ధారావాహికలు

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

తాను రాస్తున్నది అనుభూతి కవిత్వమని చెప్పుకోకపోయినా, బహుశా భావించి ఉండకపోయినా ఇప్పటి మన విశ్లేషణల ప్రకారం అప్పటి ఆయన కవిత్వం అనుభూతి కవిత్వమే అవుతుందని

గమనించవచ్చు. గీతాంజులి’, “నుధల’ పుట్టుకకి దోహదం చలంలో కేంద్రీకృతమై ఉన్న అనుభూతే కారణం అని చలం రచనల ద్వారానే విశదమౌతుండటం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం.

చలం దృష్టిలో ఆధ్యాత్మికం సమాజానికి దూరమైంది కాదు. చలంగారి రచనలలో సమాజానికీ, ఆధ్యాత్మికానికి సమప్రాధాన్యం కన్పిస్తాయి. అందుకేనేమో శ్రీశ్రీ చలంగారిని ‘యోగివేమన’ లా వర్ణించటం
జరిగింది. “గీతాంజలి” చలం జీవితానికో కొత్త వెలుగుని, ఆధ్యాత్మిక జీవితాన్నీ ఇచ్చిందని “గీతాంజలి” ముందుమాటలో చలమే రాసుకున్నాడు. “గీతాంజలి నాకో కొత్త దృక్పథాన్ని, Philosophy of lifeని, నేను
అనుభవించే. అందాలకి ఓ వెలుగుని, నా ఆశలకో అర్థాన్ని ఇచ్చింది.” 50

మనసుని ఆకర్షించి, ఆత్మలో మాధుర్యాన్నీ తేజస్సునీ నింపగలగటం గొప్పకళ లక్షణం _ అవుతుంది. గొప్ప కళవల్ల ప్రతి జీవికీ తన అంతస్తుని బట్టి ఆ అనుభవం తప్పక అంది తీరుతుంది. ఈ ప్రయోజనం
సాదాపీదా కళలో కన్పించదు. మనకు తెలియని, అందని విషయాన్ని కవి మనకు అనుభవంలోకి వచ్చేట్లు చేస్తాడు. దానికి ధ్వనికానీ, ఇమేజరీ కానీ ఆధారం కావచ్చు. కవిలో ఉన్న ఇటువంటి Emotional

అనుభవానికి రూపకల్పన చేసి పఠితకి అందించటమే ఉత్తమ కవి లక్షణం అని చలం అభిప్రాయం.

చలం ‘“అనుభూతివాది” అని చెప్పటానికి ముఖ్యంగా ఆయన మాటలే దోహదం చేస్తాయి. కళకి ముఖ్యంగా కావలసింది అనుభవం. ఆ అనుభవం ఆత్మానుభవాన్నే అని అంటారు చలం. “ఆత్మతో

మట్లాడగల శక్తి కావాలంటే రాతలోంచి గాని పటాల్లోంచి గాని అసలు సోర్సులో జన్మస్టానంలో ముందు ఆత్మసౌందర్యం ఉండాలి. కళలకైనా ఆత్మవిద్యే ప్రధానమేమో! ఎందుకంటే ఏమి. చేసినా, ఏమి రాసినా, ఏమి

పాడినా, ఆత్మానుభవం నించి ఎట్లా తప్పించుకోగలరు?”

చలం తన జీవితంలో ఆధ్యాత్మికానుభూతికి ఎక్కువగా ‘ప్రాధాన్యం కల్పించినట్లు స్పష్టంగా అతని రచనల ద్వారా వ్యక్తమౌతోంది. చలం అనుభూతిని పొందటమే కాకుండా, తన రచనలద్వారా ఆ అనుభూతిని పఠితలకి

అందించటానికి ప్రయత్నించారు. “గీతాంజలి, ‘సుధ, “కాన్క’ మొదలైనవి అటువంటి ప్రయత్నంతో వెలువదినవే. గీతాంజలి, కాన్కఅనువాదాలైనా తన సొంత అభిప్రాయాలను. వెలిబుచ్చుతున్నట్లుగా కనిపించటానికి

గల ముఖ్యకారణం అతనిలో కలిగిన అనుభూతి. అరుణాచల దర్శనంతో చలంలో కలిగిన అనుభవాల సంపుటే ‘సుధ’. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక అనుభూతికి ప్రాధాన్యం కల్పించిన రచనలా కన్పిస్తుంది.“గుణంలో,

గణంలో, దృక్పథంలో, గతిలో, అభివ్యక్తిలో పూర్వరచనలకంటె విలక్షణంగా ఉన్న దార్శనిక చైతన్యమే ‘సుధ’, లోని ఆధునికతో?52 అని సుబ్రహ్మణ్యంగారు సుధ కావ్యంలోని ఆధునికత ఏ విధంగా ఉందో వివేచించారు.

అంతేకాదు చలం అనుభవాల అభివ్యక్తుల సంపుటీకరణంగా ‘సుధ’ ని పేర్కొన్నారు.

“కార్య నిమగ్నులైన జనులలో సైతం
ఎక్కడో ర్తక్తం అడుగున పలికింది
జన్మ జన్మాంతర నిగూఢ
అవ్యక్త స్కృతులుగా…… “53
లోకంలో అలౌకికానుభూతి ఉన్నా దాన్ని అనుభవించే వారే లేరు. కాని ఆ అనుభూతి మాత్రం ప్రతిమనిషి హృదయంలో “ఎక్కడో రక్తం అడుగుని నిక్షిప్తమై ఉంటుంది. అలా నిగూఢంగా ఉన్న అవ్యక్తస్మృతి –
“ఎక్కడో,
ఏ ఆత్మా ౦తరాళంలోనో
ఒక్క నిముషం తళుక్కుమన్నాయో, లేదో
అంతే!
తరువాత…..
ఎవ్పుటి చీకటి పొరలు
మననుల పై
చీకు ఆలోచనలు
చిక్కు వ్యవహారాలు.!”54
ఎక్కుడో మెరుపులా ఆత్మాంతరాళంలో మెరిసి కనుమరుగు అవుతుంది. అంతే మళ్లీ మనస్సు ఈ చీకు ఆలోచనలతో, చిక్కు వ్యవహారాలతో జీవితాన్ని గడిపేస్తుంది. జీవితాన్ని మనిషి అజ్ఞానంలోకి

నడిపేస్తాడు.
“రా నాతో అరుణాచలం పైకి!
మర్రిచెట్టు నీడ – సెలయేటి ధార
పెదవులపై పాట – నువ్వు నా వెంట
నవవికసిత పుష్ప మకరందం తాగి
మత్తెక్కి పాడే ఈలపిట్టల,
రావి చిగుళ్ళు నునువుతో
మృదువుగా తాకే గాలి తెమ్మెరలు,
దూరంగా ధ్వనించే గుడిగంటలు
శిఖరం చుట్టూ మూగే మేఘాల నీడలు
కొండగడ్డి అడవిజాజుల పరిమళాలు
ఆకాశ వలయాల్లోంచి
గరుడిడి జాలిపిలుపు
ప్రియుడికై మూలిగే పావురం వలవు!”55
“పై వచన గీతంలో మొదటి చరణం భౌతిక వైతన్యాన్నీ, ‘రెండవ చరణం ఆధి భౌతిక చైతన్యాన్నీ, మూడవ చరణం ఆధ్యాత్మిక చైతన్యాన్నీ వ్యక్తం చేస్తున్నాయి. భౌతిక చైతన్యాన్నీ నిరలంకార వాస్తవ

వర్ణనంతో వ్యక్తీకరించటం వలన ఐంద్రియ జ్ఞానం వలన కలిగే అనుభవం వ్యంజింపబడుతున్నది. ఆధి భౌతిక చైతన్యం భావచిత్రాల వలన కల్పించే ప్రకృతి వర్ణనం ద్వారా అతీంద్రియమైన అనుభూతిని జాగృతం

చేయగలుగుతున్నది. అత్యాత్మిక చైతన్యం బలమైన రెండు ప్రతీకల ద్వారా అభివ్యక్తమౌతున్నది. ‘ఆకాశవలయాల్లోంచి జాలిగా పిలిచే గరుడు’డు దైవచైతన్యాన్నీ, ‘ప్రియుడికై మూలిగే పావురం’ భక్త చైతన్యాన్నీ

ప్రతీయమానం చేస్తున్నాయి. అరుణాచలానుభవంలో ఈ మూడు పొరలున్నాయి. ఈ గేయంలోని వర్ణ్య వస్తువులన్నీ కవి యొక్క అంతశ్చైతన్యాన్ని పఠితకు కూడా అనుభవంలోకి తీసుకొని రాగలిగిన బహిశ్చైతన్య

ప్రతీకలు, భావచిత్రాలు, అలంకారాలు. ఇది క్రొత్త బాణీ.” 56

“నాలో నేను చిత్రించుకున్న
కాలమూ దూరమూ లేని పటం
నువ్వూ, నేనూ, గదీ, ఎండా
అందం, ఆకాశం, అంతా
నాలోని చిదాకాశం
అంతటా నేను
నా హృదయంలోని తేజన్సు
మనోదర్పణ కోణాలలో
చీలికలై రంగులై చింది
ప్రపంచంగా రూపొందింది!”57
ఈ ప్రపంచం మొత్తం మనిషి మనస్సు ఏర్పరచుకున్నదే అనే భావాన్ని చలం అందించాడు. మనిషి హృదయంలో ఉన్న తేజస్సు మనస్సు పైకి ‘ప్రసరించగానే, ఆ కిరణాలన్నీ విడివడి ఆకర్షవంతమైన

ప్రపంచంగా మారిందని చలం భావం. అంతేకాదు “లోకంలో లేదు మర్మం మనసులో ఉంది మాయ అంతా” 58 అని అంటాడు చలం.

“తెలుసుకునే మనసు
తెలిసే లోకం
తెలిపే ఈశ్వరుడు
అన్నీ వొకటే
ఒకటే మౌనం
శబ్ధాతీతమైన నిశ్శబ్దం
నమన్తమూ నిండిన
నిరామయం” 59
ప్రపంచంలో తెలుసుకునే మనసు, తెలిసే లోకం, తెలిపేటటువంటి ఈశ్వరుడు – అంతా ఒక్కటే అనే అద్వైత భావనని చెప్తాడు చలం. ఇలాంటి అనుభూతే జీవితంలో కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked