ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం
భావకవితాయుగ ప్రతినిధిగా కృష్ణశాస్త్రిని చెప్పుకున్నా ఆయన మధ్యమమణిలా ప్రకాశించినవాడు. కాబట్టి ఆధ్యంతాలూ పరిశీలిస్తేనే కానీ భావకవితాయుగంలోని అనుభూతి తత్త్వాన్ని చర్చించినట్లూ కాదు. ఈ నవ్యకవితానికి నాందీ వాక్యం పలికింది ఎవరన్న వివాదం జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి రాయప్రోలు, గురజాడవారలు చెరో రీతిలో నవ్యకవిత్వ లక్షణాలను వెల్లడించారని చెప్పుకోవచ్చు. ప్రణయ కీర్తనం గురజాడవారిలో ఉన్నా, సంస్కరణాభిలాష వారిలోని తీవ్రత.
“మర్రులు ప్రేమని మదిదలంచకు
మరులు మరలును వయసుతోడనె
మాయమర్మములేని నేస్తము
మగువలకు మగవారి కొక్కటె
బ్రతుకు సుకముకు రాజమార్గము"
వంటి గేయాలలో ప్రేమకీర్తన కన్పిస్తుంది.
సమకాలీనంలో దేశంలో ఉన్న కులాల కుమ్ములాటలను చూసి,
“మంచి చెడ్డలు మనుజులందున
ఎంచి చూడగ రెండెకులములు
మంచియన్నది మాలయైతే
మాలనే అగుదున్"
అని ఎలుగెత్తి చాటాడు. ఈ విధంగా సంస్కరణవాదిగా ప్రేమను వ