Author: Sujanaranjani

కొన్ని విశేషాలు

సుజననీయం
-తాటిపాముల మృత్యుంజయుడు ఈ నెల సంచికలోని కొన్ని విశేషాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. - శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది ఉత్సవం మార్చి 17న జరుగుతుంది. డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి 'అచ్చ తెలుగు అవధానం' ఈ ఉత్సవ ప్రత్యేకత. వివరాలు 'ఈ మాసం సిలికానాంధ్ర ' లో చూడండి. - సిలికానాంధ్ర తెలుగుభాషకు మనబడి ద్వారా చేస్తున్న సేవను గుర్తించి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ 'స్ఫూర్తి ' అవార్డును అందజేసింది. వివరాలు 'ఈ మాసం సిలికానాంధ్ర ' లో చూడండి. - కొత్త శీర్షికలు 'మల్లె మాటలు ', 'మహాకవుల భావచిత్రాలు 'మొదలయ్యాయి. 'ధారావాహికలు ' శీర్షికలో చదవండి. - వంగూరి కథల పోటీ వివరాలకై 'జగమంత కుంటుంబం'లో చూడండి. - సుజనరంజనిలో దిగ్విజయంగా నడిచిన 'సత్యమేవ జయతే' పుస్తకరూపంలో వచ్చింది. వివరాలకు 'ధారవాహికలు ' లో 'పుస్తక సమీక్ష ' చూడండి. పాఠకులందరికి శ్రీ విళంబ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

తెలుగు వైతాళికులు

Uncategorized
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రవీంద్రభారతి భవనంలో అలంకరించిన తెలుగు మహనీయుల చిత్రాలు (నోటు: వీళ్ళే కాక తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన, సువాసనలు అబ్బిన మరెందరో ఉన్నారన్న విషయం మనకు విదితమే)

ఈ మాసం సిలికానాంధ్ర

Uncategorized
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న సిలికానాంధ్ర బృందం (పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారితో) ముఖ్యమంత్రి విదేశీ ప్రతినిధులకు ఏర్పాటుచేసిన విందులో సిలికానాంధ్ర బృందం ముఖ్యమంత్రి ప్రగతిభవన్ లో మాట్లాడుతున్న మృత్యుంజయుడు

సంయుక్తాంధ్ర సాహిత్య క్షేత్రం

కవితా స్రవంతి
రచన: విద్వాన్ శ్రీమతి జి సందిత, అనంతపురము (సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ గురజాడ జాతీయవిశిష్ట సాహితీ సేవా పురస్కార గ్రహీత) తెలుగురాష్ట్రాన్నెవరో ముక్కలు చేశారంటారేంటి? కళ్ళుంటే చూడండి.... రాష్ట్రాన్నేలే ఏలిక తెలంగాణా చంద్రన్న గురువుపాదంపై నుదురానించి మ్రొక్కి... రాష్ట్రాల్నేకాదు ఉత్కృష్టాంధ్రభాషాప్రపంచాన్నే ఏకంచేస్తున్నాడిక్కడ! నన్నయాదికవుల్ని ఈ ఏడాదికి బ్రతికున్న కవులతో కలిపి పరభాషా వ్యామోహపు పులికి బలియైపోతున్న తెలుగులిపిని కోట్లాదిగుండెల్లో నిలిపి పలికించి .. తెలుగుతల్లి పలుకుల్ని విలువల్ని బ్రతికిస్తున్నాడిక్కడ! ప్రజాసమస్యల్ని పరిష్కరిస్తూనే ఆకాశవాణి హైద్రాబాద్సాక్షిగా తెలుగుసమస్యాపరిష్కారాల్ని సంధిస్తున్నాడిక్కడ ! స్వార్థంకోసం ఆస్తులకోసం అన్నదమ్ములే శత్రువులై దాయాదుల్ని చంపుకునే .... కురుక్షేత్రాన్నికాదు తెలుగుకోసం ..భాష అస్థిత్వం కోసం సోదరులందరెేకమై ఆత్మీయతల్ని