ధారావాహికలు

విశ్వామిత్ర 2015 – నవల ( 10వ భాగము )

 – యస్. యస్. వి రమణారావు

 

Dr.శివహైమ,ఎమ్ బిబిఎస్.వైట్ బోర్డ్ మీద నీలిరంగు అక్షరాలతో మెరిసిపోతోంది ఆ పేరు.ఎక్సైటెడ్ గా తలుపు కొట్టాడు అభిషేక్.తలుపు తెరుచుకుంది.నల్లని దట్టమైన మేఘాల మధ్య వెలుగుతున్న మెరుపులాగ ,కొండమీదనుంచి జారుతున్న జలపాతంలాగా అందంగా,……ఆ డ్రెస్ లో అద్భుతంగా కనబడుతున్న ఆఅమ్మాయే శివహైమ,అభిషేక్ గర్ల్ ఫ్రెండ్.” వెల్ కమ్ టు మై హోమ్”ఆహ్వానించింది అభిషేక్ ని.”థాంక్యూ”అంటూ లోపలికి వచ్చాడు అభిషేక్.

“టిఫిన్ ఈజ్ రెడీ.వడ ప్లస్ సాంబార్ అన్డ్ పెసరట్ ప్లస్ ఉప్మా Of course followed by strong coffee,just like hotel menu hope u like it.”

“వావ్. దట్స్ గ్రేట్.చాలా ట్రబుల్ తీసుకున్నావ్.హోటల్ కి వెళిపోయేవాళ్ళం కదా” అంటూ తలుపు వేయబోయాడు.

“నోనో తలుపు వేయకు” వారించింది శివహైమ.

“వై?ఇంకా ఎవరినైనా పిలిచావా?”అడిగాడు అభిషేక్

“నో”

“మరి”

“చెప్తాను.స్టార్ట్ ద బ్రేక్ ఫాస్ట్”

“ఓకె”డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అభిషేక్

అప్పుడు అతని ముందు ఒక లెటర్ పెట్టింది హైమ.ఆశ్చర్యంగా చదవడం మొదలు పెట్టాడు అభిషేక్.చదువుతుండగానే అతని మొహంలో రంగులు మారడం ప్రారంభించాయి.

“యు కెన్ రీడ్ అవుట్”చెప్పింది శివహైమ

“డియర్ సర్

సబ్జక్ట్:విసిట్ ఆఫ్ మైఫియాన్సీ టు మై హౌస్

రిగార్డింగ్

నా వుడ్ బి మిష్టర్ అబిషేక్,సిఐడి,గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్,మా ఇంటికి ఉదయం టిఫిన్ చేయడానికి వస్తున్నందున అతనిని మా అపార్ట్మెంట్ లోనికి ప్రవేశించి నాతో టైమ్ స్పెండ్ చేయడానికి అనుమతి ఇవ్వవలసినదిగా కోరుతున్నాను.

ఇట్లు

డాIIశివహైమ

“మై గుడ్ నెస్.ఏమిటిదంతా”ఆశ్చర్యపోతూ అడిగాడు అభిషేక్

“వుయ్ ఆర్ నాట్ మేరీడ్.అందుకని.ఆశ్చర్యపడింది చాలు.ఇక టిఫిన్ చేయి”

మిగతా అపార్టెంట్ వాళ్ళందరూ తనకిచ్చిన ‘స్టాండింగ్ ఒవేషన్‘ కి కారణం అభిషేక్ కి అప్పుడర్థమైంది.మొహంమీద చిన్న నవ్వు కనబడింది

“కమాన్,సహజీవనాలు సాగిస్తున్న ఈరోజుల్లో..ఈజ్ దిస్ నాట్ టూమచ్?”

“వుయ్ ఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటి.నాట్ అలోన్.సహజీవనం అయితే మటుకు ‘మేం సహజీవనం చేస్తున్నాం’ అని చెప్పడానికి ప్రోబ్లం ఏమిటి?”

“ఒకె ఒకె”

టిఫిన్ తినడానికి ఉపక్రమించారు ఇద్దరూ.కబుర్లు చెప్పుకుంటూ,నవ్వుకుంటూ, టిఫిన్ పూర్తి చేశారు.కాఫీ తీసుకుని బాల్కనీలో కూర్చున్నారు.వెస్ట్ సైడ్ బాల్కనీ కావడం వల్ల చల్లగా వుంది పొద్దున్న అయినా.

“అవునూ ఎన్నాళ్ళయింది నువు వైజాగ్ వచ్చి?”అడిగాడభిషేక్

“ఏడాదయింది.ఎమ్బిబిఎస్ కాకినాడలో చేశాను.తరవాత ఒక వన్ ఇయర్ బీహార్ లో వర్క్ చేశాను.అక్కడేగా నువ్వు తగులుకుంది.”

నవ్వాడు అభిషేక్.

“అవునూ,ఎందుకు అడుగుతున్నావ్?”అడిగింది శివహైమ.

“ఏం లేదు.మా కానిస్టేబుల్ రాజు ఎందుకో ఈ అపార్ట్మెంట్ చూసి ఎందుకో కంగారు పడ్డాడు”రాజు ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడం,అతన్ని అబ్జర్వ్ చేయడానికి తను చేసిన ప్రయత్నం,అప్పుడు దక్కిన ‘స్టాండింగ్ ఒవేషన్’ అన్నీ చెప్పాడు.”ఇంతకుముందు ఎవరుండేవారు ఈ అపార్ట్మెంట్ లో?”అడిగాడు

“ఈ బిల్డింగ్ కట్టి మూడేళ్ళే అయింది.ఇంతకు ముందు ఒక బాంక్ ఎంప్లాయి ఫామిలీ ఉండేవాళ్ళు.వెరీ సాఫ్ట్ అండ్ నైస్ పీపుల్..వాళ్ళ తరవాత నేనే”

“వెరీ స్ట్రేంజ్”ఒక్క నిముషం ఆలోచించాడు అభిషేక్”ఏమ్ ఐ స్పాయిలింగ్ అవర్ టైమ్?”

“అదేం లేదు.గోఎహెడ్.నేను రెడీ అయి వస్తాను ఈలోపులో.నన్నుషాపింగ్ మాల్ దగ్గర డ్రాప్ చేద్దువు గాని”రెండు కాఫీకప్పులూ తీసుకుని ముందుకు వంగి చిలిపిగా తన ముక్కుతో అభిషేక్ ముక్కుని రాసి,అభిషేక్ పట్టుకునేలోపే తప్పించుకుని లోపలకు పారిపోయింది ,వెనక పరుగెత్తి రావద్దని సూచిస్తూ.ఖాళీగా ఉన్న చేయిని,తప్పించుకుని లోపలకు పరుగెడుతున్న శివహైమని చూస్తూ ఉంటే ఏదో అనిపించింది అభిషేక్ కి.తల విదిలించుకుని జేబులోంచి సెల్ బయటకు తీసి ఫోన్ చేశాడు.ఆ నంబరు సిటి లాఅండ్ ఆర్డర్ ఏసిపి రఘురామ్ ది.స్కూల్లోనూ,పోలీస్ ట్రైనింగ్ లోనూ అభిషేక్ కి మంచి ఫ్రెండ్.”హలో ఎవరూ”అవతలనుంచి రఘురామ్ గొంతు వినబడింది.”నేను.అభిషేక్ ని మాట్లాడుతున్నాను”

“వా! అభీ, చాలా రోజుల తరవాత.ఎక్కడనుంచి?”

“నేను సిటీలోనే ఉన్నాను,ఒక కేసు విషయంలో.ఆ విషయం అంతా తరవాత చెప్తాను.నువ్వు ఒక హెల్ప్ చేయాలి.”

“చెప్పు”

“ఒక మనిషి వివరాలు పంపిస్తాను.అతన్ని ఫాలో చేయాలి.”

“ఫోన్ డాటా కావాలా?”

“అక్కర్లేదు.కానీ ఆ మనిషి ఫోన్ చేసే నంబర్స్ కావాలి”

“ఎప్పట్నుంచి ఫాలో చేయాలి”

“ఇమ్మీడియట్లీ, ఫ్రమ్ నౌ ఆన్.సారీ ఫర్ ద ట్రబుల్.ఒక్కటి మాత్రం చెప్పగలను.ఎక్కువ రోజులు అవసరం ఉండకపోవచ్చు.సాటిస్ఫేక్టరీ ఇన్ఫర్మేషన్ వస్తే టూడేస్ లో కూడా టెర్మినేట్ కావచ్చు.నీకు తెలియనిదేముంది?”

“నో ప్రాబ్లెం.నువ్వు అడగడం నేను చేయకపోవడమూనా.ప్లీజ్ సెండ్ ద డిటెయిల్స్.ఐ విల్ టేక్ కేర్”

“థాంక్యూ.ఈ సిటిలోఈ టైమ్ లో నువ్విక్కడ ఉండడం నిజంగా ఐ ఫీల్ వెరి లక్కీ.”

“కమాన్ అభిషేక్ వుయ్ ఆర్ టూ క్లోజ్ ఫర్ ఫార్మాలిటీస్.డోంట్ వర్రీ.ఐ విల్ టేక్ కేర్.ఎనీథింగ్ పర్సనల్ ఇన్ ద కేస్?”

“హోప్ నాట్.వుయ్ టాక్ లేటర్.బై”ఫోన్ కట్ చేశాడు అభిషేక్.

తరువాత అభిషేక్,శివహైమ ఇద్దరూ కలిసి షాపింగ్ చేశారు.తిరిగి ఎపార్ట్మెంట్ దగ్గర దిగబెడుతూ

“యు హేవ్ గివెన్ ద బ్రేక్ఫాస్ట్. ఐ విల్ గివ్ ద డిన్నర్.లెట్స్ హేవ్ డిన్నర్ ఇన్ తాజ్ వాచింగ్ ద మూన్ లైట్”

అందంగా,అంగీకారంగా నవ్వింది శివహైమ.

 

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked