బాలానందం

శాంతి చిరునామా?

బాలానందం
(బాలల కథ) -ఆదూరి.హైమవతి ధర్మపురం అనే ఊర్లో ధర్మన్న అనేఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు.పేరులోనే తప్ప 'ధర్మ 'మనేది అతగాడి జీవితం లో లేనేలేదు. ఎంగిలిచేత్తో కాకిని కూడా అదిలించని పరమ పిసినారి. బాగాలాభాలు వచ్చివ్యాపారం ఎదిగినా అతడి బుధ్ధి మాత్రం మారలేదు. తనవద్ద పనిచేసే గుమాస్తాలకు, ఇతర పని వారికీ జీతాలు పెంచడు సరికదా సకాలంలో నెల జీతం ఇవ్వడు. ఐతే అంతా ఉద్యోగ భద్రతవల్ల, మానకుండా అతగాడివద్దే పని చేస్తున్నారు. ఇంట్లో సైతం సరుకులు సమంగాతెచ్చేవాడుకాదు. భార్యా పిల్లలూ అన్ని అవసరాలకూ అతగాడ్ని దేబిరించి, విసిగిపోయేవారు. కాస్తఅనువైన బట్టలూ కొనడు. అతడి భార్య సీతమ్మ, పిల్లలను సముదాయించు కుంటూ ఓర్పుగా సంసా రాన్ని, నెట్టుకొస్తున్నది. సరైన చీరలైనా లేక సీతమ్మ ఏ ఇంటికీ పేరంటా నికైనా వెళ్ళేదికాదు. అంతా ఆమెను అదోలా చూసేవారు. ధర్మయ్య వ్యాపార వ్యవ హారాలతో, ఇంట్లో భార్యా పిల్లలు వారి అవసరాల కోసం సొమ్ము, వస్తువులు అడుగ

మనబడి బాలానందం

బాలానందం, మనబడి
విళంబి నామసంవత్సర ఉగాది సందర్భంగా, మీ అందరికీ శుభవార్త! "మనబడి బాలానందం", రేడియో కార్యక్రమాన్ని, ప్రతి శని-ఆదివారాలు తెలుగువన్ రేడియో (టొరీ) లో మనబడి విద్యార్ధులు అందిస్తున్న సంగతి మీకందరికీ తెలిసిందే. ఈ ఉగాది నుంచి మనబడి బాలానందం, ఒక సరికొత్త ఇంటర్నెట్ రేడియో చానెల్ Telugu NRI Radio లో కూడా మొదలౌతోంది ! http://telugunriradio.com/ లేదా "Telugu NRI Radio APP" ద్వారా, ప్రతి శని-ఆదివారాల్లో, మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు. (1 PM EST, Every Sat and Sunday). మీరూ, మీ పిల్లలూ కలిసి తప్పక వినండి! ఈ విషయాన్ని మీరు తెలుగు వారందరితోనూ పంచుకోండి !! ఈ ఉగాది నుంచి నెలకు 16 కార్యక్రమాలు!! పదహారణాల తెలుగు కార్యక్రమం నెలకు 16 సార్లు!! ఆనందం, బాలానందం కేరింతలు - ఇక నుంచి రెండింతలు! మరి దానికి తగినట్టు, పిల్లలచే రేడియో కార్యక్రమం నిర్వహించే మావయ్యలు, అత్తయ్యలు కూడా మరి రెండింతలు కావాలి కదా! మీకు

కపట పూజ

బాలానందం
-ఆదూరి. హైమావతి కనపర్తి అనే గ్రామంలో కామయ్య అనే గొప్ప ధనికుడు ఉండేవాడు. అంత ధనం ఉన్నా పిల్లి కైనా బిచ్చం పెట్టేవాడు కాదు. ఎంగిలిచేత్తో కకినైనా అదలించేవాడుకాదు. పరమ పిసినారి. ఇలా ఉండగా ఓ మారు ఆ గ్రామానికి ఒక ముని వచ్చి ఆ ఊరి శివాలయంలో,  హిమాలయాల నుండి తెచ్చిన శివ లింగాన్ని ప్రతిష్టించి నిత్యం పంచామృతాలతో అభిషేకం చేయసాగాడు. ఊరి జనమంతా తమ వంతుగా పాలు పెరుగు, నెయ్యి, వంటివి తీసుకెళ్లి అభిషేకంలో పాల్గొన సాగారు. అంతా తన ఇంటిముందు నుండే వెళ్లడం, తనకేసి హేళనగా చూడటం సహించలేక పోయాడు కామయ్య. - ఒక అల్లరివాడు ‘ఎంతమంది వచ్చినా కామయ్యగారు ఆలయానికి రారులేవోయ్! పాపం ఆ పాలు, పెరుగు అమ్ముకుంటే నాల్గు డబ్బులు వెనకేసుకోవచ్చు. శివలింగానికి అభిషేకం చేస్తే ఏం వస్తుంది చెప్పు" అని నవ్వుకోవడం చూసి రోషం వచ్చింది. అయినా సేరు పాలు చూస్తూ చూస్తూ ఆ రాతిమీద పోయడం ఎలా?’ అని కామయ్య మనసొప్పలేదు. రాత్రంతా ఆలోచించి ఉపాయం ప

ఆదికుటుంబం

బాలానందం
-దాసు మధుసూదన రావు మూడు కన్నులవాడు పరమేశ్వరుండు నందివాహనుండతడు ఆదిదేవుండు; పరమ పావని గౌరి ప్రసన్న వదని పులి వాహనురాలామె శివుని పత్ని; ఒకరి మేనులో సగము ఇంకొకరు అయినారు పూజలందుకొనుచు వారు ఆది దంపతులైరి; గజముఖ వినాయకుండు వారి తనయుండు ఎలుక వాహనుండతడు గణనాయకుండు; ఆరుమోముల కొమరుడతని తమ్ముండు నెమలి వాహనుండతడు దేవసేనాని; కొమరులిద్దరితోడి ఆది దంపతులు ఆదికుటుంబమై మనల రక్షించెదరు.

భక్త ధృవ

బాలానందం
-మొదటిరంగం- [సునీతి పూజచేస్తూ ,పాటపాడుతుంటుంది [మహరాజు ఉత్తానపాదుడు వస్తాడు ] దేవీ! సునీతీ! [సునీతి పూజనుండీ లేచి వచ్చి ] -ప్రభూ దయచేశారా! రండి! ఉత్తానపాద- ఏమి చేయుచుంటివి దేవీ! సునీతి- మరేముంది ప్రభూ!మన దేశప్రజలందరినీ హాయిగా ,ఏకష్టాలూ లేకుండా ఆశీర్వదించమని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.ప్రభూ! ఉత్తాన- నీకెప్పుడూ ఆప్రార్ధనేనా !నాగురించీ ఏమాత్రమూ శ్రధ్ధ లేదా! సునీతి-ప్రభూ! అదంతా మీ గురించే! మన ప్రజలంతా హాయిగా ఉంటే మీరూ హాయిగా ఉంటారుకదా! సమస్యలోకాః సుఖినో భవంతు ఉత్తాన - [లేచి] హూ! నీవదే చేసుకపో![ కోపంగా వెళ్ళిపోతాడు] సునీతి- ప్రభూ ! ప్రభూ! -2వ రంగం- సురుచి పూలమాల అల్లుతుంటుంది. ఉత్తానపాదుడు వస్తాడు. ఉత్తాన- సురుచీ! సురుచీ! సురుచి-ప్రభూ !దయచేయండి . ఆశీనులుకండి { అంటూ పూలమాల అతడి మెడలో వేస్తుంది] ఉత్తాన _ ఆహా! ఈ పుష్పాలు ఎంత మధురమైన సువాసనతో ఉన్నాయి? ఎక్కడిది దేవీ ఈమాల? సురుచి- ప్ర

సోమరిగుఱ్ఱం

బాలానందం
- అఖిలాశ చరణ్ గంట నుండి కార్టూన్స్ చూస్తున్నావు. హోం వర్క్ చేశావా? అని తల్లి అడగగానే..చరణ్ లేదుఅమ్మ మర్చిపోయాను. చేయి నొప్పిస్తూ ఉందిఅని తన సోమరితనాన్ని బయట పెడతాడు.తల్లి జ్యోతి త్వరగా హోం వర్క్ చేస్తే నీకు ఒక మంచి కథ చెప్తాను అంటుంది.హోం వర్క్ అయిపోగానే తల్లి కథ చెప్పడం మొదలు పెట్టింది. ఒక ఊరిలో సోము అని వ్యక్తిఉండేవాడు.ఆయన ఉప్పు వ్యాపారం చేసేవాడు. ఆయనకు ఒక గుర్రం ఉండేది.రోజూ ఉప్పు మూటలు కట్టి నది అటువైపుకు తీసుకెల్లి అమ్మడానికి గుర్రం వినియోగించేవాడు.ఒక రోజు ఉప్పు మూటలు గుర్రంకి కట్టి నది అటువైపు వేసిరా నేను మరో రెండు మూటలు కట్టి వెనకే వస్తాను అంటాడు.గుర్రం సరే అని రెండు ఉప్పు మూటలు తీసుకు వెళ్తూ కాలు జారి నదిలో పడుతుంది.మూటలలో ఉన్న ఉప్పు కరిగిపోతుంది.ఒడ్డుకు వచ్చిన గుర్రం బరువు తగ్గింది అని గమనించి రోజూ ఇలాగే చేస్తే నేను ఎక్కువ బరువు మోయ వలసిన అవసరం లేదు అని మనసులో అనుకుంటుంది.సోము ఉప

ధర్మో రక్షతి రక్షితః

బాలానందం
-ఆదూరి. హైమావతి అనగనగా పర్తిపల్లి అనే గ్రామంలో గోపయ్య నే ఒక రైతు ఉండేవాడు. అతడి భార్య రావమ్మ అతడికి తగిన ఇల్లాలు. అత్త మామల ను తన స్వంత తల్లి దండ్రుల్లా చూసుకుంటూ ఆదరించేది . వారు కూడా రావమ్మను కూతుర్లా ప్రేమించే వారు . గోపయ్య దంపతు లు పగలనకా రేయనకా కష్ట పడి తమ కున్న ఒకే ఒక ఎకరం పొలంలో కాయా కూరా , నీరు లభించినపుడు వరీ పండించు కుంటూ ఉన్నంతలో సుఖంగా సంతోషంగా జీవించే వారు. గంజిని కూడా పాయసంలా భావించి ఆనందంగా నలుగురూ త్రాగేవారు. . వారికి ఒక నియమం ఉండేది. తమ పొలంలో వచ్చిన ఫలసాయం ఏదైనా కానీ మూడు భాగాలు చేసి ఒక భాగం తినను తిండి కూడా లభించని నిరు పేదలకూ, గ్రామం లోని అవిటి వారికీ , వృధ్ధులకూ ఇచ్చేవారు. దాన్ని ఒక గంపలో ఉంచి ఇంటి ముందు కొచ్చిన వారికి గోపయ్య తల్లీ, తండ్రీ ఇచ్చేవారు. ఒక భాగం దేవాలయంలో భగవంతునికి నివేదనగా సమర్పించుకునే వారు. మిగిలిన భాగా న్ని తమకోసం ఉంచుకునే వారు. పొలంలో ఏది పండినా ఇదే