Author: Sujanaranjani

నువ్వుండగలిస్తే

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు ఎదుటివారితో నవ్వుతూ నువ్వుండగలిస్తే నోములన్నిటి ఫలితం నీకు వచ్చినట్లే! ఎదుటివారి తప్పులను నువ్వు క్షమించగలిస్తే పురుషోత్తముని అంశలో నువ్వు ప్రభవించినట్లే! ఎవరినీ నువ్వు వంచించకుండా వెళ్ళగలిస్తే వ్రతాలన్నిటి ఫలితం నిన్ను వరించినట్లే! ప్రశాంతంగా నువ్వు మనగలిస్తే పూజలన్నిటి ఫలం నీపరమైనట్లే! నిగ్రహంగా నువ్వుండగలిస్తే అనుగ్రహంతో నీజీవితం పండినట్లే! నీ చూపులో కరుణను కురిపించగలిస్తే సిద్దులన్నీ నీ సేవకులైనట్లే! నీ మాటలతో మధువులను ఒంపగలిస్తే మహిమలన్నీ నీ పరమైనట్లే! దగా చేయని జీవితం నువ్వు గడుపగలిస్తే దానాలు చేయటంవల్ల కలిగే దివ్యత్వం నీదరి చేరినట్లే! అబద్ధాలు ఆడకుండా నువ్వు నిలువగలిస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం నీకు అంటినట్లే! కోరికలను నువ్వు నిలువరించగలిస్తే కైవల్యం నీకై కాచుకుకూర్చున్నట్లే! *****

హనుమాన్ హేవన్

కథా భారతి
డా. తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం శ్రీనగర్ కాలనీ లో పని ముగించుకుని బయటకు వచ్చిన సీతారాం కు బస్ స్టాప్ లో నిలబడిన ఉమాపతి కనబడ్డాడు. అసలు అతను ఉమాపతి అవునా కాదా అని కాసేపు మల్ల గుల్లాలు పడ్డాడు. ఎందుకంటే ఉమాపతి ది నల్లటి నొక్కుల క్రాపు . దూరంనుండి చూస్తే ముక్కు మొగం ఉమాపతి లాగే ఉన్నా బట్ట తల చూసి అనుమాన పడ్డాడు. ఎందుకైనా మంచిదని దగ్గరగా వెళ్ళి చూసి అతగాడు తన స్నేహితుడు ఉమాపతే అని నిర్ధారించుకుని వెనుక నుండి వెళ్ళి వీపు మీద గట్టిగా చరిచాడు. ముందుకు పడ బోయిన ఉమాపతి నిలదొక్కుకుని "ఎవడ్రా ఆది "అంటూ రౌద్రమ్ గా వెనక్కి తిరిగాడు. ముప్పై రెండు పళ్ళు కనబడేలా నవ్వాడు సీతారాం. "ఇదే మరి. ముప్పై అయిదేళ్ళ దాకా పెళ్లి చేసుకోకండా ఉంటే నొక్కుల క్రాపు పోయి బట్ట తల రాదూ ? "స్నేహితుడి భుజాల చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు సీతారాం. సీతారాం ను చూడగానే ఉమాపతి ముఖం చేట అంత అయ్యింది. ఇంటర్ లో రెండే

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: అంబా యని శునకమరిచె నందరు మెచ్చన్ గతమాసం ప్రశ్న: వరదలు మేలుమేలనుచు పాడుచునాడిరి కేరళీయులే!! ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. గండికోట విశ్వనాధం, హైదరాబాదు కురిసెను వాన వెల్లువలు కుండలపోతగ రాష్ట్ర మంతటన్‌, విరిగెను వృక్షరాజములు, వీధులునిండ్లు మునింగె నీట, వే తెరగుల కష్ట నష్టములు తీరినవేళ స్వయంకృషోన్నతిన్‌ వరదలు మేలుమేలనుచు పాడుచునాడిరి కేరళీయులే. నేద

పతి పత్ని ఔర్ వహ్

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి సాయింత్రం రావాల్సిన మనోహర్ మధ్యాహ్నం ఒంటి గంటకే ఇంటికొచ్చి నిస్త్రాణగా సోఫాలో కూలబడ్డాడు. ఇన్నాళ్ళ టెన్షన్ కి తెరపడి మొత్తానికో లే ఆఫ్ నోటీసు చేతిలో పెట్టి రెండు నెలల జీతంతో వదిలించుకున్నారు తనని మేనేజర్లు. అమ్మాయి ఇప్పుడు కాలేజీలో చేరింది కనక ఇంట్లో ఉండేది తనూ, సంధ్యా మాత్రమే. ఆవిడ డాక్టరు కనక డబ్బులకేమీ ప్రస్తుతానికి ఢోకాలేదు కానీ …. ఆలోచనలు కట్టిపెట్టి, ఫోను తీసి సంధ్యకి ఫోన్ చేసాడు. డాక్టర్ గారు పేషెంట్ ని చూస్తున్నారుట మరో పావుగంటలో ఆవిడే పిలుస్తారని సమాచారం. చేసేదేమీ లేదు కనక ఉద్యోగంలో ఇప్పటివరకూ పోగేసుకున్న కాయితాలూ బాక్సులూ బేస్ మెంట్ లోకి చేరేసేసరికి గంటన్నర; అప్పుడు సంధ్య ఫోన్ చేసింది. ఉద్యోగం పోయినట్టు తెలియగానే ఆవిడే అంది, “పోనీలెండి ఇప్పుడు కాస్త ఇల్లు సర్ది, వంట వండుదురు గాని.” నవ్వేడు మనోహర్. సాయింత్రం మరోసారి మాట్లాడుకోవచ్చు అని నిర్ణయించుకున్నాక ఆవిడ ప

కన్నీటి మొగ్గలు

కవితా స్రవంతి
-డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ జీవితంలో సంతోషాలు అరుదెంచిప్పుడల్లా ఆనందభాష్పాలు కళ్ళల్లో కాంతులీనుతాయి కన్నీరు కళ్ళల్లో మొలిచే వెన్నెలపూలు ఆత్మీయమైన బంధువులు దూరమైనప్పుడల్లా మనసంతా మూగరోదనల సంధ్రమవుతుంది కన్నీరు హృదయవేదనను దించే ఉపశమనమాత్ర కష్టాల కడలిని నిరంతరం ఈదుతున్నప్పుడల్లా మనసులో కన్నీటి అలజడులే ఎగిసిపడుతుంటాయి కన్నీరు బతుకుపోరాటంలో భాగమైన ఆత్మీయనేస్తం అనంతమైన విషాదజీవితాన్ని గడుపుతున్నప్పుడల్లా మనసు తెగిన కాలువలా మౌనంగా రోదిస్తూంటుంది కన్నీరు బాధలను మరిపించే ఉద్వేగ జలపాతం దుఃఖాన్ని దాటుకుంటూ అడుగులు వేస్తున్నప్పుడల్లా జీవితం ఆనందవిషాదాల చదరంగమవుతుంది కన్నీరు జీవితాన్ని దాటవేసే అసలైన పన్నీరు

వీక్షణం-72 సమీక్ష

శీర్షికలు
-వరూధిని ఆగస్టు నెల వీక్షణం కాలిఫోర్నియా బే ఏరియా లోని స్వాగత్ హోటల్ లో 12 వ తారీఖున అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది.అధ్యక్షులు శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు ముందుగా మొదటి ఉపన్యాసకులు శ్రీ వేణు ఆసూరి గారిని ఆహ్వానించారు. ఆయన అర్మను హైసీ రచించిన "సిద్ధార్థ" నవలను సభకు పరిచయం చేసారు. కథని సూక్ష్మంగా పరిచయం చేస్తూ సిద్ధార్థ అనే యువకుడు గౌతమ బుద్ధుణ్ణి కలవడానికి వెళ్లడం, వరిరువురి మధ్య జరిగిన సంభాషణ, సన్యాసి సంసారిగా మారడం, తిరిగి సన్యాసిగా మారడం, చక్రభ్రమణం జీవితం అని తెలుసుకోవడం మొదలైన విషయాల్ని ఆసక్తి కరంగా వివరించారు. అధ్యక్షుల వారి మాటల్లో చెప్పాలంటే "వేణు గారు అత్యంత గహనమైన విషయాన్ని ప్రశాంతంగా విడమర్చి చెప్పారు". ప్రసంగానంతరం రచయిత జీవిత విశెషాలు, ఇతర రచనల గురించి కూడా వివరించారు.ఆ తర్వాత శ్రీమతి ఆర్. దమయంతి "డా||కె.గీత కవిత్వంలో స్త్రీ హృదయ స్పందన" అనే అంశమ్మీద ప్రసంగించారు. నారింజ చె

సంకీర్తనామృత సౌరభము

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు ప్రప్రధమ వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య 610 జయంతుత్సవం సంధర్భంగా సిలికానాంధ్ర మీ కందరికీ మా శుభాభినందనలు తెలియచేసుకొంటూన్నాము. తాళ్ళపాకవాసి విరచితమైన వేల పదకవితలు తామ్రపత్రాల ద్వారా దాదాపు 4 శతాబ్ధుల తర్వాత వెలుగులోకి రావడము, వివిధ మాధ్యమాల ద్వార ఇంటింటా పరిచయం కావడం ఒక యెత్తైతే, అన్నమయ్య లక్ష గళార్చన, అఖిల భారత అన్నమయ్య జయంతి మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగ వాటికి ఒక సమోన్నత స్థానాన్ని సాధించడానికి ఇతోధికంగా కృషి చేసింది మాత్రం ఒక్క సిలికానాంధ్ర మాత్రమే అని చెప్పవచ్చు. అన్నమయ్య కీర్తనలోని సాహిత్యాన్ని, చూసిన అసమాన వైవిధ్యాల్ని, చేసిన ప్రయోగాల్ని, ప్రక్రియల్ని ఒక మహాసాగరంతో పోల్చవచ్చు. ఐతే, సిలికానాంధ్ర చేసే ప్రయత్నాలు, ఆ సముద్రంలోని నీటిని తీరాన నిలబడిదోసిలితో పట్టుకోడానికి చేస్తున్న చిన్న కృషి మాత్రమే కావచ్చు. కాని, మొక్కవోని ఈ సంకల్పం భావి

ఆవేశాలే మానవ జీవితాలకు అనర్ధాలు

ధారావాహికలు
అమరనాథ్. జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ 9849545257 ఆవేశ మనేది ఒక అగ్ని లాంటింది ఇది ఆవేశపడే వారినే కాదు ఒక్కొక్కసారి తోటివారిని కూడా దహించి వేస్తోంది వేగంగా మారుతున్నఈనాటి సామాజిక పరిస్థితులలో ప్రతి రోజు ఈ ఆవేశాలకు బలిపీఠం ఎక్కుతున్నవారికి సంబంధించిన వార్తలు రాని పత్రికలు, మీడియాలు, సామాజిక మాధ్యమాలు లేవంటే అతిశయోక్తి లేదు! అనేక కుటుంబాలు, యువకులు, విద్యార్థులు, వ్యాపార వ్యవహారాలలో వున్నవారు ఒకరేమిటి అన్ని రంగాలలో వారిని ఈ భావోద్రేకాలు ఆవరించి దాని ఫలితంగా అసహనాలు పెరుగుతూ అవే ఆవేశాలకు ఆజ్యంగా మారి అనేకానేక జీవితాలు నేల కూలుస్తున్నాయి. అనర్ధాలకు మూలం ఆవేశం అని తెలిసినా కూడా ఆవేశానికి మూలాలు కనుగొని దానిని నియంత్రించడంలో మనము ఇంకా వెనుక పడే వున్నాము. ఆవేశమనేది ప్రమాదకారిగా మన జీవితానికి ప్రతిబంధకంగా ఉంటుందో తెలిసి కూడా నియంత్రణ అనేది ఒక్కొక్కసారి మన చేయిజారి పోవటం విచారకరం. ఈ ఆవేశమ