బాలానందం

ఆదికుటుంబం

-దాసు మధుసూదన రావు

మూడు కన్నులవాడు పరమేశ్వరుండు
నందివాహనుండతడు ఆదిదేవుండు;
పరమ పావని గౌరి ప్రసన్న వదని
పులి వాహనురాలామె శివుని పత్ని;
ఒకరి మేనులో సగము ఇంకొకరు అయినారు
పూజలందుకొనుచు వారు ఆది దంపతులైరి;
గజముఖ వినాయకుండు వారి తనయుండు
ఎలుక వాహనుండతడు గణనాయకుండు;
ఆరుమోముల కొమరుడతని తమ్ముండు
నెమలి వాహనుండతడు దేవసేనాని;
కొమరులిద్దరితోడి ఆది దంపతులు
ఆదికుటుంబమై మనల రక్షించెదరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked