Author: Sujanaranjani

ఋతు గీతం

కవితా స్రవంతి
-వెన్నెల సత్యం రాత్రి నిద్ర పట్టని మహానగరం రోడ్లన్నీ ఆవలింతలతో జోగుతున్నాయి! బయటికి అడుగు పెడ్తున్న మనుషులంతా టోపీల్తో మంకీ లై పోతున్నారు!! కిటికీ పక్షులు రెక్కలు విదిల్చడానికి ప్రయత్నిస్తూ వణుకుతున్నాయి! చెట్ల ఆకులు లోలోపల భయపడుతూ మంచు ముత్యాలు రాలుస్తున్నాయి!! బకెట్లో నీళ్ళు కరచాలనం చేయబోతే కస్సుమంటూ కరుస్తున్నాయి! చలితో పోరాడలేక దేహంలో రక్త కణాలు గడ్డకడ్టుకు పోతున్నాయి!! ఏ తోడూ లేని ఒంటరి జీవులు పంజా విసిరే చలిపులి మీద తిట్లదండకం వల్లిస్తున్నారు! తోడు దొరికిన అదృష్టవంతులు రాగాల దుప్పట్లో చేరి యుగళ గీతాలు పాడుతున్నారు!! పాల బుగ్గల పాపాయిలు ఋతువుల దోబూచులాటని పసి పాదం తో తన్నేసి వెచ్చని అమ్మ ఒడిలో ఆదమరిచి నిద్రిస్తున్నారు!!! ****

చిత్ర రంజని మే 2018

చిత్ర రంజని
మిల్పీటస్ పట్టణంలోని రాంచో మిడిల్ స్కూల్ (Rancho Middle School) విద్యార్థులు ఆర్ట్ క్లాసులో (Art Class) గీసి, గ్రంథాలయంలో ప్రదర్శించిన చిత్రాల్లోని నలుపు-తెలుపు (Black and White) చిత్రాలు కొన్ని. (Credits to students and their teacher James Coulson)

సంగీత రంజని మే 2018

610వ అన్నమయ్య జయంత్యుత్సవం లో భాగంగా మిల్పీటస్ లో ఏప్రిల్ 22 న జరిగిన ప్రాంతీయ పోటిల్లో కర్ణాటక సంగీత విదుషీమణి శ్రీమతి NCS రవళి కచ్చేరీ ఇచ్చారు. మృదంగంపై నటరాజన్ శ్రీనివాసన్, వీణపై హృషీకేశ్ చారి సహకారం అందించారు.    

ప్రేమలేఖ

కవితా స్రవంతి
- అరాశ నేనిట సేమమే యచట నీవును సేమముగా దలంచెదన్ మానితివేల జాబులను మానసవీధిన మీ విహారమే గాన రుచించదోగిరము కంటికి నిద్దుర రాదు నన్ను నీ దానిగ జేసికొమ్ము సరదా కయి నన్ విడబోకురా ప్రభో గండు తుమ్మెద నీట కమలమున్ గనుగొని ఝుంఝుమ్మనుచు పాడె చూడరమ్ము జంట పక్షులు కొమ్మనంటి కూర్చొని ప్రేమ కబురులు వినిపించె కదలి రమ్ము తరువును లతయిట పెరిమతో పెనవేసి విరులను వెదజల్లె నరయ రమ్ము అలలతో కదలాడి యవనిని ముద్దాడు కడలిని కనులార గనగరమ్ము పురుషునిన్ జూచి ప్రకృతియే పులకరించె ప్రకృతి గాంచిన పురుషుడే పరవశించె కనులు గనియెడి దృశ్యమే మనసు జేరి కలత రేపిన వైనమే గనుము నేడు కోరను కోటి రూకలను కోరనవెన్నడు మేడ మిద్దెలన్ గోరను పట్టు వస్త్రముల గోరను హేమ విభూషణావళుల్ కోరను విందు భోజనము కోరను నిత్య విహారమెప్పుడున్ కోరెద నొక్కటే యమిత కూరిమి కోరిక దీర్చరమ్మురా తలుపు చప్పుడు వినినంత తరలి జూతు పిలుపు విన నీవెనంచని పల

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
దేవీదేవరల శృంగార సంవాదము -టేకుమళ్ళ వెంకటప్పయ్య సంవాదము అంటే ప్రశ్నోత్తర రూపమగు సంభాషణము అని అర్ధం ఉన్నది. శృంగారంలో నాయిక అలక వహించి యున్న సమయంలో నాయకుడు శృంగారంగా ఏదో అడగడం దానికి నాయిక పైకి కోపం నటిస్తూనే లోపల ప్రేమ దాచుకుని చిరుకోపం నటిస్తూ సమాధానాలనిస్తూ ఉంటుంది. నాయికా నాయకుల సంభాషణలు మనకు పోట్లాటలాగా అనిపించినా అవి అన్నీ శృంగార సంభాషణలలోని భాగమే! నాయికను వశపరచుకోడానికి నాయకుడు అలాగే నాయకునికై నాయిక సత్యభామలా కోపం నటించడం ఇవన్నీ ఉత్తుత్తవే! అమ్మ అలమేలుమంగమ్మను శ్రీనివాసుడు ఏవిధంగా తన సంవాదంతో స్వాధీన పరచుకుంటాడో అన్నమయ్య ఈ కీర్తనలో తెలియజేస్తున్నాడు. ఈ కీర్తనలో అన్నమయ్య నాయకుని చేత నాయికతో శ్రీనివాసునితో ఏమి చెప్తున్నాడో చూద్దాం. కీర్తన: పల్లవి: మగువ నేరుతువే మాఁటలు । నీవు తగిలి తెలుసుకో తారుకాణలు చ.1. చెనకేనే వో చెలియా - నీ చెనకులే కావా చెక్కులవి పెనఁగకు చనుఁగవ పిసికేనే

శామీల నభోగము

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి మే నెలాఖర్న రోహిణీ కార్తి ఎండలు దంచుతుంటే, తన ఆశ్రమంలో ఏ.సి. గదిలో చుట్టూ శిష్యగణం కూర్చునుండగా మీరోజు న్యూస్ పేపర్ చదువుతున్న యోగీశ్వరుడు ఒకసారి అయిదో పేజీ తిరగేసి ఓ చిన్న న్యూస్ ఐటం చదివాక యధాలాపంగా చిరునవ్వుతో ఆ పేపర్ పక్కన పారేసి ధ్యాన ముద్ర వహించాడు. కిందన నేలమీద కూర్చున్న శిష్యులు వెంట వెంటనే తమలో తాము మాట్లాడుకోవడం ఆపి సర్దుకుని కూర్చున్నారు గురూగారితో పాటు ధ్యానానికి. కంగారుగా గురువుగారి అంతర్గత శిష్యులు ఆయన పక్కన పారేసిన పేపరూ, అవీ తీసి బయటపారేసి చుట్టూ శుభ్రం చేసారు ధ్యానం చేసుకునే గదిలో. పావుగంట మౌనంగా గడిచేక ఇంకా అందరూ ధ్యానంలో ఉండగానే గురువుగారి గంభీరమైన కంఠం వినిపించింది, “వచ్చేనెల నాలుగో తారీఖునుంచి ఆరో తారీఖులోపు మన హైద్రాబాద్, చుట్టుపక్కల ఊళ్ళలో శామీల నభోగం రాబోతోంది. అది నా అంతర్గత శిష్యులకే కాక మొత్తం అందరిమీదా విస్తరించబోతోంది. అదృష్ఠవంతులైన వాళ్ళు

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి ఇందులో వాస్తవికానుభూతి లేదని ఎలా చెప్పగలం? తేలిందేమంటే ఏ కవిత్వమని నువ్వు పేరు పెట్టుకున్నా, ఏ ప్రక్రియలో నువ్వు రాస్తున్నా అది నిజంగా కవిత్వమే కనుక అయితే అనుభూతికి అది దూరంగా ఏమాత్రం ఉండదు. కాకపొతే తరతమ భేదాలుంటాయి. అంతే. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. “భారతీయులు - ఆ మాటకొస్తే మార్క్సిస్టులు కాని వారందరూ భావించే సామాజికానుభూతికిన్నీ మార్క్సిస్టులు చెప్పే అనుభూతికిన్నీ ఎంతో భేదం ఉంది. మార్క్సిజం వల్ల సాంఘిక వ్యవస్థలోని కొన్ని రంగాలలో సుస్థితి ఏర్పడుతుందని నమ్మేవాళ్ళు కూడా అనుభూతి విషయంలో వారి దృక్పథాలను అంగీకరించారు. మార్క్సిజంకు కట్టుబడిన అభ్యుదయ రచయితలూ, విప్లవ రచయితలూ సమాజ వ్యక్తిలోని వాస్తవానుభూతిని, విజ్ఞానానుభూతిని అంగీకరింపగలరేమో కాని మిగిలిన మూడూ వారి దృష్టిలో మృగ్యాలే లేదా మిధ్యలే. ఆ మూడు ప్రవృత్తులను స్పృశించే కవితా చైతన్యాలను వారు వ్యక్తివాద ధోరణ

ఈసునసూయలు

సారస్వతం
-శారదాప్రసాద్ ​ తెలుగు సినిమాల్లో నాకు నచ్చిన పాటల రచయితలలో శ్రీ పింగళి గారు ముఖ్యులు! ఆయన మాటలతో చక్కని ప్రయోగాలు చేస్తుంటారు. 'ఏమి హాయిలే హలా' హలా అంటే హలో అనుకోవచ్చు!వై గురూ?(ఎందుకు గురూ). ఇలా చాలానే ఉన్నాయి ఆయన ప్రయోగాలు. ఈ మధ్య ఒక యువకుడితో కలసి టీవిలో విజయావారి 'మిస్సమ్మ' చూడటం తటస్థించింది. అందులోని పాటలన్నీ ఆణిముత్యాలే! అన్నీ పింగళి విరచితాలే!' బృందావన మందరిది, గోవిందుడు అందరి వాడేలే!' అనే పాటలో 'ఎందుకే రాధ ఈసునసూయలు?' అనే చరణం వస్తుంది. ఆ పాట టీవిలో అయిపోగానే నాతో సినిమా చూస్తున్న యువకుడు అసహనంగా --'మీరేమో పాత సినిమాలు చూడమంటారు. వాటిల్లోని పాటలకు అర్ధం పర్ధం ఉండదు.కాకపోతే, 'ఈసునసూయలు' ఏమిటండీ?'అని తన అయిష్టతను వ్యక్తం చేసాడు.నిజానికి అతనికే కాదు, మనలో చాలామందికి కూడా 'ఈ సునసూయలు' అంటే అర్ధం తెలియదు.అసలు దాన్ని గురించి మనసు పెట్టి ఆలోచిస్తే కదా అర్ధం తెలిసేది! వెంటనే ఆ యువకుడిని

జీవితం

కవితా స్రవంతి
- అభిరామ్ ఆదోని జీవితమంటేనే కలల సాగర కడలి ఆ కడలి కదలిక పై రెండు మనసులు ఏకమై కష్ట సుఖాల్లో మమేకమై ఒకే మాటల తెడ్డు పట్టి ఒకరికొకరు వెన్నుతట్టి ఆశల అలలకు ఆగకుండా కోరికల కెరటాలకు చిక్కకుండా సంసార పడవను ముందుకు నెట్టినపుడే ఆ వంశ వృక్షంలో మొలకెత్తే అంకురం వెండి గిన్నెలో బంగారమై భద్రంగా ఎదుగుతుంది జీవన పరమార్ధము తెలుస్తుంది

ఆలోచిద్దాం @ అడుగులేద్దాం

శీర్షికలు
వేసవి సెలవుల్లో ... -అమరనాథ్ జగర్లపూడి వేసవి సెలవల్లో ……. హాయి హాయిగా! జాలీ జాలీగా వేసవి వస్తోందంటేనే విద్యార్థుల్లో ఆమ్మో అనే పరీక్షల ఉద్యేగం! వేసవి వేడి కంటే పరీక్షల వేడి విద్యార్థుల ఫై ఎక్కువ ప్రభావం చూపుతుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడెప్పుడు పరీక్షలు అవుతాయా వేసవి శెలవలెప్పుడు వస్తాయా! వేసవి శెలవల్లో ఏమేమి చేయాలా అనే ప్రణాళికలు విద్యార్థుల మెదళ్లలో తయారౌతాయి కూడా! సంవత్సరం పాటు సాగిన చదువుకు ముగింపుగా జరిగిన పరీక్షల తర్వాత వచ్చే శెలవులు నిజంగానే పిల్లల మనస్సులో సంతోషం నింపటమే కాదు వారికి మానసిక ఉత్సాహానికి నిజమైన ఆటవిడుపుల విడిది కూడా ఈ వేసవి శెలవులు. పరీక్షల ఒత్తిడి నుండి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపటానికి ప్రతి విద్యార్ధికి ఒక చక్కని అవకాశం ఈ వేసవి శెలవులు! ఏదో ఎండ వేడిమికి ఇంట్లో కాలక్షేపానికి మాత్రమే కాదు ఈ శెలవులు. ఈ శెలవల్లో తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన విషయాలెన