రహంకార చిత్తం