ధారావాహికలు

రామాయణ సంగ్రహం

శ్వేతుడి కథ

అప్పుడు శ్రీరాముడు “మహానుభావా! ఈ ఆభరణం మీకెట్లా వచ్చింది “? అని అడిగాడు. అప్పుడగస్తృ మహర్షి ఆ వృత్తాంతం శ్రీరాముడికి చెపాడు.

‘ఇది జరిగిపోయిన మహాయుగంలోని జ్రేతాయుగం నాటి కథ” అని ఆయన మొదలుపెట్టాడు చెప్పుటం.

“ఇంతింతనరాని విస్తీర్ణం కల ఒక మహారణ్యం ఉండేది. అది బహు యోజన విస్సృతం. అయితే అందులో ఒక మృగమైనా, ఒక క్ర సక్షి అయినా కనపడకపోవడం వింత సుమా! నాకు ఈ గడ్డు సమస్య ఎందు కేర్వ డిందో తెలుసుకుందామన్న ఆసక్తీ కలిగింది. అక్కడే తపస్సు చేసుకుంటూ ఈ వింతను కనుక్కోవాలని నిశ్చ యించుకున్నాను.

ఆ అడవి మధ్య ఒక విశాలమైన సరస్సు ఉంది. దాని గట్టున ఒక ఆశ్రమం ఉంది. కాని ఆ ఆశ్రమం నిర్మానుష్యం. ఆ ఆశ్రమంలో నేను ఒక రోజు ఉన్నాను. మర్నాడు ప్రాతఃకాలాన సరస్సు

దగ్గరకు స్నానార్థం వెళ్ళాను. అక్కడ ఒక ప్రేతశరీరం కన్పించింది. నేనెంతో ఆశ్చర్యంతో చూస్తుండగా ఒక దివ్వవిమానం అక్కడకు వచ్చింది. అందులో ఒక స్వర్లోకవాసి ఉన్నాడు. అతణ్జి అప్పరలు కొలిచి

ఉన్నారు. ఆటపాటలతో తనియింప చేస్తున్నారు. అప్పుడా స్వర్లోకవాసి విమానం నుంచి (మేరుపర్వతం నుంచి అవరోహించిన సూర్యుడిలాగా) దిగివచ్చి అక్కడ ఉన్న శవాన్ని భక్షించాడు. అట్లా శవాన్ని

తిని సరస్సులో హస్త ప్రక్షాళనం చేసుకొని మళ్ళీ విమానంలో ఎక్కబోతుండగా చూసి నే నాయన విపరీతవర్తనను గూర్చి తెలుసుకోగోరాను. అప్పుడా దివ్యపురుషుడు“మహానుభావా! ఈ సృష్టిలో

సుఖదుఃఖాలు అనివార్యాలు అపరిహార్యాలు. నా కథ విను. విదర్భ దేశాధీశ్వరుడైన సుదేవుడి పెద్ద భార్య కొడుకును నేను. నా పేరు శ్వేతుడు’. చిన్నభార్యకు పుట్టిన కొడుకు ‘ సురథుడు’. మా తండ్రి

కాలధర్మం చెందిన తర్వాత నన్ను రాజును చేసారు ప్రజలు. నేను కూడా మా తండ్రిలాగా ప్రజారంజకంగా రాజ్యం చేశాను. నాకు నా మరణకాలం తెలిసి నా తమ్ముడు సురథుణ్ణి మా రాజ్యానికి రాజును

చేసి ఈ అడవికి తపస్సుకు వచ్చాను. ఇక్కడ చిరకాలం తపస్సు చేశాను. అందువల్ల నాకు బ్రహ్మలోకప్రాప్తి కలిగింది. అయితే వింత ఏమంటే బ్రహ్మలోకానికి వెళ్ళినా నాకు ఆకలిదప్పుల వ్యథ

ఉపశమించలేదు. నేను కటకట పడి బ్రహ్మదేవుణ్ణి ఇట్లాఎందుకు తటస్థించింది? అని అడిగాను. అప్పుడు బ్రహ్మదేవు డిట్లా చెప్పాడు నాకు. ‘స్వేతుడా! నీవు ఎంత తపస్సు చేసినా శరీరపోషణే నీ

ముఖ్యధ్యాస అయింది. కాబట్టి నా లోకానికి వచ్చినా నీకు ఆకలిదప్పులు తప్పటం లేదు’. అని చెపుతూ ‘నీవు ఏనాడూ అతిథికి అన్నం పెట్టలేదు. ఒక మాట చెపుతాను విను. తపస్సు చేస్తున్నా దానిపై

మనసు నిలపక శరీరపోషణమే నీకు ముఖ్యమనుకొని దాన్నే వృద్ధిపొందించుకున్నావు. అందువల్లే నిన్నీ ఆకలిదప్పులు విడవటంలేదు. పీడిస్తున్నాయి. నీ శరీరమే నీకు ఆహారంగా చేసుకో. నీ మృతశరీరాన్ని నీవు పూర్తిగా భక్షించిన తర్వాత నీకీ ఆకలి దప్పులుండవు’ అని చెపుతూ, ‘మహాశక్తిసంపన్నుడైనఅగస్త్యమహర్షి ఒకప్పుడు నీవు తపస్సు చేసిన సరస్సు దగ్గరకు వచ్చి నిన్ను చూస్తాడు. నీ విడ్డూరమంతా అడుగుతాడు. అప్పుడు నీవు ఏదీ దాచకుండా చెప్పు. ఆయన నిన్ను కరుణిస్తాడు” అని చెప్పి ‘ఆపదలపాలైనప్పుడు ఆయన దేవతలనే కాపాడి రక్షించాడు. నిన్ను ఉద్ధరించడంలో వింత ఏముంటుంది?” అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పటి నుంచి నేను ఈ సరస్సు దగ్గరకు వచ్చి నా శవాన్ని నేనే భక్తిస్తున్నాను. ఇది ఎంతటికీ తరగకుండా ఉంది. తిని వేసిన భాగం మళ్ళీ పూడుకొని వస్తున్నది.

అందువల్ల నా ఆకలిదప్పులు కూడా యథాతథంగా ఉన్నాయి. “మహానుభావా! నేను నీకొక దివ్యాభరణం కాన్కగా యిస్తాను. నన్నీ దురవస్థ నుండి, దుస్థితినుంచి రక్షించు’ అని వేడుకొన్నాడు

శ్వేతుడు. అప్పుడు నేను మనస్సులో ఇతడి దైన్యం తొలగిపోవాలనుకుంటూ ఉండగా, ఇతడి మృతదేహం అదృశ్యమైపోయింది. ఇట్లా ఈ ఆభరణం నాకు వచ్చింది శ్రీరఘురామా!” అని అగస్త స్య్యమహర్షి ఆయనకు చెప్పాడు.

అప్పుడు శ్రీ రాముడు ‘అది సరే; మహాత్మా! శ్వేతుడు పశుపక్షిరహితమై నిర్జీవమైన ఆ వనంలో ఎందుకు తపస్సు చేశాడు? అని అడిగాడు.

శ్రీరాముడి ఆసక్తిని గుర్తించి అగస్త్యమహర్షి ఇట్లా చెప్పాడు.’ కృతయుగంలో మనువు పరిపాలన చేస్తూ ప్రజలను ధర్మబద్ధంగా శాసించేవాడు. ఆ తర్వాత ఇక్ష్వాకువు రాజైనాడు.

“శాసనయుక్తంగా ధర్మబద్ధంగా, సత్య ప్రతిజ్ఞాపూర్వకంగా పరిపాలన చేస్తే పాలకుడు స్వర్గవాసం చేస్తాడు. లేకపోతే దుర్గతి పాలవుతాడు” అని మనువు ఇక్ష్వాకునికి బోధించాడు.

ఇక్ష్వాకునికి తండ్రి ప్రబోధం పాటించాడు. ఆయనకు నూరు మంది కొడుకులు కలిగారు. అయితే ఇందులో చివరివాడు దుర్వినీతుడూ, మూర్ఖుడూ అయినాడు వీడు దండ్యుడు కాక తప్పదని రాజు వాడికి దండుడని పేరు పెట్టాడు. వాణ్ణి చూడటం ఇష్టంలేక వింధ్యశైవలపర్వతాలమధ్య ఉండే రాజ్యాన్నిచ్చి అక్కడకు పంపివేశాడు. దందుడు అక్కడ ఒక నగరాన్నిఅభివృద్ధి చేసుకొని దానికి ‘మధుమంతం’ అని పేరు పెట్టి రాజ్యం చేయసాగాడు. శుక్రుణ్ణి తన పురోహితుడిగా చేసుకున్నాడు. ఒక రోజు దండుడు పురోహితుడి నివాసానికి వెళ్ళాడు ఏదో పని ఉండి. అది వసంతకాలం. ప్రకృతి అంతా చిగిర్చి, పుష్పించి మనోహరంగా ఉంది. సమీపంలో శుక్రుడి పుత్రిక అసమానలావణ్యంతో విహరిస్తూ ఉండటం చూశాడు దండుడు. కామశరదగ్దుడై ఆమెను కవయకోరాడు. శుక్రుడి పెద్ద కూతురు అరజ ఆమె. గురుపుత్రికను కోరడం అధర్మం అని వారించినా, దండుడు వినకుండా ఆమెతో బలాత్కారంగా రమించాడు. ఏడుస్తూ తండ్రి దగ్గరకు వెళ్ళింది అరజ.

శుక్రుడు దండుడు చేసిన దౌర్జన్యానికి ఆగ్రహించి వాడి నగరం ఏడు రోజుల్లో నాశనమై పోతుంది అనీ, వాడి రాజ్యమంతా ధూళివర్షం కురిసి జీవరహితమవుతుందనీ శపించాడు. ఆ దేశం విడిచిపెట్టి జనులంతా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినారు. శుక్రుడు తన కూతురి పట్ల కూడా ఆగ్రహించాడు. ఆ ఆశ్రమ ప్రదేశంలో ఆ రాత్రి నివసించిన ప్రాణులకు ఈ శాపం

తగలదనీ, కాబట్టి ఆ ప్రాణుల మధ్య ఆ(శమంలోనే యోగినిగా నివసిస్తూ మంచిరోజులకై ఎదురుచూడమన్నాడు. తండ్రి మాట తలదాల్చింది అరజ.

దండుడి రాజ్యమంతా నిర్మానుష్యమే కాదు. నిర్జీవమూ అయి పోయింది. అందువల్ల అక్కడ పశుపక్షి మృగాదులకు కూడా ఉనికి లేకుండా పోయింది.

దండుడి పాపకర్మను సూచిస్తూ ఇది దండకారణ్యం అయింది. ఆ తరువాత కొంతకాలానికి మునులు తపోవనాలు ఏర్పరచుకొన్నందువల్ల జనస్టానమైంది’ అని చెప్పి అప్పుడు సంధ్యాకాలం

సమీపిస్తూ ఉందడం వల్ల సంధ్యోపాసనకు బయలుదేరి, “నీవు కూడా శాస్త్రవిధిని ఆచరించు” అని చెప్పి వెళ్ళిపోయినాడు అగస్తుడు. శ్రీరాముడు సంధ్య నర్చించి మళ్ళీ అగస్త్యాశ్రమానికి వచ్చి ఆ రాత్రి అక్కడ ఆయనకు అతిథిగా ఉన్నాడు. అగస్త్యుడి ఆతిధ్యాన్ని తనివితీర స్వికరించాడు. ఉదయమే అయోధ్యా నగరానికి ప్రయాణమై ఆ మహర్షి అనుజ్ఞ వేడుకున్నాడు. ‘లోకధర్మాన్ని అనుసరించి నా నుంచి వీడ్కోలు అర్దిస్తున్నావు కాని నీవు పురుషోత్తముడివి, పరంధాముదివి’ అని అగస్త్యుడు శ్రీరాముణ్ణి స్తుతించాడు. దేవకార్యం నీవల్ల సానుకూలమైంది అని ప్రశంసించాడు. శ్రీరాముడు మళ్ళీ పుష్పక విమానారూడుడై అయోధ్య చేరాడు. విప్రబాలుడు పునర్జీవితుడు కావటానికి కారణమైన విషయం తమ్ములకు వినిపించి చాలా సంతృప్తి పొందాడు. పుష్పకంలో తాను అయోధ్య వీడిన దగ్గరనుంచి జరిగిన సమస్తవృత్తాంతం తమ్ములకు వినిపించాడు. ఇట్లా ఆయన ప్రజాసుఖలాలనుడై రాజ్యకార్యనిర్వహణ ఏమరక పాలన చేస్తూ రాజసూయయాగం చేయాలని తన అభీష్టాన్ని తమ్ములతో సంప్రదించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked