Author: Sujanaranjani

కవిత

కవితా స్రవంతి
విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు -మాతా గంగా భవానీ శాంకరీదేవి శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సిద్ధ గురుదేవ సిద్ధేశ్వరానంద స్వామి చరణములకు వందనాలు వినయముగను జేసి విజయమిచ్చేవారి దీవెనొంది మదియ దిగులుతీరె నవ్య వత్సరాన నగుమోము నిండుగ నవ్వుకొనుచు వనితా నడుయు నటుల విళయ టాండనాలు వినువీధి లెక్కక విజయ ఉత్సవాలు వెల్లివిరగా కోర్తు పక్షి కొరకు వగచె మౌని యా వాల్మీకి బ్రహ్మ యిచ్చె దివ్యమౌగు వరము శోకమంత నోట శ్లోకములుగా జారె రామకథగ మారి రమ్యమాయె రామనామ మనగ రమియించు నెల్లడ పతిత పావనంబు పాపహారి కలుష మదిని మర్చె కారుణ్య నామము రామపదమె జగతి రాజపధము పరుశువేది నంటి పసిడియౌ చందంబు నామ జపమె దోష నాశకారి పరమ పదమునిచ్చు తారకమంత్రము రామ పదమె జగతి రాజపధము ధర్మ శీలవంతు ధారులే నందరు అల్ప భోగపరులు ఆత్మబంధు దానశీలా జనులు ధన్య మొందినవారు రామపడమె జగతి రాజపధము రామయనుచు నామ రాగ గీత మనగ శిశువు

కవిత

కవితా స్రవంతి
మాతా గంగా భవానీ శాంకరీదేవి ధర్మ శీలవంతు ధారులే నందరు అల్ప భోగపరులు ఆత్మబంధు దానశీలా జనులు ధన్య మొందినవారు రామపడమె జగతి రాజపధము రామయనుచు నామ రాగ గీత మనగ శిశువు నవ్వు కఠిన శిలలు కరుగు మహిమ లెన్నో దాగె మహిమాన్వితంబగు రామపదమె జగతి రాజపధము రామచరణ స్పర్శ రాతి నాతిగా మార్చె మాట శబరికిచ్చె ముక్తిపధము దనుజుల దునిమాడి ధరణిని రక్షించె రామపదమె జగతి రాజపధము ఘోర పాప దోష కర్మలే మున్నను రామనామ మనిన రాలిపోగ భస్మమగును మనుజ భవబంధవిముక్తి రామపడమె జగతి రాజపధము ***

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
అప్పుడు దేవతలు 'నాయనా శ్రీరామా! నిన్ను చూడాలని స్వర్గలోకం నుంచి నీ తండ్రి దశరథ మహారాజు విమానంలో వచ్చాడు' అన్నారు. ‘మీ అన్నదమ్ములాయనకు నమస్కరించండి' అని పరమశివుడు వాళ్ళకు చెప్పాడు. విమానంలో ఉన్నతాసనం మీద దివ్యకాంతులతో ఉన్న దశరథ మహారాజుకు అన్నదమ్ములు నమస్కరించారు. దశరథ మహారాజు వాళ్ళను కౌగిలించుకున్నాడు. జరిగిన సంగతులన్నీ శ్రీరాముడికి మళ్ళీ గుర్తు చేశాడు దశరథ మహారాజు. తరువాత మళ్ళీ ఆయన స్వస్థానానికి వెళ్లి పోయినాడు. దేవేంద్రుడప్పుడు శ్రీసేతారామలక్ష్మణులను ప్రశంసించి ఏదైనా వరం కోరుకోవలసింది అని శ్రీరాముణ్ణి కోరాడు. అప్పుడు శ్రీరాముడు యుద్ధంలో మరణించిన వానరులు, గోలాంగూల (కొండముచ్చుల) యోధులు, అందరూ పునర్జీవితులయ్యేట్లూ ఎటువంటి శరీరాయాసం పొందకుండా ఉండేట్లు, పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండేట్లు వరం ఇవ్వవలసిందిగా దేవేంద్రుణ్ణి అర్థించాడు. అందుకు దేవేంద్రుడు తథాస్తని సంతోషంగా చెప్పి అయోధ్య వెళ్ళి సకల సౌఖ్యా

సప్త స్వర అవధానము

సారస్వతం
-స్వర వీణాపాణి (ఇచ్చిన సాహిత్యానికి కోరిన వివాదిరాగంలోవెంటనే స్వర కల్పన) 1. సప్త స్వర అవధానము .. 7 గురి తో /14 మంది తో పైన పేర్కొనబడిన ప్రక్రియకు క్రింద వివరించిన నియమ నిబంధనలు. ప్రతి ఒక్కరు కేవలం 4 పంక్తుల గేయ/వచన/బాల సాహిత్యాన్ని ఏ భావానికి సంబంధించినదయినా స్వయముగా రచించుకొని ఈ ప్రక్రియకు హాజరు కావలెను . లేదా వేరెవరి సాహిత్యాన్నయినా తెచ్చుకొని, సాహిత్యాన్ని చదవ బోయేముందు వారి పేరును చెప్పవలెను. తీసుకు రాకూడని అంశములు : పద్యం సినిమా పాటలు ఇంతకు ముందు ధ్వని ముద్రణ/రికార్డు కాబడిన/స్వర పరచ బడిన ఏ అంశమైనా సంగీతబోధనాంశములు, కృతులు, కీర్తనలు మొదలగునవి అసభ్యకరమైన, అశ్లీలకరమైన, అమర్యాదకరమైన అంశములు వివరణ: ఇది 72 మేళకర్త రాగములలో చాలా తక్కువగా వాడబడుతున్న 40 వివాది రాగాలనూ ప్రపంచానికి తెలియ పరచడానికి, విద్యార్ధులకు అవగాహనకల్పించడానికి, సామాన్య ప్రేక్షకులకుకూడా విషయ అవగాహన కల్పించి, మన

నేను శివుణ్ణి!

సారస్వతం
​-శారదాప్రసాద్   మన జీవితాల్లోమనం ముఖ్యంగా మూడు కష్టాలను ఎదుర్కోవాలి, అధిగమించాలి! అవి--దైవికం, దేహికం మరియు భౌతికం. దైవికం అంటే-- దైవ ప్రేరేపితాలు. అంటే తుఫానులు, భూకంపాలు మొదలైన ప్రకృతి విపత్తులు. దేహికం అంటే-- శారీరకమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధులు. భౌతికం అంటే-- సామాజిక, మానవ సంబంధాలతో కూడిన సమస్యలు, గొడవలు, అపార్ధాలు, కక్షలు, కార్పణ్యాలు, రాగబంధాలు...మొదలైనవి. ఎవరైతే వీటిని అధిగమించి, ఇతరులు కూడా అధిగమించటానికి సహాయం చేస్తారో, అటువంటి వారిని మాత్రమే జ్ఞానులు, ముముక్షువులు, మోక్షాన్ని పొందినవారని అంటారు. అట్టివారే నిజమైన గురువులు మరియు మార్గదర్శకులు. అంతే కానీ, దేవతల సహస్రనామాలను,భజనలను చేయమని చెప్పి వాటిని చేయించేవారు కేవలం గురువు వేషంలో ఉన్న లఘువులు! చిత్తశుద్ధి లేకుండా (ఉన్నప్పటికీ) తెల్లవార్లు రామనామ జపం చేస్తే ఏమీ రాదు.రాకపోగా, నిద్రలేమితో అనారోగ్యం సంభవిస్తుంది.అంతర్యా

ట్రాఫిక్ టికెట్

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి తీరుబడిగా వేసవి శెలవులకి ఓహైయో నుంచి న్యూయార్క్ న్యూజెర్సీ అన్నీ చూడ్డానికి బుధవారం సకుటుంబంగా బయల్దేరిన శంకర్రావుకి శనివారం వచ్చేసరికి ఒక్కసారి నీరసం ఆవహించింది, మళ్ళీ సోమవారం నుంచీ పనిలోకి వెళ్ళాలంటే. ఓ సారి తల తాకట్టు పెట్టాక ఎలాగా కుదరదు కనక శుక్రవారం రాత్రే హోటల్ ఖాళీ చేసి రాత్రి కొలంబస్ వెళ్ళిపోతే మరో రెండు రాత్రులు తీరిగ్గా పడుకుని సోమవారం పన్లోకి పోవచ్చు. ఇదీ సరిగ్గా వేసుకున్నప్లాను. అయితే క్వీన్ విక్టోరియా, యువరాజా, రాణీల వారికి తండ్రి కున్నంత కంగారు లేదు అప్పుడే ఇంటికెళ్ళిపోవడానికి. వెకేషన్ లో వాళ్ళకి కావాల్సిన ఆనందం వాళ్ళు పిండుకున్నాక కారెక్కి బజ్జుంటారు. శంకర్రావుకు డ్రైవింగ్ ఎలాగా తప్పదు. అర్ధరాత్రీ, అపరాత్రీ ఏక్సిడెంట్ లేకుండా వెళ్ళాలంటే జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి నిద్రపోకుండా. పోనీ తనకి నిద్ర రాకుండా కబుర్లు చెప్తారా అంటే వాళ్ళందరూ బాగా అలిసిపోయి నిద్రలో

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
శృంగార దూతికలు -టేకుమళ్ళ వెంకటప్పయ్య దూతికలు అనగా రాయబారులు. నాయకుని తరఫున నాయికతో, నాయిక తరఫున నాయకునితో శృంగార దూతకార్యం నెరపడానికి నియోగించే వారు. అన్నమయ్య వీరిని రాయబారపు పడతి, చెలికత్తె అంటాడు. అలంకార శాస్త్రాలలో దాసి, సకియ, దాది, నటి, పొరుగమ్మ, యోగిని, చాకలి, చిత్రకర్మ చేయు స్త్రీలు దూతికలుగా వ్యవహరిస్తారని ఉన్నది. ఇంకా తాంబూలమమ్మే స్త్రీలు, వంటకత్తెలు, గానము మరియూ నాట్యము నేర్పే స్త్రీలు దూతికలుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కి పారిజాత పుష్పం ఇచ్చిన సందర్భంలో అలాంటి దూతికయే సత్యభామకు విషయం చేరవేసింది. ఆ దూతిక చెప్పిన మాటలవలన కోపించిన సత్యభామను శ్రీకృష్ణుడు ఎంతో బ్రతిమాలవలసి వచ్చింది. చివరకు స్వర్గలోకంపై యుద్ధం ప్రకటించవలసి వచ్చింది. శ్రీ వేంకటేశ్వరస్వామి పద్మావతీ అమ్మవారితో సంధాన సందర్భంలో స్వామి ఎరుక వేషాన్ని ధరించడం తెలిసిందే గదా! ఆమెకూడా ఒక దూతికయే.