క్రోధం
-శారదాప్రసాద్
అరిషడ్వర్గాల్లో ఒకటైన క్రోధం అంటే కోపాన్ని , ఉద్రేకాన్ని, ఆవేశాన్నికల్గి ఉండటం .ఆగ్రహావేశం వచ్చినటువంటి వాడు గురువుని చంపేయడానికి కూడా వెనుకాడడు. క్షణికావేశంలో చేయకూడని పనులు చేసి జీవితాంతం కారాగారంలో ఉండిపోయిన మేధావులున్నారు. ఈ మధ్యనే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిలస్ (యూసీఎల్‌ఏ)లో భారతీయ విద్యార్థి మైనాక్ సర్కార్ (38) కాల్పులకు పాల్పడి ఓ ప్రొఫెసర్‌ను హత్యచేశాడు.ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకోసం అతడు ఏకంగా దాదాపు 3222 కిలోమీటర్ల దూరం కారులో ప్రయాణించి వచ్చాడు. అంటే అతని క్రోధం పగగా మారిందన్నమాట!ఐఐటీ ఖరగ్‌పూర్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్) విద్యార్థి అయిన మైనాక్ సర్కార్.. యూసీఎల్‌ఏ ప్రొఫెసర్ విలియమ్ వద్ద డాక్టరేట్ విద్యార్థిగా ఉండేవారు. 2013లో అతని డాక్టరేట్ పూర్తయింది.చూసారా ఒక మేధావి తన విచక్షణను ఎలా కోల్పోయాడో! మనుషుల్లో కోపానికి