తెలుగు ఖ్యాతి ప్రపంచవ్యాప్తి
తెలుగు ప్రపంచం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఖండఖండాంతరాల వరకు విస్తరించిన ఘనత గలది మన తెలుగుజాతి. తొలి తరాల్లో విదేశాలకు వెళ్లిన తెలుగు ప్రముఖులు ఖండాంతరాలలో మన ఖ్యాతిపతాకాన్ని ఎగురవేశారు. విదేశాల్లో స్థిరపడ్డ మన తెలుగువారు ఇప్పుడు కూడా అదే పరంపరను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అమెరికాలోని తెలుగువాళ్లు సొంత విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఐదేళ్ల కిందట ప్రారంభమైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం శాన్వాకిన్ జిల్లా పరిధిలోని ట్రేసీ పట్టణానికి చేరువలో అరవైఏడు ఎకరాల సువిశాల స్థలంలో ప్రపంచస్థాయి విద్యాప్రాంగణ నిర్మాణాన్ని తలపెట్టింది. దీనికి సీనియర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ కమిషన్ గుర్తింపు లభించడం విశేషం. తెలుగు ప్రజలు గర్వించదగిన పరిణామం ఇది.
ఖండాంతరాలలో తెలుగువారి కీర్తపతాక రెపరెపలకు దోహదపడిన తొలితరం ప్రముఖులను ఈ సందర్భంగా గుర్తు