నేను శివుణ్ణి!
-శారదాప్రసాద్
మన జీవితాల్లోమనం ముఖ్యంగా మూడు కష్టాలను ఎదుర్కోవాలి, అధిగమించాలి! అవి--దైవికం, దేహికం మరియు భౌతికం.
దైవికం అంటే-- దైవ ప్రేరేపితాలు. అంటే తుఫానులు, భూకంపాలు మొదలైన ప్రకృతి విపత్తులు.
దేహికం అంటే-- శారీరకమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధులు.
భౌతికం అంటే-- సామాజిక, మానవ సంబంధాలతో కూడిన సమస్యలు, గొడవలు, అపార్ధాలు, కక్షలు, కార్పణ్యాలు, రాగబంధాలు...మొదలైనవి.
ఎవరైతే వీటిని అధిగమించి, ఇతరులు కూడా అధిగమించటానికి సహాయం చేస్తారో, అటువంటి వారిని మాత్రమే జ్ఞానులు, ముముక్షువులు, మోక్షాన్ని పొందినవారని అంటారు. అట్టివారే నిజమైన గురువులు మరియు మార్గదర్శకులు. అంతే కానీ, దేవతల సహస్రనామాలను,భజనలను చేయమని చెప్పి వాటిని చేయించేవారు కేవలం గురువు వేషంలో ఉన్న లఘువులు! చిత్తశుద్ధి లేకుండా (ఉన్నప్పటికీ) తెల్లవార్లు రామనామ జపం చేస్తే ఏమీ రాదు.రాకపోగా, నిద్రలేమితో అనారోగ్యం సంభవిస్తుంది.అంతర్యా