దృగ్దృశ్య వివేకం
-శారదాప్రసాద్
ఈ ప్రపంచంలో ఉన్న సకల మానవాళిని మూడు విధాలుగా వర్గీకరించవచ్చు! మొదటి వర్గం -పరమాత్మను గురించి తెలియని వారు . వీరే అజ్ఞానులు.రెండవ వర్గం -పరమాత్మను గురించి తెలుసుకోవటానికి తపనపడేవారు. వీరిని జిజ్ఞాసువులు అంటారు.ఇక మూడవ వర్గం --పరమాత్మను గురించి తెలిసినవారు.వీరిని జ్ఞానులు అనొచ్చు! వీరందరూ కూడా ప్రపంచాన్ని వారి వారి దృష్టిలో చూస్తారు.దృగ్దృశ్య వివేకం అనే ఈ గ్రంధం మూడవ వర్గం వారి కోసం వ్రాయబడింది .నిత్యానిత్య వస్తు వివేకం వలన మాత్రమే వైరాగ్య భావం ఏర్పడుతుంది.ఇటువంటి విశ్లేషణం వలన మనసులో ద్వద్వములు లేకుండా పోతాయి.అలా వైరాగ్యం ఏర్పడుతుంది.దృగ్ -దృశ్యం అంటే ఏమిటని కదూ మీ సందేహం?సాధారణ భాషలో చెప్పాలంటే-- చూచేది చూడబడేది -వీటిని గురించి తెలుసుకోవటం.
నాలుగు వివేకములను పూర్తి చేసిన సాధకుడు, దృక్ దృశ్య వివేక పరిధిలోకి వస్తాడు.
1) నిత్యానిత్యవస్తువివేకము.
2) ఆత్మానాత్మవివేకము
3)