అమావాస్యలో పున్నమి
మొక్కపాటి పూర్ణిమ సుధ
విజయవాడ - రేడియో మిర్చి
రా..! కొన్ని క్షణాలని అరువు తెచ్చుకుందాం..! కాలంతో పాటు పరుగులు తీసే మన
అహాన్ని, ఆత్మాభిమానం అనే ముసుగులో కప్పెట్టి, దర్పపు పూత పూసిన పొడి మాటలతో
నెట్టుకొస్తున్నది చాలు సాధికారత - అస్థిత్వాల అన్వేషణలో మనల్ని మనం చంపుకున్న
మాటల తూటాల్ని మూట కట్టి స్మార్ట్ ఫోన్లలో సమాధి చేద్దాం... ప్రైవసీ
సెట్టింగుల్లోని ప్యాటర్న్ అన్లాక్ ని తెలుసుకోవాలనే అత్యుత్సాహాన్ని కాసేపు
పక్కనెట్టి మన మనసుల్ని అన్లాక్ చేసే ప్యాటర్న్ కనుక్కునేందుకు ఒక్కసారైనా
ప్రయత్నిద్దాం... నీలోని ఆక్రోశాన్ని, నాలోని ఆవేదనని వెళ్ళగక్కి, అహాల
అద్దాలు భళ్ళున బద్దలయేదాకా మౌనాలనే బాణాలతో ఇద్దరి అస్థిత్వాన్ని చెరిపి, మన
అనే సరికొత్త ప్రపంచంలోకి అడుగిడుదాం..! మహా అయితే, ఖర్చయ్యేది, కొన్ని
కొన్నీళ్ళు..! కొన్ని క్షమాపణలు...!! అదీ మంచిదే..! ఎన్నాళ్ళయిందో ఆ కళ్ళని
కడిగి... నీకోసం ఆ మాత్