సేకరణ: డా.కోదాటి సాంబయ్య
(రెండవ భాగం)
ద్వాదశ స్వర స్తానములు :- రెండు శ్రుతులకు లేక రెండు స్వరములకు గల వ్యత్యాసమును ' అంతరం ' ( difference ) అంటారు. సంగీతములో ద్వాదశ స్వరాంతర్గత
స్థానములను చెప్తారు. సప్త స్వరముల లోని షడ్జ, పంచమ ములకు వికృతి భేదములు లేవు. రిషభ, గాంధార, మధ్యమ, దైవత, నిషాధ ములకు ప్రక్రుతి, వికృతి బేదములు రెండూ కలవు. అందువల్ల షడ్జ , పంచమ ములను ప్రక్రుతి స్వరములని, రిషభ , గాంధార, మధ్యమ, దైవత, నిషాధ స్వరములను వికృతి స్వరములు అని పేరు.
ఈ విధమైన తేడాలు హిందుస్తానీ, పాశ్చాత్య సంగీతం లో కూడా కలవు.
మూర్చన :- ఏదైనా ఒక రాగం లో రాగల స్వరముల ఆరోహణ, అవరోహణ లను కలిపి మూర్చన అంటారు. మానవ దేహమునకు ఆస్థి పంజరము ఎలా ఆధారభూతమో
ఒక రాగానికి కూడా మూర్చన అలా అధారమవుతుంది. ఆస్థి పంజరానికి పైన మాంసము తదితర అంగములు సమకూరి మానవ శరీర మవుతుంది అలాగే వాగ్గేయకారులు ఒక రాగ మూర్చనకు రాగ ప్రయోగాలు, రంజక