మరికొన్ని నివాళులు
బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు
(ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!)
జేజి మావయ్యా తిరిగి రావూ ?
-వీర నరసింహ రాజు
జేజి మావయ్యా … నేను దిబ్బ రొట్టి అబ్బాయిని. ప్రొద్దున్నే మీరు రేడియో లో ఆరంభించిన భక్తి రంజని వింటే బోలెడు భక్తి వస్తుందని మా జేజమ్మ చెప్పేది . అందులోనూ ఆదివారం వస్తే శ్రీ సూర్య నారాయణా మేలుకో హరి సూర్యనారాయణా వింటుంటే భలే భలే ఈ రోజు ఆదివారం స్కూల్ కి సెలవు దినం అని గుర్తుకు వచ్చి ఎంచక్కా ఆడుకోవచ్చని అనిపించి సూర్యదేవుడికి మొక్కేసి మళ్ళీ జేజమ్మ వచ్చి అరిచే దాక ముసుగు కప్పేసేవాడిని
తెలుసా. ఇంతలో "రారే రారే పిల్లలారా " అనే పాట వింటే ఉత్సాహం పొంగుకొచ్చెదనుకో . అమ్మ , జేజమ్మో మాకు తాయిలం పెడుతుంటే "తాయిలం పాట" గుర్తొస్తుంది .చిన్నపుడు జేజమ్మ వాళ్లకు కూడా తెలియని ధర్మ
సందేహాలు తీర్చేట్ట