శ్రీరాముని అశ్వమేధ యాగానికి వాల్మీకి రావటం
శ్రీరామచంద్రుని అశ్వమేధ యజ్ఞాన్ని గూర్చి విని వాల్మీకి మహర్షి తన ఆశ్రమ వాసులందరితో యజ్ఞవాటికి వచ్చాడు వచ్చినవారిలో కుశ, లవులు కూడా ఉన్నారు. భరతశత్రుఘ్నులు, మహర్షికీ, ఆయన పరివారనికీ విడుదల ఏర్పాటు చేశారు
వాల్మీకిమహాముని కోరికపై అయోధ్యానగరంలో అన్ని వీథులలోను (శ్రుతిలయబద్ధంగా కుశలవులు శ్రీరామకథ గానం చేశారు. ఇది ఆ నోట ఆ నోట పోగడ్తకెక్కటంతో శ్రీరాముడు కుశలవులను ఆహ్వానించి తన సభలో కూడా వాళ్ల చేత పాడించాడు. తన కథ వినీ, సీతాదేవిని తలచుకొనీ ఆనందవిషాదాలకు లోనైనాడు. ఈ కథ ఎవరు రచించారు? అని లవకుశులను ఆయన అడగగా వాల్మీకిమహర్షి రచించి తమకు తాళలయానుబద్ధంగా నేర్పాడని వాళ్ళు చెప్పారు.
అప్పుడు శ్రీరాముడు సీతాదేవిని తలచుకొని చాలా విషాదం పొందాడు. దుర్భరశోకం అనుభవించాడాయన. ముద్దులు మూటలు కట్టే ఈ మధురబాలగాయకులు తన కుమారులే అని శ్రీరాముడు గ్రహించాడు. ఇట్లా శ్రీరామాయణగానం శ్రీరాముడు యజ్ఞవిరామసమయంలో చాలా రోజులు విన్నాడు. అప్పటికి కాని ఏడుకాండలు, ఐదు వందల సర్గలు ఆయన వినటం పూర్తికాలేదు. తన దివ్యదృష్టివల్ల వాల్మీకి మహర్షి
శ్రీసీతారాముల భవిష్యద్బృత్తాంతం కూడా మధురఫణితిలో కావ్యంలో పొందుపరిచాడు. శ్రీరామాయణ గానమంతా తన కొలువులో అయోధ్యావాసులు విని, అశ్వమేధయజ్ఞం తిలకించాలని భావించాడు. వివిధ దేశాగతులైన రాజులు, మహర్షులు, నటులు, గాయకులు, కళాకారులు, లలిత కళాకోవిదులు, కథామాధుర్యాన్ని గానమాధుర్యాన్ని
వేనోళ్ళ రచ్చలలో, రథ్యలలో, గృహాలలో పొగడుతూ ఉండగా శ్రీరాముడు విన్నాడు. గొప్ప వాగ్విశారదులైన దూతలను వాల్మీకిమహర్షి దగ్గరకు పంపి, ఆయన సీతాదేవిని తోడ్కొని రావాలనీ రాజసభలో సీతమ్మతల్లి తన పవిత్రతను వాల్మీకి మహర్షి సమక్షంలోఉద్దాటించాలనీ తన అభిప్రాయమైనట్లు ఆ దూతముఖంగా వాల్మీకి మహామునికి విన్నవించాడు.
శ్రీరాముడు యజ్ఞవాటికకు చేరాడు. వసిష్ట వామదేవ, జాబాలి, కశ్యప, విశ్వామిత్ర, మార్కండేయ, మౌద్గల్య, గర్గ, చ్యవన, శతానంద, గౌతమ, అగస్య ప్రముఖ దివ్యర్షులు, బ్రహ్మర్షులు, తమ శిష్య ప్రశిష్య పరివారంతో అక్కడకు వచ్చారు. సీతాదేవి శపథం వినటానికి సర్వవర్జాలవారు, వచ్చిన ఇతర దేశాలవారూ నిరీక్షిస్తున్నారు.
అగ్నిపరీక్ష
వాల్మీకిమహర్షి అప్పుడు సీతామహాదేవితో పరిషత్తుకు వచ్చాడు. అందరూ సీతాదేవిని చూసి చకితులైనారు. సాధు సాధు అని ప్రశంసించారు. సీతాదేవి కనులు అశ్రుప్రపూర్ణమై ఉన్నాయి. ఆమె శ్రీరాముడికి నమస్కరించింది. అప్పుడు వాల్మీకి మహర్షి సభామధ్యంలో నిలిచి శ్రీరాముణ్జి ఉద్దేశించి “శ్రీరామా, సీతాదేవి పరమసాధ్వి, సుచరిత. లోకాపవాదభయంతో నీవు ఆమెను పరిత్యజించావు. అప్పటినుంచి నేను నా సంరక్షణలో
ఆమెను కాపాడుతూ వచ్చాను. ఈ కవలలు నీ సంతానం. నా తపస్సుమీద శపథం చేసి చెపుతున్నాను. ఈ విషయం ఇప్పుడామె ప్రతిజ్ఞాపూర్వకంగా ప్రకటించబోతున్నది.” అని వాల్మీకి మహర్షి సభాముఖంగా తెలియజేశాడు.
అప్పుడు శ్రీరామచంద్రుడు వాల్మీకిమహర్షికి నమస్కరించి తన అంతఃకరణసాక్షిగా సీతాదేవి పరమసాధ్వి, అని తనకు తెలియకపోలేదనీ, సమస్త దేవలోకమూ, అయోధ్యాపౌరులు, మహర్షులు, యజ్ఞసమాహూతులై వచ్చిన సమస్తవేదవేత్తలు, ధర్మతత్పరులైన విప్రులు ఉన్న ఈ మహాజన సభాముఖంగా తన అంతఃకరణ పవిత్రతను
సీతామహాసాధ్వి ఉద్దాటించాలని మాత్రమే తన ఆశయమని సభవారికి విన్నవించాడు.
అప్పుడు ఆ సభ పరిసరాలన్నీ దివ్యపరిమళభరితమైనాయి
సీతాదేవి దోసిలొగ్జి ‘త్రిక్ర్రణాలతో శ్రీరాముడే నాకు పతి, గతి, దైవము, ఆశ్రయుడు అని నేను శపధం చేన్తున్నాను. ఇదే తథ్యమైతే భూదేవి ఇప్పుడు నాకు వారి ఇచ్చి నన్నుతనలోకి తీసుకుంటుంది’ అని ప్రతిజ్ఞావూర్వకంగా పలికింది. సీతాదేవి మూడుసార్లు ఈ ప్రతిన వక్కాణించింది.
అప్పుడొక దివ్యాద్భాద్భుతఘటన సభలోని వారంతా తిలకించారు
. ఒక దివ్యసింహాసనం అక్కడ ప్రత్యక్షమైంది. భూదేవి అందులో ఆసీనురాలై ఉంది. ఆమె సీతాదేవిని రెండు చేతులతో పొదుపుకొని ఒడిలో కూర్చుండ బెట్టుకొని సింహాసనస్థయై పీతమ్మతో సహా రసాలమునకు దిగిపోయెను. సభాసదులు, ఆకాశచారులైన దేవతలు అందరూ మ్రాన్పడిపోయినారు.
ఈ విధంగా సీతాదేవి రసాతలప్రవేశం చేయటంతో శ్రీరాముడు దుర్ఫరశోక సంతప్తుడైనాడు. భూదేవిపై తీవ్రంగా కోపించాడు. భూమి నుద్ధేశించి నిష్టూరమాడాడు.
ఈ విధంగా శ్రీరాముడు కోపంతో శోకంతో రగిలిపోతుండగా బ్రహ్మదేవుడు దేవతలను వెంటబెట్టుకొని అక్కడకు వచ్చాడు. ఆయనను అనునయించాడు. కోపం ఉపశమింపచేశాడు. “నీవు శ్రీమన్నారాయణుడవు. లోకాన్నిరక్షించటానికి అవతరించిన వాడవు. నీ చరిత్ర సాహిత్యలోకంలో సర్వోత్తమమైనది. ఇది ఆదికావ్యమని జగత్తులో ప్రసిద్ది కెక్కుతుంది. ఈ నీ కావ్యం సర్వశ్రేష్ఠం. సర్వశ్రేయోదాయకం. నీ చరిత్రలో ఆగామికథను కూడా వాల్మీకి తన దివ్యదృష్టితో రచించాడు. దానిని కూడా నీవు వినవలసింది అని బ్రహ్మదేవుడు అంతర్హితుడైనాడు. శ్రీరాముడు లవకుశులు మధురంగా గానం చేయగా తరువాత కథను కూడా విన్నాడు.