-పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్
వీక్షణం 67 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిలిపిటాస్ లో కథా రచయిత శ్రీ అనిల్ రాయల్ గారింట్లో జరిగింది.
శ్రీ సి.బి.రావు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముందుగా కథల్లోని “రెడ్ హేరింగ్స్” అనే అంశమ్మీద సోదాహరణమైన ఉపన్యాసాన్నిస్తూ తన కథ “శిక్ష” ను మరొకసారి సభకు పరిచయం చేసారు అనిల్ రాయల్. “రెడ్ హేరింగ్స్” ని తెలుగులో “ఎండు చేపలు” అని అనొచ్చని అన్నారు. “శిక్ష” కథలోని “రెడ్ హేరింగ్స్” ని కనిపెట్టే కథా క్విజ్ అందర్నీ అలరించింది.
ఆ తరువాత శ్రీ చెన్న కేశవ రెడ్డి గారు సినారె కవిత్వాన్ని వినిపించేరు. ఆ సందర్భంగా శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు సినారె దుబాయి యాత్రలో తమ అనుభవాలు సభలోని వారితో పంచుకున్నారు.
ఎప్పటిలాగే శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యాన జరిగిన సాహితీ క్విజ్ అత్యంత ఆసక్తి దాయకంగా జరిగింది.
విరామం తర్వాత శ్రీ సి.బి.రావు హైదరాబాదులో తమ ఆధ్వర్యాన నెల నెలా నిర్వహింపబడుతున్న “వేదిక” కార్యక్రమం విశేషాలు పంచుకున్నారు.
చివరగా జరిగిన కవి సమ్మేళనంలో పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, చెన్న కేశవరెడ్డి, కె.గీత, శారద గార్లు కవిత్వాన్ని వినిపించారు.
ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ లెనిన్, శ్రీ వేమూరి, శ్రీమతి ఉమ, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి చైతన్య తదితరులు పాల్గొన్నారు.