శ్యామల
బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు
ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!)
రజనిగంధం
(నిన్న విశాఖసాహితి వారు బాలాంత్రపు రజనీకాంతరావుగారి సాహిత్య సంగీత సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో నా ప్రసంగ సారాంశం. ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి అధ్యక్షతన, ఆచార్య
ప్రసన్న కుమార్ గారి ప్రధానోపాన్యాసంతో, ఆచార్య వేదుల సుబ్రమణ్యం గారు, ఎఐఆర్ నుంచి వచ్చిన వక్తలు ఆచార్య సూర్యారావు తదితర వక్తలు ప్రసంగించి సభని సుసంపన్నం చేశారు. మండపాక శారద గారి శిష్యులు, మరియు డా. కమల, శ్రీమతి రాజేశ్వరి సరస్వతి తదితరులు రజని పాటలు పాడి శ్రోతలనలరించారు.)
ఏ దృక్పధంతో చూసినా రజనీకాంతరావు గారు ఒక సంస్థ. ఒక కళ కాదు ఒక సంగీతం కాదు ఒక కవిత్వంకాదు. ఏది తల్చుకున్నా ముందుండే పేరు రజని గారిది. అరు ఏఐఆర్ విజయవాడలో వుండి చేసిన సాహితీ సేవ,