Author: Sujanaranjani

ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం

సారస్వతం
భావకవితాయుగ ప్రతినిధిగా కృష్ణశాస్త్రిని చెప్పుకున్నా ఆయన మధ్యమమణిలా ప్రకాశించినవాడు. కాబట్టి ఆధ్యంతాలూ పరిశీలిస్తేనే కానీ భావకవితాయుగంలోని అనుభూతి తత్త్వాన్ని చర్చించినట్లూ కాదు. ఈ నవ్యకవితానికి నాందీ వాక్యం పలికింది ఎవరన్న వివాదం జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి రాయప్రోలు, గురజాడవారలు చెరో రీతిలో నవ్యకవిత్వ లక్షణాలను వెల్లడించారని చెప్పుకోవచ్చు. ప్రణయ కీర్తనం గురజాడవారిలో ఉన్నా, సంస్కరణాభిలాష వారిలోని తీవ్రత. “మర్రులు ప్రేమని మదిదలంచకు మరులు మరలును వయసుతోడనె మాయమర్మములేని నేస్తము మగువలకు మగవారి కొక్కటె బ్రతుకు సుకముకు రాజమార్గము" వంటి గేయాలలో ప్రేమకీర్తన కన్పిస్తుంది. సమకాలీనంలో దేశంలో ఉన్న కులాల కుమ్ములాటలను చూసి, “మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండెకులములు మంచియన్నది మాలయైతే మాలనే అగుదున్" అని ఎలుగెత్తి చాటాడు. ఈ విధంగా సంస్కరణవాదిగా ప్రేమను వ

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనటానికి విచ్చేసిన అతిధుల్లో కొందరిని కలిసినప్పటి చిత్రాలు

సీతాకాంత మహాపాత్ర (ప్రముఖ ఒరియా కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత); పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ (రచయిత) సత్యవ్రత్ శాస్త్రి (జ్ఞానపీఠ పురస్కార గ్రహీత - సంస్కృతం; ఎడమనుండి మూడు) కారా మేస్టారు (కాళీపట్నం రామారావు, ప్రముఖ కథారచయిత, కథానిలయం వ్యవస్థాపకుడు) కె. శివారెడ్డి (సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత, ప్రముఖ కవి) అంపశయ్య నవీన్ (సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత, ప్రముఖ నవలా రచయిత) సుధామ (సాహితీవేత్త) కె.దేశికాచారి (కెనడా, 1990లలో కంప్యూటర్లలో పోతన లిపి, పోతన కీబోర్డు శ్ర్ష్టికర్త) కుప్పిలి ఫద్మ (రచయిత్రి) జగన్నాథశర్మ (నవ్య వారపత్రిక సంపాదకుడు, సాయి బ్రహ్మానందం గొర్తి (బే ఏరియ రచయిత) బి.యెస్.రాములు (ప్రముఖ దళితవాద రచయిత) డా. సూర్యా ధనంజయ్ (తెలుగు శాఖాధిపతి, ఉస్మనియా విశ్వవిద్యాలయం) కాట్రగడ్డ దయానంద్ (కథా రచయిత) కె.వి.నరేందర్ (కథ రచయిత, కరీం నగర్ జిల్లా) గంటాడ గౌరీనా