పద్యం – హృద్యం
-పుల్లెల శ్యామసుందర్
ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసం ప్రశ్న:
తాతా యని ప్రేమతోడ తరుణినిఁ బిలిచెన్
గతమాసం ప్రశ్న:
"చిత్ర" కవిత్వం - ఈ క్రింది ఛాయచిత్రమునకు ఒక వ్యాఖ్యను లేదా వర్ణనను మీకు నచ్చిన ఛందస్సులో పద్యరూపములో పంపాలి
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
అయినాపురపు శ్రీనివాసరావు, సెయింట్ లూయిస్, మిస్సోరి.
ఆ.వె.
వాలు జడను గూర్చి వయ్యార మొలికించు
హావ భావ యుక్త హాస్య లాస్య
నవ రసములనెల్ల నాట్యమందున జూపు
కులుకు లాడి నడక కూచ