Month: December 2017

తెలుగు వైతాళికులు

Uncategorized
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రవీంద్రభారతి భవనంలో అలంకరించిన తెలుగు మహనీయుల చిత్రాలు (నోటు: వీళ్ళే కాక తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన, సువాసనలు అబ్బిన మరెందరో ఉన్నారన్న విషయం మనకు విదితమే)

ఈ మాసం సిలికానాంధ్ర

Uncategorized
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న సిలికానాంధ్ర బృందం (పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారితో) ముఖ్యమంత్రి విదేశీ ప్రతినిధులకు ఏర్పాటుచేసిన విందులో సిలికానాంధ్ర బృందం ముఖ్యమంత్రి ప్రగతిభవన్ లో మాట్లాడుతున్న మృత్యుంజయుడు

సంయుక్తాంధ్ర సాహిత్య క్షేత్రం

కవితా స్రవంతి
రచన: విద్వాన్ శ్రీమతి జి సందిత, అనంతపురము (సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ గురజాడ జాతీయవిశిష్ట సాహితీ సేవా పురస్కార గ్రహీత) తెలుగురాష్ట్రాన్నెవరో ముక్కలు చేశారంటారేంటి? కళ్ళుంటే చూడండి.... రాష్ట్రాన్నేలే ఏలిక తెలంగాణా చంద్రన్న గురువుపాదంపై నుదురానించి మ్రొక్కి... రాష్ట్రాల్నేకాదు ఉత్కృష్టాంధ్రభాషాప్రపంచాన్నే ఏకంచేస్తున్నాడిక్కడ! నన్నయాదికవుల్ని ఈ ఏడాదికి బ్రతికున్న కవులతో కలిపి పరభాషా వ్యామోహపు పులికి బలియైపోతున్న తెలుగులిపిని కోట్లాదిగుండెల్లో నిలిపి పలికించి .. తెలుగుతల్లి పలుకుల్ని విలువల్ని బ్రతికిస్తున్నాడిక్కడ! ప్రజాసమస్యల్ని పరిష్కరిస్తూనే ఆకాశవాణి హైద్రాబాద్సాక్షిగా తెలుగుసమస్యాపరిష్కారాల్ని సంధిస్తున్నాడిక్కడ ! స్వార్థంకోసం ఆస్తులకోసం అన్నదమ్ములే శత్రువులై దాయాదుల్ని చంపుకునే .... కురుక్షేత్రాన్నికాదు తెలుగుకోసం ..భాష అస్థిత్వం కోసం సోదరులందరెేకమై ఆత్మీయతల్ని

ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం

సారస్వతం
అలాగే గురజాడ అప్పారావుగారూ సంఘసంస్కరణ పతాకగా వెలిగారు. “ధూమకేతువు కేతువనియో మోము చందురు డలిగి చూడడు? కేతువాయది? వేల్పు లలనల కేలి వెలితొగ కాంచుమా!’’ అని చెప్పి ప్రజలలో ఆలోచనని రేకెత్తింప చేశారు. మగడు వేల్పన్న పాతమాటను, స్త్రీపురుష సంబంధాన్ని గురించి, బూజుపడ్డ పాతభావాలనీ కడిగివేశాడు. ఈ విధమైన రచనల్లో అనుభూతి జ్ఞాన చైతన్య ప్రవృత్తిని ఆశ్రయించి (Intellectual Domain) ప్రకాశించిందని చెప్పుకోవచ్చు. ఆంగ్ల విద్యా ప్రభావంవల్ల తెలుగు భాషలో నవలలు, నాటకాలు, కధలు, విమర్శలు, జీవితచరిత్రలు మొదలైన ఎన్నో ప్రక్రియలు తెలుగుబాషలో తమ తమ స్థానాలను ఆక్రమించుకుంటూ వచ్చాయి. నవలలు పౌరాణికాలుగా, చారిత్రకాలుగా, సామాజికాలుగా - మరెన్నో విధాలుగా విభాగాన్ని కలిగి ఉన్నా ప్రధానంగా నవల కాల్పనిక చైతన్యానికి (Emotional Domain) కి సంబంధించిది. ఇంగ్లీషులో Fiction విభాగానికి చెందిన నవల కల్పనలకి చెందినదై, ఊహల అల్లికకు చెంద