ధారావాహికలు

విశ్వామిత్ర 2015 – నవల ( 19వ భాగము )

“చాలా మాసివ్ ఆపరేషన్ కదూ” శివకుమార్ చూపించిన కుర్చీలో కూర్చుంటూనే అన్నాడు అభిషేక్. శివకుమార్ వెంటనే షార్ప్ గా, ప్రశ్నార్థకంగా చూశాడు అభిషేక్ వంక. “ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం,ఇళ్ళు ఖాళీ చేయించడం, అంగబలంతోటి, అధికారబలం తోటి అర్థబలం తోటి..ఎందుకిదంతా?” శివకుమార్, అభిషేక్ కళ్ళల్లోకి చూస్తూ ఏమీ మాట్లాడలేదు. తన రేంజ్ దాటిపోయిందని తెలుసుకున్న రాజు అభిషేక్ చెప్పినట్టుగానే నిశ్శబ్దంగా శివకుమార్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. “మీ మోడస్ ఆపరాండీ ఏమిటంటే మీరు కన్ను వేసిన స్థలం చుట్టుపక్కల ఏదో ఒకటి రెండు స్థలాలు కొనడం. అక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు, పేకాట క్లబ్ లు, వ్యభిచార నిలయాలు నడపడం, వాటిని తట్టుకోలేక వారు అక్కడనుంచి బయటకు వెళ్ళిపోయేలా చేయడం, వాటికికూడా కదలని వాళ్ళని డైరెక్ట్ గా బెదిరించడం. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా న్యాయం దక్కదు,కారణం హోంమినిష్టర్ మీమనిషి, మునిసిపల్ కమీషనర్ ఆపీస్ కి వస్తే మీరుంటారు” అభిషేక్ ఒక్క క్షణం ఆగి మళ్ళీ కంటిన్యూ చేశాడు”గ్రాండియోర్ కూలకముందు మీరు కొన్ని ఇళ్ళను కూల్చారు. “ఇంప్లోషన్” టెక్నిక్. బిల్డింగ్ ని థరోగా స్టడీ చేసి, స్పాట్స్ ఐడెంటిఫై చేసి, అక్కడ బాంబ్స్ పెట్టి అన్నీ ఒకేసారి పేల్చి ఒక్కసారిగా బిల్డింగ్ ని నేల కూల్చడం. ఈ పనికై మీరు ఒక డిమాలిషన్ ఎక్స్పర్ట్ని చైనానుంచి పిలిపించి అతని ఆధ్వర్యంలో బిల్డింగ్ లు కూల్చారు. అవి మీకు రెండు విధాలుగా ఉపయోగపడ్డాయి. చుట్టుక్కల వాళ్ళు భయపడి ఖాళీ చేయడం ఒకటి,రెండవది పెద్ద బిల్డింగ్ లు కూల్చడానికి రెక్కీ లాగా. అవేవీ న్యూస్ లో రాలేదు. ఒక్క ప్రొటెస్ట్ కూడా రిజిస్టర్ కాలేదు, ఖాళీ చేసినవారి దగ్గర్నుంచి. లోవర్ మిడిల్ క్లాసు నుంచి కాని, అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి కాని,  చివరకు స్లమ్.. స్లమ్ మొత్తం వెకేట్ చేయించినప్పటికి గాని, అది కొంచెం ఆశ్చర్యమే”మళ్ళీ ఒకక్షణం ఆగాడు అభిషేక్. రాజుకి ఒక విషయం అర్థమైంది. శివకుమార్ మధ్యలో ఎక్కడా ఆపడానికి ప్రయత్నించడం లేదంటే అభిషేక్ చెప్పేదంతా నిజమే అన్నమాట. రాజుకి టెన్షన్ తో శరీరం కొద్దిగా వణకడం ప్రారంభించింది. అభిషేక్ రాజువైపు తిరిగాడు”రాజుగారూ వీళ్ళు బిల్డింగ్ లు ఎలా కూలుస్తారో తెలుసా? ఈ కమీషనర్ గారు ఫస్ట్, ఒక నోటీసు పంపిస్తారు. ఫైర్ ఎక్విప్మెంట్ సరిగ్గాలేదనో, టాక్స్ సరిగ్గా కట్టలేదనో ,ఎలక్ట్రిక్ కనెక్షన్ లు సరిగ్గా లేవనో. ఒక రెండు మూడు రోజులు ఆ బిల్డింగ్ మూసేలా చూస్తారు. సరిగ్గా ఆరెండు మూడు రోజుల్లో విశ్వామిత్ర అతని మనుషులు తమకు కావలసిన పని పూర్తి చేసుకుంటారు. ఆ తరువాత ఆ బిల్డింగ్ తిరిగి ఓనర్ చేతికొచ్చేలోపు గాని, వచ్చిన తరవాత ఏదైనా మంచి ముహూర్తంలోగాని బిల్డింగ్ కూల్చేస్తారు.ఏమ్ ఐ రైట్ కమీషనర్?”శివకుమార్ వైపు తిరిగి అడిగాడు అభిషేక్.
అంతవరకూ నిశ్శబ్దంగా ఏమీ మాట్లాడకుండా అంతా వింటున్న శివకుమర్ శాంతంగా తన కుర్చీలోకి వెనక్కి జారాడు.”ఆధారాలు లేకుండా మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఆఫీసర్”గంభీరంగా ధ్వనించింది శివకుమార్ గొంతు.
నవ్వాడు అభిషేక్” హోమ్ మినిష్టర్ మీగ్రూప్ లో లేడు. కాని మీప్లాన్ లో ఉన్నాడు. అవసరమైనంత కాలం వాడుకున్నారు. అవసరం అయిపోయింది.అతని ఆస్తుల్ని కూడా ధ్వంసం చేయడం ప్రారంభించారు”
శివకుమార్ ఏమీ మాట్లాడలేదు. అభిషేక్ కంటిన్యూ చేశాడు. “ఇక ఆధారాల సంగతి. ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. అతనికి, ప్రెజెంట్ ఎమ్మెల్యే అయిన హోం మినిష్టర్ కి పడదు. అతనిని, అతని అనుచరులవి, అతని కుటుంబ సభ్యులవి కూడా మీరు ఖాళీ చేయించారు. ఆ మాజీని ఆయన అనుచరులని ఆయనద్వారా “అమ్మడం మంచిది అన్న పరిస్థితి” మీఅధికారాన్ని ఉపయోగించి కల్పించారు. ఆ ఎమ్ ఎల్ ఏ చెప్పిన విషయం నేను మీకు చెప్తాను.”ఆస్థలమూ ఆ ఇళ్ళూ ఒక చెరువును కబ్జాచేసి కట్టినదనీ, ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నాడని చెప్పి అతన్ని అతని అనుచరులనీ ఆ స్థలాలు తొందరగా అమ్మేట్టు చేసింది మీరు. కరెక్ట్ గా చెప్పాలంటే అతనిచేత విశ్వామిత్ర అనుచరులకే మంచిరేటు మీద అమ్మించారు. హోమ్ అనుచరుడైన విశ్వామిత్ర నష్టపోతాడనే సంతోషంతో ఎమ్ ఎల్ ఏ కూడా తొందరగా అమ్మేశాడు, తనవాళ్ళందరిచేత కూడా అమ్మించాడు.ఇలా ఒక్క నాలా కాదు దాదాపు ఇరవైనాలుగు నాలాలున్నాయి సిటీలో, అన్నీ కొంచెంకొంచెంగా ఇదే పద్ధతుల్లో మీ చేతుల్లోకి వచ్చేశాయి.”ఆగాడు అభిషేక్. రాజుకి అభిషేక్ మీద విపరీతంగా గౌరవం పెరిగిపోయింది. వారంరోజుల్లో వంటిమీద బుల్లెట్ గాయాలతో ఎంత వర్క్ చేశాడు? రాజువైపు తిరిగాడు అభిషేక్”రాజుగారూ. వీళ్ళు ఎలా చేస్తున్నారో నాకు తెలిసింది. కాని ఎందుకు చేస్తున్నారో నాకు తెలియట్లేదు. క్లియర్ గా చెప్పాలంటే వీళ్ళు ..”అని జేబులోంచి ఇంకో బ్లూప్రింట్ లాటిది తీశాడు. “రాబోయే రోజుల్లో” పెన్నుతో కొన్నిచోట్ల రౌండ్ చేశాడు.”యు కెన్ టేకిట్ ఫ్రమ్ మి. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్ లన్నీ బ్లాస్ట్ చేయబడతాయి” తలుపు ఎవరో తట్టిన శబ్దం వినబడింది. “ఎస్” అన్నాడు శివకుమార్. తలుపు తోసుకుని లోపలికి తొంగి చూశాడు శివకుమార్ పిఏ. “సార్ మీటింగ్” “పది నిమిషాలు”చెప్పాడు శివకుమార్
“థాంక్స్.”కుర్చీలోంచి లేచాడు అభిషేక్”నేను చెప్పాల్సిందంతా అయిపోయింది. ఇక మీరు చెప్పాల్సిందే మిగిలింది.ఒక్కమాట.నాదగ్గర ఆధారాలు లేవు కాబట్టి మీరు నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కాని మీకు బలమైన శత్రువు ఎవడో ఉన్నాడు. వాడెవడో నాకు తెలియదు. మీకు వాడెవడొ తెలుసు. బి కేర్ఫుల్ విత్ హిమ్. హి ఈస్ ఆన్ రేజ్. నేనెవరితో మాట్లాడినా వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు. నాఫోన్ కూడా టాప్ చేసే ఉంటాడు. నేను మీకు ఫోన్ చేసి వచ్చాను.మీరూమ్ బగ్ చేసి ఉండొచ్చు.యు ఆర్ ఇన్ డేంజర్ నౌ”శివకుమార్ మొహం కొంచెం సీరియస్ గా మారింది. ముగ్గురూ బయట కారుదాకా వచ్చారు. రాజు కారులాక్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు”ఆఖరి ప్రశ్న.శివహైమ మీకెలా తెలుసు. శివహైమ ఫోన్ లో విశ్వామిత్రది మీది ఇద్దరి నంబర్ లు చూశాను. యూ ఆల్ త్రీ ఇన్ టచ్ టిల్ డేట్. ఆల్ మిస్స్డ్ కాల్స్.ఏమీ మాట్లాడుకోరు. కాని ప్రతీరోజూ లేదా రోజు విడిచి రోజు. ఏమిటి మీముగ్గురికి ఏమిటి సంబంధం?ఈ కేసులో శివహైమకు కూడా భాగం ఉందా? ఉన్నాలేకపోయినా శివహైమ కూడా ప్రమాదంలో ఉన్నట్టే.నేనాల్రెడీ చెప్పాను. ఏదైనా సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపొమ్మని. నాకు ఎవిడెన్స్ దొరికాక “ఐ డోంట్ హెసిటేట్ టు అరెస్ట్ శివహైమ ఆల్సో.కాని అంతకుముందే మీఅందరి ప్రాణాలకు ప్రమాదం ఉంది. బి కేర్ఫుల్”కారులో కూర్చున్నాడు అభిషేక్.”బై కమీష           నర్”చెప్పి విండో క్లోజ్ చేశాడు. కారు రివ్వున త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వైపు దూసుకుపోయింది. వెళిపోతున్న కారువైపే చూస్తూ మునిసిపల్ కమీషనర్ శివకుమార్ జేబులోంచి ఫోన్ బయటకు తీశాడు విశ్వామిత్ర నంబర్ కి మెసేజ్ టైప్ చేశాడు”వార్ ఈస్ ఆన్”వెంటనే రిప్లై వచ్చింది”ఎవ్విరిథింగ్ ఈస్ గోఇంగ్ అకార్డింగ్ టు ద ప్లాన్. బట్ లెట్స్ బిరెడీ ఫర్ ఎనీ సర్ప్రైజెస్. డెత్ ఆఫ్ ఫోర్ ప్యూపిల్ అన్ ఫార్ట్యునేట్”.  ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు శివకుమార్ మీటింగ్ కోసమై

కారు డ్రైవ్ చేస్తున్న రాజు”నాకు కొన్ని డౌట్ లు ఉన్నాయి సార్.అడగమంటారా?”
“గోఅహెడ్”చెప్పాడు అభిషేక్ “మాట్లాడుకుంటే మంచిదే కదా. ఏదైనా బయట పడొచ్చు”
“బ్లాస్ట్ లు జరగబోయే ప్రదేశాలు చూపించారు కదా? ఊరికినే వాళ్ళని బెదరకొట్టడానికి చూపించారా, నిజమే అయితే ఎలా కనిపెట్టారు సార్”
“దేరీజ్ ఎ పాటెర్న్, ఒక నమూనా, ఒక క్రమత. ఈ బ్లాస్ట్ల్ లకి ఒక క్రమత ఉంది.ఈ విశ్వామిత్ర ఒక రౌడీయో లేదా ఒక ఇంజనీరో లేదా ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసరో నాకు తెలియదు గాని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అని చెప్పొచ్చు. ఎన్నోఆస్తులు కొన్నాడు. అవికూడా ఒక క్రమపద్దతిలో కొన్నాడు. ఆశ్చర్యమేమిటంటే చాలావరకూ నాలాలలో కొన్నాడు.కొన్నవాటినన్నిధ్వంసం చేశాడు.మిగతావాళ్ళని భయపెట్టి వాళ్ళని ఖాళీ చేయించాడు. అవికూడా తనే కొన్నాడు. అవీధ్వంసంచేశాడు. ఇంకొక విషయం ఏమిటంటే అతని దృష్టి అంతా సిటీలోని అయిదు రోడ్ ల మీద కూడా ఉంది. ఒకటి బీచ్ రోడ్. రెండోది హైవే సంతోషపురంనుంచి పిఎమ్ వి కోలనీదాకా, మూడోది లక్ష్మీ పురంనుంచి రైల్వేస్టేషన్ దాకా. నాలుగవది రైల్వేస్టేషన్ కి పారలల్ గా ఉన్ననేషనల్ హైవేకి మధ్యనున్న కనెక్టింగ్ రోడ్డు. ఐదవది ఆ కనెక్టింగ్ రోడ్డుమీంచి వెళితే హైవేలో ఏప్లేస్ కి చేరుకుంటాం?”
“ఈతచెట్లపాలెం”చెప్పాడు రాజు
“ఈతచెట్లపాలెం నుంచి ఎయిర్పోర్ట్ దాకా. ఎందుకంటే విశ్వామిత్ర అతని అనుచరులు, హోమ్ మినిష్టర్ అతని బంధువులు కొన్నవి, కొన్ని లోకల్ అపోజిషన్ పార్టీ ఎమ్ ఎల్ ఏ, అతని అనుచరులు కొ్న్నవి ఆ స్థలాలన్నీ ఆ రోడ్డుల్లోవే”
సడన్ గా కారు పక్కకు తీసి ఆపాడు రాజు. అభీషేక్ ఆశ్చర్యపోయాడు”సారీసర్. మీరిందాకా చెప్తుంటే నాకో విషయం గుర్తొచ్చింది. లక్ష్మీపురం నుంచి రైల్వేస్టేషన్ కి డబుల్ లేన్ ఫ్లయ్ ఓవర్ శాంక్షన్ అయింది సార్. 100 crore ప్రాజెక్ట్. జగదాంబ నుంచి పాతపోస్టాఫీసుదాక ఇంకొకటి శాంక్షన్ అయిందని కూడా అనుకుంటున్నారు సార్. అది ఒక 150 crores ప్రాజెక్ట్. గవర్న్మెంట్ ప్రాజెక్ట్ కాబట్టి సిఎమ్ కి రావలసిన కిక్ బాక్స్ కూడా వెంటనే ముట్టాయని అందుకనే తొందరగా శాంక్షన్ అయిందనీ అందరూ అనుకుంటున్నారు సార్. ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉపయోగపడుతుందా సార్”
“లక్ష్మీపురం, జగదాంబ ఈరెండూ బాగా రద్దీ జంక్షన్ లు కదూ”
“అవును సార్”
అభిషేక్ మొహం ఒక్కసారిగా చాలా సీరియస్ గా మారింది.కారు డాష్ బోర్డ్ మీద టాప్ చేస్తూ ఏదో తీవ్రంగా ఆలోచించాడు.”థాంక్స్ రాజూ పూర్తిగా అర్థమైపోయింది. విశ్వామిత్ర అపోజిషన్ కాంట్రాక్టర్ కి ఎవళ్ళకో ఈరెండు కాంట్రాక్ట్ లు వెళిపోయాయి. విశ్వామిత్ర గ్రూప్ కంట్రాక్టరెండో పొజిషన్ లో ఉండిఉంటాడు. వర్క్ ఏమైనా స్టార్ట్ అయిందా?”
“లేదు సార్. మూడేళ్ళనుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది”
“దట్స్ ఇట్. అతను పని స్టార్ట్ చేయకుండా, చేయనివ్వకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు.. కమీషనర్ వీళ్ళకు అండగా ఉన్నాడు. ఆ కంట్రాక్టర్ చేయలేకపోయాడు కాబట్టి మాకిమ్మని అడగాలనీ కోర్టుకెళ్ళాలని వీళ్ళ ఉద్దేశం కావచ్చు”
“నాకు ఈ టెండర్లు, కాంట్రాక్టర్లు ఈరూల్స్ నాకు తెలియవు సార్.అయితే దిస్ ఈస్ వార్ బిట్వీన్ టూ కంట్రాక్టర్స్ అంటారా?”
“పైకి అలా కనిపిస్తోంది. కాని ఒక పక్క విశ్వామిత్ర ఉన్నాడు. అతనికి హోమ్ మినిష్టర్ అండ. రెండవపక్క ఇంకొక మనిషి, స్టేట్ హోమ్ మినిష్టర్ తో పోరాడగలిగే సత్తా, అవసరం ఉన్న ఇంకొక వ్యక్తి..”
“సిఎమ్”రాజు కళ్ళు పెద్దవయ్యాయి
“ఎస్.సిఎమ్.సిఎమ్మే. ప్రాజెక్ట్ లో కిక్ బాక్ లు తీసుకున్న అతనికే ఈఅవసరం ఉంది. కొంతవరకు మబ్బు విడింది. కానీ విశ్వామిత్ర గ్రూప్ ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు.ఈపనులన్నీ చేయడానికి, ధైర్యం, తెలివితేటలే కాదు చాలా డబ్బుకూడా కావాలి”
రాజుకూడా దీర్ఘాలోచనలో మునిగిపోయాడు.”సార్ అయితే,జగదీష్…”
“జగదీష్ హోమ్ మనిషి కాదు. సిఎమ్ మనిషి. ఆరోజు దాబాకు మనం వెళ్ళబోతున్న సంగతి జగదీష్ చెప్పింది సిఎమ్ కి. హోమ్ కి కాదు”అభిషేక్ ఒక్కక్షణం ఆగాడు”హోమ్ కి ఇందులో ఎటువంటి పాత్రా లేదు. చురుకుగా వున్నాడు, అంతవరకూ క్రిమినల్ రికార్డ్ లేనివాడు, ఎందుకైన పనికివస్తాడని విశ్వామిత్రని చేరదీశాడు. సామర్థ్యం ఉన్నవాడని గ్రహించి, చనువిచ్చాడు, నమ్మాడు కూడా”
“ఏది ఏమైనా ఆస్తులు కొనడం వాటిని ధ్వంసం చేయడం నాకర్థం కాలేదు సార్”
“కరక్ట్. నాకుకూడా అదే అర్థం కావట్లేదు.ఎవడైనా ఒక ఫ్లైఓవర్ వచ్చి ఒక ప్రాంతం డెవలప్ అవుతుందని తెలిస్తే అక్కడున్న మంచి స్థలాలు తక్కువ ధరకు కొని లాభం చేసుకుంటాడు. అంతేకాని ఆ విషయం ఫ్లైఓవర్ కోసమని జరిగే రోడ్డు విస్తరణలో పోయే స్థలాలని ఎవడు కొనుక్కోడు కదా?”ఒక్కసారి ఆగాడు అభిషేక్.”అంటే… ఫ్లైఓవర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు దెమ్. మైగుడ్ నెస్. ఏం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది?”అభిషేక్ తల పట్టుకున్నాడు “ఫ్లైఓవర్ ఇంపార్టెంట్ అయితే నాలాలలో స్థలాల గొడవ ఎందుకు? శివహైమకీ ఈ కేసుకీ సంబంధం ఏమిటి?” రాజు ఏం మాట్లాడలేకపోయాడు. కాని అభిషేక్ హృదయంలో రగులుతున్న బాధను అతను అర్థం చేసుకున్నాడు. ఏదో సింపిల్ కేసు అనుకుని గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చెయ్యొచ్చని అడిగి మరీ వైజాగ్ కి వచ్చాడు. కానీ ఇక్కడకు వచ్చాక కేసు మరీ టఫ్ , ఇంకా గర్ల్ ఫ్రెండే కేసులో ముద్దాయేమో అని అనుమానించాల్సిన ఘటనలు. కానీ అభిషేక్ బ్రిలియన్స్ ని అభినందించకుండా ఉండలేకపోయాడు. అదే అన్నాడు”మీరు బ్రిలియంట్ సార్. ఇంత తక్కువ వ్యవధిలో కేసుని ఒక కొలిక్కి తీసుకు వచ్చేశారు. మీగర్ల్ ఫ్రెండ్ ని నేను చూశాను సార్. నాకెందుకో ఆమె ఇందులో భాగస్వామి కాదని నమ్మకంగా ఉంది సార్”అన్నాడు. ఇంతలో అభిషేక్ ఫోన్ మ్రోగింది. అభిషేక్ ఎత్తలేదు.”ఫోన్ సార్”రాజు చెప్పాడు. అభిషేక్ ఫోన్ తీసి రాజుకిచ్చాడు. రాజు మాట్లాడాడు. జగదీష్ నుంచి ఫోన్.”సారేరి?”అడిగాడు జగదీష్
“వేరెవరితోనో మాట్లాడుతున్నారు?”
“ఎక్కడున్నారు?”
“గెస్ట్ హౌస్ లోనే”
ఏదో చెప్పాడు జగదీష్
“అలాగే సార్ కి చెప్తాను””సార్ జగదీష్ నుంచి ఫోన్. హోమ్ దగ్గరనుంచి ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ అంట. వెంటనే రమ్మంటున్నాడు. ఫోన్ చేస్తారా?”అడిగాడు రాజు
“అక్కర్లేదు.స్టేషన్ కి వెళదాం”
ఇద్దరూ వెంటనే స్టేషన్ కి వెళ్ళారు. ఆశ్చర్యంగా రవిబాబు కూడా అక్కడే ఉన్నాడు. జగదీష్ చాలా హడావుడిగా ఉన్నాడు. దాబా వద్ద జరిగిన కాల్పుల సంఘటనలో దాబా చుట్టుపక్కల ప్రదేశాలలో సెర్చ్ చేయమని హోమ్ ఆర్డర్స్ వచ్చాయంట.దానికి కారణం సిఎమ్ ఎంక్వయిరీ కారణం అంట. వాళ్ళని చూసినవాళ్ళు కాబట్టి అభిషేక్ ని,రాజుని కూడా సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొనమని,. ఆ చనిపోయినవాళ్ళెవరో, చంపినవాళ్ళెవరో వెంటనే ఇన్వెస్టిగేట్ చేయమని సిఎమ్ ఆర్డర్స్.”ఇదేంటి సార్ సిఎమ్ విలన్ అనుకుంటే ఆయనే ఇన్వెస్టిగేట్ చేయమంటున్నాడు?”అడిగాడు రాజు.”చంపబడ్డ వాళ్ళు, చంపబడేవాళ్ళే మనకు దొరుకుతారు.. చంపినవాళ్ళు దొరకరు. మన రిపోర్ట్ మాత్రం చంపినవాళ్ళకి వెళుతుంది.ఇట్స్ ఎ వార్ బిట్వీన్ సిఎమ్ అండ్ విశ్వామిత్ర. మధ్యలో మనం, హోమ్ మినిష్టర్ ఇరుక్కున్నాం.లెటస్ సీ”చెప్పాడు అభిషేక్.
ఒక పోలీస్ జీప్ లో అభిషేక్, రాజు, జగదీష్, రవిబాబు ఇంకో రెండు వానుల్లోగన్స్ తో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం మూడు వెహికిల్స్ వేగంగా దాబావైపు దూసుకుపోయాయి.

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked