బాలానందం

బాలగేయాలు – కోకిలమ్మా! ఓ కోకిలమ్మా

బాలానందం
- డా||వాసా ప్రభావతి కోకిలమ్మా! ఓ కోకిలమ్మా గున్నమామిడి కొమ్మపై ఒయ్యారంగా కూర్చుని కోటిరాగాలతో పాడుతావు నీ పాట మాకు నేర్పుతావా? నీవు పాడినంత తీయగా మేము పాడగలమా? నీ పాటను అనుకరిస్తే గొంతు చించుకు పాడుతావు? మా మీద కోపమేలా? నీలా మామిడిచిగురులు తిందామనుకుంటే చిగురులన్నీ చిటారుకొమ్మకున్నాయి కొమ్మను అందుకుందామంటే ఆకాశం ఎత్తున ఎదిగిపోయింది చిన్న పిల్లలమని చిన్నచూపు చూడక చిగురులు కోసి మాకిచ్చావంటే నీతో సమానంగా పాడేస్తాం! సంవత్సరానికి ఒకసారి వస్తావూ? వసంతుని వెంట వెడలి పోతావు? పెద్దవాళ్ళము మేమైతే గున్నమామిడి ఎక్కేస్తాము గుప్పిట్లో నిన్ను దాచేస్తాము