పుట్టగానే బంగారు తొట్టెలో నిద్రపోక పోవచ్చు. జీవితం వడ్డించిన విస్తరి కాకపోవచ్చు. ‘ఆడ’తనం ఎన్నో అడ్డంకులను తెచ్చిపెట్టవచ్చు. జాతి, మత, వర్ణాలు అనేక ఆటంకాలను ఎదురుపెట్టవచ్చు. వీటన్నిటిని అధిగమిస్తూ, ‘ఆసాధ్యం’ కానిదేది లేదంటూ అగ్రరాజ్యంలో ఒక అధినేతగా వెలుగబోతున్న అచ్చమైన భారతీయత పేరున్న ‘కమల దేవి ‘ హార్రీస్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ.
(గమనిక: సిలికానాంధ్ర ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. ఏ ఒక్క రాజకీయ సిద్ధాంతాన్ని బలపరచదు. సిలికానాంధ్ర ఒక సాంస్కృతిక సంస్థ.)