Month: August 2017

అమావాస్యలో పున్నమి

కవితా స్రవంతి
మొక్కపాటి పూర్ణిమ సుధ విజయవాడ - రేడియో మిర్చి రా..! కొన్ని క్షణాలని అరువు తెచ్చుకుందాం..! కాలంతో పాటు పరుగులు తీసే మన అహాన్ని, ఆత్మాభిమానం అనే ముసుగులో కప్పెట్టి, దర్పపు పూత పూసిన పొడి మాటలతో నెట్టుకొస్తున్నది చాలు సాధికారత - అస్థిత్వాల అన్వేషణలో మనల్ని మనం చంపుకున్న మాటల తూటాల్ని మూట కట్టి స్మార్ట్ ఫోన్లలో సమాధి చేద్దాం... ప్రైవసీ సెట్టింగుల్లోని ప్యాటర్న్ అన్లాక్ ని తెలుసుకోవాలనే అత్యుత్సాహాన్ని కాసేపు పక్కనెట్టి మన మనసుల్ని అన్లాక్ చేసే ప్యాటర్న్ కనుక్కునేందుకు ఒక్కసారైనా ప్రయత్నిద్దాం... నీలోని ఆక్రోశాన్ని, నాలోని ఆవేదనని వెళ్ళగక్కి, అహాల అద్దాలు భళ్ళున బద్దలయేదాకా మౌనాలనే బాణాలతో ఇద్దరి అస్థిత్వాన్ని చెరిపి, మన అనే సరికొత్త ప్రపంచంలోకి అడుగిడుదాం..! మహా అయితే, ఖర్చయ్యేది, కొన్ని కొన్నీళ్ళు..! కొన్ని క్షమాపణలు...!! అదీ మంచిదే..! ఎన్నాళ్ళయిందో ఆ కళ్ళని కడిగి... నీకోసం ఆ మాత్

చిత్రరంజని-August 2017

చిత్ర రంజని
దేవులపల్లి కృష్ణశాస్త్రి (నవంబర్ 1, 1897 – ఫిబ్రవరి 24, 1980) తెలుగులో భావకవిత్వమనగానే మొదట స్ఫురణకు వచ్చేది కృష్ణశాస్త్రి. నెత్తిపై గిరజాల జుట్టు, భుజంపై చెరగని కండువా భావకవిని వర్ణించటానికి ఉపయోగపడే చిహ్నాలుగా కూడా నిలిచాయి. వీరిని తెలుగు కవిత్వ ప్రపంచంలో 'ఆంధ్రా షెల్లీ' అని పిలవడం కూడా కద్దూ. భావకవిత్వంలో ప్రణయ, విరహ, విషాద, ఆత్మాశ్రయ మొదలగు రీతుల్లో కలకాలం గురుండీపోయే కవిత్వం రాసారు. వీరి రచనలు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేవి - అమృతవీణ, శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, మేఘమాల, కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి, దీపావళి, మహతి వీరి గేయం 'జయ జయ ప్రియభారత జనయిత్రీ దివధాత్రి ' ఇతర ప్రసిద్ధ దేశభక్తి గేయాలకు తీసిపోదు.

ఇగో నిన్నే !

కవితా స్రవంతి
- ఫణి మాధవ్ కస్తూరి ఇగో నిన్నే .... ఎందుకా చికాకు ? ఎవర్ని చూసి ఆ అసహనం ? ఎవడ్ని చూసినా ఆ కోపం ? ఇగో నిన్నే ... ఒక్క సారి చుట్టూ చూడు, ఇప్పుడు లోపలికి చూడు.. అసలు నిన్నవడైనా పట్టించుకుంటునాడా.. నిన్ను నువ్వు గమనిస్తున్నావా ఇగో నిన్నే ఎన్నాళ్ళైంది నువ్వు మనసారా నవ్వి, పక్కవాడి ఎదుగు చూసి నవ్వి నీవాళ్లతో మనసు విప్పు మాట్లాడి. అసలు నీతో నువ్వు మాట్లాడి... ఎన్నాళ్లైందీ... ఇగో నిన్నే ఎందుకా ఇగో… ఏం సాధించావని ఇగో నిన్నే... గుర్తెట్టుకో...జనం లేక మనం లేము.. ఆ మనం లో జనం లో నువ్వూ ఉన్నావా ? ఇగో నిన్నే ...

సంగీత పాఠాలు

సేకరణ: డా.కోదాటి సాంబయ్య (మూడవ భాగం) ధాతువు : ఒక సంగీత రచన లోని స్వర భాగమును ధాతువు అంటారు. సంగీతం లో కొంత స్థాయికి చేరిన వారు ఈ ధాతువు సహాయంతో కొత్త రచనలను నేర్చుకోవచ్చు . దీనినే ఇంగ్లిషు లో నోటేషణ్ అంటారు. ఉదా : వరవీణా - రూపక తాళం గీతం లోని ధాతువు. గ గ | పా పా || ద ప | సా సా || మాతువు : ఒక సంగీత రచన లోని సాహిత్య భాగమును మాతువు అంటారు . ఉదా : వరవీణా రూపక తాళ గీతము లో మాతువు .....వ ర | వీ ణా || మృ దు | పా ణీ || ఇప్పుడు దాతు , మాతు లను కలిపి రాస్తే ఇలా ఉంటుంది. గ గ | పా పా || ద ప | సా సా || వ ర | వీ ణా || మృ దు| పా ణీ || కాలము : 1. ప్రధమ కాలము : ఒక క్రియకు ఒక అక్షరం చొప్పున పాడడాన్ని ప్రధమ కాలము అంటారు ..ఉదా: స రి గ మ | ప ద | ని స || స ని ద ప | మ గ | రి స || 2. ద్వితీయ కాలము : ఒక క్రియకు రెండు అక్షరములు చొప్పున పాడితే..ద్వితీయ కాలము ..ఉదా: స రి గ మ ప ద ని స | స ని ద ప | మ గ రి స |

ఉపనిషత్తులు

సారస్వతం
శారదాప్రసాద్ (టీవీయస్.శాస్త్రి) ​వేదాల యొక్క చివరి భాగాలను అంటే అంతములయిన (వేద+అంతములు)వేదాంతాలకు ఉపనిషత్తులని పేరు. ఉపనిషత్తులు మనమంతా దివ్యాత్మ స్వరూపులమని చెబుతున్నాయి .మరణించే ఈ శరీరంలో అమృతత్త్వమైనది ఒకటి ఉంది. అదే ఆత్మతత్త్వం. మానవుడు ఇంద్రియాలు తమంతట తామే పని చేస్తున్నాయని అనుకుంటాడు . కానీ, అంతర్గతంగా లోపల ఉన్న శక్తితత్త్వమే దివ్య చైతన్యమనీ మానవునికి తెలియదు. లోపలున్న ఆత్మ మనకంటికి కంటిగా, చెవులకు చెవిగా, మనస్సుకు మనస్సుగా ఉన్నదని కేనోపనిషత్‌ ఉద్ఘోషిస్తుంది. శరీరంలోని ఒక అవయవం ఇంకొక అవయవాన్ని బాధించడం అసహజమైన చర్య. ఆ విధంగానే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి భగవంతుని అవయవాలు.ఈ ఆత్మ చెవికి చెవి, మనసుకు మనసు, వాక్కునకు వాక్కు మరియు ప్రాణానికి ప్రాణము, కన్నుకు కన్ను అని ఆ పరబ్రహ్మ తత్వాన్ని అపూర్వ౦గా తెలిపినది కేనోపనిషత్. అడవులలో గురుశిష్యుల మధ్యన జరిగిన చర్చలనే ‘ఉపనిషత్తులు’ అంటారు. ఈ ఉప

భ్రమ

కవితా స్రవంతి
- పారనంది శాంతకుమారి వయసుపెరిగినంత మాత్రాన బుద్ధి పెరుగుతుందని అనుకోవటం భ్రమ. మనసుమంచిదైనంత మాత్రాన మమత ఉంటుందనుకోవటం భ్రమ. విధ్యావంతుడైనంత మాత్రాన వివేకం ఉంటుందనిఅనుకోవటం భ్రమ. అమెరికా సంబంధం అయినంత మాత్రాన అమ్మాయి సుఖపడుతుందని అనుకోవటం భ్రమ. తక్కువ చదువుకున్న అమ్మాయి వస్తే ఇంటిపనులన్నీ చేసేస్తుందని అనుకోవటం భ్రమ. కాలం కలిసి వచ్చినంత మాత్రాన నడిచివచ్చే కొడుకు పుడతాడనుకోవటం భ్రమ. రంగురాళ్ళు ధరించినంత మాత్రాన రాత మారిపోతుందని అనుకోవటం భ్రమ. డబ్బు సంపాదించినంత మాత్రాన సుఖం కలుగుతుందని అనుకోవటం భ్రమ. విరాళాలు ఇచ్చినంత మాత్రాన వైరాగ్యం కలుగుతుందని అనుకోవటం భ్రమ. తల్లితండ్రులను బయటకు పంపినంత మాత్రాన భార్యతో సుఖపడవచ్చన్నది భ్రమ. కార్పోరేట్ కళాశాలల్లో చదివించినంత మాత్రాన కొడుకు ఎత్తుకు ఎదిగిపోతాడని అనుకోవటం భ్రమ. కన్నీళ్ళు కార్చినంతమాత్రాన కరుణ ఉంటుందనుకోవటం భ్రమ. కషాయం క

అసంతృప్తి

కవితా స్రవంతి
-పారనంది శాంత కుమారి.  వారానికి రెండురోజులు శలవులొచ్చినా ఐదు రోజులు పనిచేయాల్సి వస్తోందని (బద్ధకస్త)ఉద్యోగస్తులకు అసంతృప్తి. ప్రారంభంలో తక్కువగా ఉన్నజీతం ఇప్పుడు ఎక్కువే అయినప్పటికీ (పేరాశాపరులైన)సాఫ్ట్ వేర్లకు అసంతృప్తి. ఇంటిలోఉంటూ పనుల్లో ఇంతోఅంతో సాయంచేసే కోడలును చూసి కొడుకుతోపాటు ఆమెకూడా సంపాదిస్తేబాగుణ్ణు కదా అని (దురాశా పరురాలైన)ఈ అత్తగారికి అసంతృప్తి. ఉద్యోగంచేస్తున్న కోడలోస్తే ఇంటిపనిలో సాయంచేయటం లేదని అన్నిపనులూ తనే చేసుకోవాల్సివస్తోందని ఆ (నిరాశా పరురాలైన)అత్తగారికి అసంతృప్తి. కూతుర్నిఎక్కువగా తమవద్దకు పంపటంలేదని ఆ (అత్యాశా పరుడైన)వియ్యంకుడికి అసంతృప్తి. కోడలు తరుచూ తనపుట్టింటికి వెళ్తోందని ఈ (ద్వేష పూరితుడైన)మామగారికి అసంతృప్తి. తమ కూతురుకొంగుకు అల్లుడు ముడివేయబడటం లేదని ఆ (స్వార్ధపరురాలైన)అత్తగారికి అసంతృప్తి. కోడలు తనకొడుకును కుక్కనుచేసి ఆడిస్తోందని ఈ(అసు

అష్ట కష్టాలు

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు పాదాలక్రింద మంటలు,వెన్నులోవణుకు, గుండెలోగుబులు,మనసులోదిగులు, ముందునుయ్యి,వెనుకగొయ్యి, మాట్లాడితేముప్పు,మౌనంగాఉంటే తప్పు, కన్నుమూస్తే కంగారెత్తించే కలలు, కన్నుతెరిస్తే ఆక్రమించుకొనే ఆశలవలలు. ఇలాంటి పరిస్థితుల్లో పలాయనం పనిచెయ్యదని, డోలాయమానం దారిచూపదని అర్ధమౌతోంది. వెనుకడుగు వేస్తే వెక్కిరింతలు వినిపిస్తున్నాయి, ముందడుగు వేస్తె మోచిప్పలు పగులుతున్నాయి, కుదురుగా నిలబడదామంటే కాళ్ళక్రింద మంటలు దహిస్తునాయి. ప్రారబ్ధం ప్రకోపిస్తోంది,ప్రాయోపవేశాన్ని ప్రబోధిస్తోంది. కర్మలు కర్కశంగా శపిస్తున్నాయి, ఆలోచనలు ఉపశమనాన్ని జపిస్తునాయి, ఆశలు ఆలంబనకోసం తపిస్తున్నాయి, బ్రతుకును అర్ధం ప్రశ్నిస్తోంది. కలతలు స్పర్శిస్తునాయి,నలతలు వర్షిస్తునాయి. పరిచయస్తులు పరారయ్యారు, ఆప్తులనుకున్నవాళ్ళు ఆదమరిచి ఉన్నారు, అయినవాళ్ళు అయోమయంగా చూస్తున్నారు, కానివాళ్ళు కుళ్ళబొడవ