ధారావాహికలు

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
- డా. అక్కిరాజు రమాపతిరావు యుద్ధంలో ఇంద్రజిత్తు మాయాసీతను సంహరించటం శ్రీరాముడి నిర్ణయం తన మాయాబలంతో ఇంద్రజిత్తు తెలుసుకున్నాడు. వెంటనే లంకలోకి పారిపోయినాడు. జరిగిన రాక్షస మారణహోమాన్ని తలచుకొని మరింత క్రుద్ధుడై రామలక్ష్మణులకు దూరంగా ఉన్న లంక పశ్చిమద్వారానికి వెళ్ళాడు. వానరులూ, రామలక్ష్మణులూ శోకోపహతచేతనులై, నిస్తేజులై, నిర్వీర్యులైపోయే ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక మాయాసీతను సృష్టించి తన రథంపై ఆసీనురాలిని చేశాడు. ఆ మాయాసీతను తాను సంహరించి వానరులను భ్రమింపచేసే పూనికతో యుద్ధరంగంలో నిలిచాడు. ఇంద్రజిత్తు మళ్ళీ యుద్ధభూమికి రావడం వానరసేనా, శ్రీరామలక్ష్మణులూ చూశారు. క్రోధవివశులైనారు. హనుమంతుడు ఒక పర్వతశిఖరాన్ని ఇంద్రజిత్తుపై విసరడానికి ఉద్యుక్తుడైనాడు. కాని రథంలో అత్యంతకృశాంగి, దుఃఖ పరిదీనవదన, ధూళిధూసరితదేహ, మలినవస్త్ర, కేశసంస్కారరహిత, ఏకవేణీధర అయిన సీతాదేవిని హనుమంతుడు నివ్వెరపాటుతో ఒక్కక్షణం సేపు ఇ