– అఖిలాశ
చరణ్ గంట నుండి కార్టూన్స్ చూస్తున్నావు. హోం వర్క్ చేశావా? అని తల్లి అడగగానే..చరణ్ లేదుఅమ్మ మర్చిపోయాను. చేయి నొప్పిస్తూ ఉందిఅని తన సోమరితనాన్ని బయట పెడతాడు.తల్లి జ్యోతి త్వరగా హోం వర్క్ చేస్తే నీకు ఒక మంచి కథ చెప్తాను అంటుంది.హోం వర్క్ అయిపోగానే తల్లి కథ చెప్పడం మొదలు పెట్టింది.
ఒక ఊరిలో సోము అని వ్యక్తిఉండేవాడు.ఆయన ఉప్పు వ్యాపారం చేసేవాడు. ఆయనకు ఒక గుర్రం ఉండేది.రోజూ ఉప్పు మూటలు కట్టి నది అటువైపుకు తీసుకెల్లి అమ్మడానికి గుర్రం వినియోగించేవాడు.ఒక రోజు ఉప్పు మూటలు గుర్రంకి కట్టి నది అటువైపు వేసిరా నేను మరో రెండు మూటలు కట్టి వెనకే వస్తాను అంటాడు.గుర్రం సరే అని రెండు ఉప్పు మూటలు తీసుకు వెళ్తూ కాలు జారి నదిలో పడుతుంది.మూటలలో ఉన్న ఉప్పు కరిగిపోతుంది.ఒడ్డుకు వచ్చిన గుర్రం బరువు తగ్గింది అని గమనించి రోజూ ఇలాగే చేస్తే నేను ఎక్కువ బరువు మోయ వలసిన అవసరం లేదు అని మనసులో అనుకుంటుంది.సోము ఉప్పు అమ్మితే తక్కువ డబ్బు వస్తుంది.తనే పొరపాటు పడ్డాను అని అనుకుంటాడు.
మళ్ళీ రెండవ రోజు కూడా ఉప్పు మూటలు గుర్రానికి కట్టి నువ్వు పద నేను వస్తాను అంటాడు.గుర్రం నదిలో మునికి ఉప్పు కరిగిపోయాక మళ్ళీఅటు వైపుకు వెళ్తుంది. సోము వచ్చి ఉప్పు మూతలు తూకము వేస్తె మళ్ళి బరువు తక్కువ వస్తుంది.ఆశ్చర్య పోయిన సోము ఎందుకు ఇలా జరుగుతోంది అని మరుసటి రోజు గుర్రాన్ని అనుసరిస్తాడు.
గుర్రం నదిలో మునిగి ఉప్పు కరిగాక వెళ్ళడం గమనించి ఇంతమోసం చేస్తుందా? దీనికి బుద్ధి చెప్పాలి అని మరుసటి రోజు ఉప్పుకు బదులుగా దూది మూటలలో కట్టి పంపుతాడు. గుర్రం రోజు లాగే నదిలో మునుగుతుంది కాని దూదిలో నీరు చేరడం వల్ల బరువు ఎక్కువ అవుతుంది.
బరువు ఎక్కువ అవ్వడంతో నది నుండి బయటకి రావడానికిఈదలేక ఆపసోపాలు పడుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ మూటలలో ఉన్నవి కరగలేదు. అనుకుంటూ అలసిపోయిన సోమరి గుర్రం నది అటువైపున పడిపోతుంది.
తన వెనుకే వచ్చిన సోము హ..హ..హ…! అని నవ్వి చూడు గుఱ్ఱమా నేను నా పనిని ప్రేమిస్తాను,ఏంతో కష్టపడి పని చేస్తాను. నీలాగా సోమరిని కాదు. నువ్వు కూడా సోమరిగా ఉండకూడదనే ఇలా నీకు బుద్ధి చెప్పాను అంటాడు.తర్వాత నుండి గుఱ్ఱము తన పనిని ప్రేమిస్తూ చేస్తుంది.
చూసావా చరణ్ సోమరితనం వల్ల ప్రయోజకులము కాలేము కావున నీ పనిని నీవు వాయిదా వేయకుండా చేస్తే విజయం నిన్నే వరిస్తుందిఅని అమ్మ చరణ్ కు హితబోధచేసింది.
***