ప్రథమ స్నాతకోత్సవం
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం
రెండు సంవత్సరాల క్రితం స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటయి భారతీయ కళలు, భాషలలో మాస్టర్స్, డిప్లమా, సర్టిఫెకెట్ స్థాయి కోర్సులను అందిస్తోన్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. తొలి బ్యాచ్లో చేరి కోర్సు పూర్తి చేసిన 31 మంది విద్యార్థులకు సిలికానాంధ్ర విశ్వ విద్యాలయ అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, విశ్వ విద్యాలయ పాలకవర్గ చైర్మన్ శ్రీ లకిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా ఈ స్నాతకోత్సవంలో పట్టాలను అందించారు. కాంప్ బెల్ హెరిటేజ్ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభంలో నిర్వహించిన శోభాయాత్ర చూపరులను ఎంతో ఆకట్టుకుంది. విశ్వవిద్యాలయం ప్రొవొస్ట్ రాజు చమర్తి ముందు నడవగా పాలక వర్గ సభ్యులు అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, చైర్మన్ డా.హనిమిరెడ్డి లక్కిరెడ్డి, డా.పప్పు వేణుగోపాల రావు, నీరజ్ భాటియా, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ దీనబాబు