Month: August 2018

కొంగ్రొత్త ఆశలు

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు క్రొత్త సంవత్సరం, క్రొత్త ఆశలు... ఆగష్టు 4... సిలికానాంధ్ర 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలోనికి అడుగిడుతున్నది. ముందున్న ఎన్నో ఆశలు, ఆశయాలు, పథకాలు, ప్రణాళికలు... అటు భారతదేశంలో, ఇటు అమెరికాలో, అలాగే ఇతర దేశాల్లో కూడాను. ఈ వివరాలన్నీ తెలియాలంటే www.siliconandhra.org దర్శించండి. అలాగే, విళంబి ఉగాది ఉత్సవ సందర్భంగా జరిగిన 'ఎనుకుదురాట - అచ్చ తెలుగు అవధానం' పుస్తకరూపంలో ప్రచురణ అయ్యింది. ఆ పుస్తకం సాఫ్ట్ కాపీ వచ్చే నెల సుజనరంజనిలో లభ్యమవుతుంది. అలాగే, జులై 27న జరిగిన పుస్తకావిష్కరణ ఫోటోలను 'ఈ మాసం సిలికానాంధ్ర ' శీర్షికలో చూడండి. శుభాభినందనలు!

క్రోధం

సారస్వతం
-శారదాప్రసాద్ అరిషడ్వర్గాల్లో ఒకటైన క్రోధం అంటే కోపాన్ని , ఉద్రేకాన్ని, ఆవేశాన్నికల్గి ఉండటం .ఆగ్రహావేశం వచ్చినటువంటి వాడు గురువుని చంపేయడానికి కూడా వెనుకాడడు. క్షణికావేశంలో చేయకూడని పనులు చేసి జీవితాంతం కారాగారంలో ఉండిపోయిన మేధావులున్నారు. ఈ మధ్యనే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిలస్ (యూసీఎల్‌ఏ)లో భారతీయ విద్యార్థి మైనాక్ సర్కార్ (38) కాల్పులకు పాల్పడి ఓ ప్రొఫెసర్‌ను హత్యచేశాడు.ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకోసం అతడు ఏకంగా దాదాపు 3222 కిలోమీటర్ల దూరం కారులో ప్రయాణించి వచ్చాడు. అంటే అతని క్రోధం పగగా మారిందన్నమాట!ఐఐటీ ఖరగ్‌పూర్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్) విద్యార్థి అయిన మైనాక్ సర్కార్.. యూసీఎల్‌ఏ ప్రొఫెసర్ విలియమ్ వద్ద డాక్టరేట్ విద్యార్థిగా ఉండేవారు. 2013లో అతని డాక్టరేట్ పూర్తయింది.చూసారా ఒక మేధావి తన విచక్షణను ఎలా కోల్పోయాడో! మనుషుల్లో కోపానికి

శ్రీ రామ సంగ్రహం

ధారావాహికలు
లంకానగరం -అక్కిరాజు రామాపతి రావు అప్పుడు విశ్రవసుడు "నాయనా! దక్షిణ సముద్రతీరంలో 'త్రికూటం' అనే పర్వతముంది. దాని శిఖరంపై విశ్వకర్మ రాక్షసుల కోసం చాలా గొప్ప నగరం నిర్మించాడు. దాని సంపద, సొగసు వర్ణించలేము. ఒకప్పడు రాక్షసులా నగరంలో నివసించే వాళ్ళు. అయితే దేవాసుర యుద్ధం జరిగినప్పుడు మహావిష్ణువుకు భయపడి ఆ రాక్షసులంతా ఆ మహ పట్టణం విడిచిపెట్టి పాతాళలోకంలోకి వెళ్ళి దాక్కున్నారు. అదిప్పుడు నిర్జనంగా ఉంది. కాబట్టి నీవక్కడ నివసించు" అని తండ్రి చెప్పటంతో వైశ్రవణుడు అక్కడకు వెళ్ళి రాక్షసులను కూడా తనతో ఉండవలసిందిగా చెప్పి ఆ నగరాన్ని ఇంద్రుడి రాజధాని అయిన అమరావతిలాగా కళకళలాడేట్లు చేసి అక్కడ నివసించాడు. అక్కడ ధనపతి వైశ్రవణుడు మహా వైభవంతో లంకలో ఉంటూ వచ్చాడు' అని అగస్త్యుడు చెపుతుండగా శ్రీరాముడికి మరింత ఉత్సుకత కలిగింది. రావణుడికంటే పూర్వమే లంకలో రాక్షసులు ఉండేవారని తెలిసి "ఆ రాక్షసులు రావణ, కుంభకర్ణులకన్న

నిస్వార్ధ ప్రార్ధనా ఫలం

కథా భారతి
-ఆదూరి హైమావతి నడకుదురు అనే గ్రామంలో నరసింహం అనే ఒక యువకుడు ఉండే వాడు. తల్లీ తండ్రీ ఎంత చెప్పినా చదువుకోక, ఏపనీ నేర్చుకోక తిని తిరుగుతూ సోంబేరిలా తయారయ్యాడు. తల్లీతండ్రీ మొత్తు కుని వాడికోసమే దిగులు పడి గతించారు.వాడికి ఆకలికి అన్నంపెట్టేవాళ్ళు లేక కడుపుమంటకు ఆగలేక చిన్న చితకా దొంగతనాలు చేయసాగా డు. తోటల్లోపడి దొరికిన కాయా పండూతింటూ ఆకలి తీర్చుకో సాగాడు. ఎవరైనా ఇదేమని అడిగితే వారిమీద తిరగబడి కొడుతూ ,అడ్డదిడ్డంగా తిరుగుతూ కడుపు నింపు కుంటూ చివరకు ఒక దుర్మార్గుడుగా తయారయ్యాడు. వాడితో మాట్లాడనే అంతా భయపడేవారు. ఎవరైనా డబ్బిచ్చి ఏం చేయమన్నాచేస్తూ ,చివరకు హంతకుడై ఎవ్వరికీ దొరక్కుండా తిరగ సాగాడు. నడకుదురు గ్రామం చిట్టడవికి దగ్గరగా ఉండేది .ఆగ్రామం నుంచే అటూ ఇటూ నగరాలకు వెళ్ళాలి. చిట్టడవి దాటను కాలిబాటా, బండ్ల బాట తప్ప మరో మార్గంలేదు.అందువల్ల అంతా చిట్టడవిదాటను భయ పడేవారు.కొందరు స్వార్ధపరులు ప్రత్య

భయం భయం రోగ భయం !

ధారావాహికలు
( హైపోకాండ్రియాసిస్ ) అమరనాథ్.జగర్లపూడి ( రోగ భ్రమ లేదా రోగ భయ స్థితి ఫై ఒక వ్యాసం) మానసిక ఆరోగ్యమే శరీర ఆరోగ్యానికి రక్షణ కవచం ."రోగం మనిషిని చంపదు దాని తాలూకా భయమే మనిషికి హాని చేస్తుంది" దీనికై మన పట్ల, మన శరీరం పట్ల మనకు అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా వుంది ! శరీరానికి వ్యాధి అనేది చాలా సహజమైన లక్షణం ఈ విషయంలో మానవ శరీరం అత్యంత జాగురూకతతో వ్యవహరిస్తుంది. దాదాపు చిన్న చిన్న రోగాలను సైతం తనకు తానుగా రక్షించుకునే శక్తి శరీరానికి వుంది. కానీ ఆ అవకాశం శరీరానికి ఇవ్వకుండా మన ఆత్రుత, అనవసర ఆందోనళనతో మరి కొన్ని అనవసర సమస్యలు తెచ్చి పెట్టుకుంటాము. ఇందులో ముఖ్యంగా హైపోకాండ్రియాసిస్ దీనినే రోగ భ్రమ స్థితి లేదా రోగ భయ స్థితి అంటాము. ఇది ఒక మానసిక సమస్య ఇందులో చిన్న చిన్న రోగ లక్షణాలు కన్పించినా దానిని భూతద్ధంలో చూస్తూ తనకేదో అయిపోతుందనే భ్రమతో ఆందోళనకు గురి అవుతుంటారు కొందరు, మరికొందరు ఏవ

ఎందుకు?

కవితా స్రవంతి
- పారనంది శాంతకుమారి కడలి నుండి కెరటాలు హృదయం నుండి ఆరాటాలు ప్రేమ కోసం పోరాటాలు దూరమైపోవటం లేదే! మరి పెద్దలనుండి నేటి పిల్లలు ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారు? చెట్టు నుండి పచ్చదనం సూర్యుని నుండి వెచ్చదనం చంద్రుని నుండి చల్లదనం ఇవేవీ విడిపోవాలని కోరుకోవటం లేదే! మరి నేటితరం కొడుకులు తమ తల్లితండ్రులనుండి ఎందుకు విడిపోవాలని కోరుకుంటున్నారు? పగలు నుండి రాత్రి జననం నుండి మరణం శాంతి నుండి అశాంతి ఇవేవీ ఒకదానికి విడిచి వేరొకటి ఉండాలని అనుకోవటం లేదే! మరి ఈ అన్నదమ్ములు ఎందుకు విడివిడిగా ఉండాలని అనుకుంటున్నారు? మూడు కాలాలు పంచభూతాలు ఎనిమిది దిక్కులు విశ్వకుటుంబంనుండి వేరైపోదామని అనుకోవటంలేదే! మన కుటుంబాలే ఎందుకు ముక్కలైపోతున్నాయి?

వరం-శాపం

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు ఈమె బిడ్డకు అన్నం తానే స్వయంగా తినిపిస్తోంది. ఆమె బిడ్డకు ఆహారాన్నిపనిమనిషి తినిపిస్తోంది. ఈమె దీనిని వరంగా గ్రహించి ఇష్టపడుతోంది, ఆమె దానిని శాపంగా తెలుసుకోలేక నష్టపోతోంది. ఈమెకు సంసారమంటే ప్రాణం, ఆమెకు సంపాదనపైనే ధ్యానం. ఈమె ప్రతివిషయంలోనూ వినయంతో ప్రవర్తిస్తుంది. ఆమె ప్రతి విషయంలోను గర్వాన్నిప్రదర్శిస్తుంది. ఈమె పరిస్థితులకు యజమాని, ఆమె స్థితిగతులకు బానిస. ఈమె బిడ్డపై ప్రేమకు లొంగిపోయింది, ఆమె డబ్బుపై భ్రమలోకుంగిపోయింది. ఈమెకు లోకమంతా ప్రేమమయం, ఆమెకు లోకమంతా కాసుమయం. ఈమెను మనసారా ప్రశంసించేవారు ఎక్కువ, ఆమెను ముఖంఎదుట పొగిడేవారు ఎక్కువ. ఈమె బిడ్డ అదృష్టవంతుడై పెరుగుతున్నాడు, ఆమె బిడ్డ ధనవంతుడై ఎదుగుతున్నాడు. ఈమె బిడ్డకు ముద్దు,మురిపాలకు లోటు లేదు, ఆమె బిడ్డకు కలలోకూడా వీటికి చోటులేదు. వీడు కన్నతల్లి ప్రేమ ప్రవాహంలో ఈదులాడుతున్నాడు,