చెన్నబోయిన కమలమ్మ
- రమా సుందరి
చెన్నబోయిన కమలమ్మ మరణ వార్త పొద్దునే కలవరపెట్టింది. తెలంగాణ సాయుధ పోరాటదళాలలో ఉంటూ పోలీసుల నిర్బంధానికి తనకు పుట్టిన బిడ్డను కూడ అడవి బయట వదిలేసి వచ్చిన ఆమె చరిత్ర అజరామరం. 2015 సెప్టెంబర్ లో ఆమెను కలిసి పీవోడబ్ల్యూ బృందం ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు ఆమె పాడిన పాట ఇంకా చెవుల్లో మార్మోగుతుంది.
కొండల్లో కోయిల కమలమ్మ
కాటమా రాజు కధ కాదురన్న
పెద్ది రాజుల వారి సుద్దులు ఇవి కావు రన్నో
వీర తెలుగోళ్ల పోరాట కధరన్నా
సిరికొండ బేతవోల్ వీరుడా
యాదగిరి వెంకటేశ్వరులా
మరిచావా తెలంగాణ వీరా
కోయ వీరుడు విల్లునంబుల శత్రువ
కూల్చినా ముచ్చటా మరిచావా
ఓ తెలుగు వీరుడా
తెలంగాణ యోధుడా
లేవయ్య, లేచి రావయ్యా
తొంబ్బై రెండేళ్ల చెన్నుబోయిన కమలమ్మ కళ్ళు మూసుకొని గొంతెత్తి గొల్ల సుద్దులు పాడుతోంది. డెబ్భై ఏళ్ళ క్రిందటి జ్ఞాపకం పాటలాగా ఆమెను ఆవహించింది. ఆమె చుట్టూ ఉన్న శ్రోతలం నిశ్శబ్ధంగా వింటున్నామ