-ఆదూరి హైమావతి
సత్యానందులవారు ” సునందూ!” అంటూ తన శిష్యుడ్ని పిలిచారు. “గురుదేవా!” అంటూ సునందు గురువు ఎదుట నిలిచాడు వినయంగా.
” సునందూ! నీవు ఒకపని చేయాల్సి ఉంది .. కావేరీ నదికి ఆవల ఉన్న నామిత్రుడు విజయానందులవారి ‘ఆనందాశ్రమానికి ‘ వెళ్ళి , మన తోటలో కాసిన ‘ చూత ‘ ఫలాలను , సమర్పించి రావాలి ,వాటిని ఒక వెదురు బుట్టలో నింపి తయారుగా ఉంచాను.” అని చెప్పారు. ” అలాగే గురుదేవా!” అంటూ తన సమ్మతిని తెలిపాడు సునందు.
” సునందూ ! నీవు ఒక్కడివే వెళ్ళిరాగలవా లేక నీకు తోడుగా మరొకర్ని పంపమన్నావా?” అని అడి గారు గురుదేవులు.
“గురుదేవా తమ ఆశీస్సులే నాకు తోడు ..తమ సమ్మతి ప్రకారం చేస్తాను.” అని వినయంగా గురువు పాదాలంటి నమస్కరించాడు సునందుడు.
” సరేమరి . నీవుఒక్కడివే బయల్దేరు , ఎప్పుడు బయల్దేరుతావు?”
” వెంటనే గురుదేవా! ఆ వెదురు బుట్ట ఇప్పించండి “అన్నాడు.
అది మధ్యాహ్న సమయం .మరికొద్ది క్షణాల్లో భోజనాలు మొదలవు తాయి.శిష్యులంతా భోజనశాలలో ఆకులువేసే పనిలో ఉన్నారు. సత్యానందులవారు ఒక శిష్యుడిని పిలిచి ‘ఆచూత ఫలాలుంచిన’వెదురు బుట్టను తెప్పించి,సునందుకుఇచ్చి”జాగ్రత్తసునందూ!రెండు దినాలుగా కురిసిన వర్షానికి నది నిండుగా పారుతున్నది.” అని భద్రంచెప్పి పంపారు.
మిగిలిన కొందరు శిష్యులు ‘ గురుదేవులు సునందు ను భోజనంచేసిన తర్వాత పంప వలసింది.పాపం బాగాఆకలిగా ఉండిఉంటాడు. తిరిగి వచ్చేసరికి రాత్రవు తుందేమో !’అనుకున్నారు.
సునందు ఆవెదురు బుట్టను తలపై ఉంచుకుని , నడుచు కుంటూ కావేరీనదిని సమీపించాడు. నది వర వడిగా పారు తున్నది. పడవ నడిపే ‘ పాపన్న ‘ ” అయ్యా! నీవు సత్యానందులవారి శిష్యుడివికదూ! నది నిండు గా ఉంది , పడవ వేయలేను. సాయంకాలానికి వరవడితగ్గితే వెళదాం.” అన్నాడు చెట్టుక్రింద కూర్చుని భోజనంచేస్తూ.
” మాగురుదేవుల ఆఙ్ఞ వెంటనే నేను పాటించాల్సి ఉంది. సాయం సమ యం వరకూవేచిఉండలేను.” అంటూ తన ఉత్తరీయంతో ఆబుట్టను తన వీపుకు కట్టుకుని , గురుదేవునికి మనసారా నమస్కరించు కుని , నదీ మ తల్లి అనుమతి కోరి , వెంటనే , పడవ పాపన్న వారించేలోగానే , నది లోకి దూకాడు సునందుడు. భుజమ్మీద కట్టుకున్న ‘చూతఫలాల ‘ బుట్ట బరువుగానేఉంది.సునందు మంచి ఈత గాడు. ఎప్పుడు గురుదేవులు ఈత పోటీలు పెట్టినా సునందే ప్రధముడుగా వచ్చే వాడు. ఐనా నది వరవడికి ఎదురీదటం కష్టంగానే ఉంది. గురుదేవులు ఉపదేశించిన ‘ గాయత్రి ‘ జపిస్తూ ఈద సాగాడు. ఎంతో కష్టం మీద నది దాటి పక్కనే ఉన్న చిన్న పల్లె లో ప్రవేశించాడు , అక్కడ చెట్లక్రింద ఉన్న పల్లె వారు కనిపించారు , వారంతా ఎంతో ఆకలితో ఉన్నట్లు గ్రహించాడు ఆనందు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆకలికి రోదిస్తూ ఉండటం సునందు మనస్సు కు బాధకలిగించింది.వారిని సమీపించి ” ఏమైంది ? అంతా విచారంగా ఉన్నారు ” అని అడిగాడు.
” ఏముంది బాబూ!అధిక వర్షానికి మాకొంప గోడుకొట్టుకుపోయాయి. దాచు కున్న గింజలూ మట్టి పాల య్యాయి. బిడ్డలతా ఆకలికి అలమటిస్తు న్నా రు. నది దాటివెళితేగానీ ఏమీదొరకవు. మాపల్లె వారు ఇద్దరు నిన్ననగా నది దాటివెళ్ళి ఇంతవరకూ రాలేదు.నదిలో కొట్టుకు పోయారో , తిరిగి రాలేక ఆగి పోయరోని విచారిస్తు న్నాం. ” అని చెప్పాడు ఓముదుసలి.
ఒక్క క్షణం సునందుకు ఏంచేయాలో తోచలేదు. ఆకలికి లుంగ లా చుట్టూకు పోయిన ముదుసలు లు ఏడ్వలేక మూలుగు తుంటే , పిల్లలు ఏడుస్తున్నారు.వారి గుడిసెల న్నీ పైకప్పు ఎగిరిపోయి మొండి గోడలు కనిపిస్తున్నాయి. వెంటనే సునందు గురువును మనస్సులో స్మరించుకుని , తన వీపు కున్న వెదురు గంప నుండీ ఒక్కో పండూతీసి అక్కడున్న పల్లెవాసులకందరికీ తలో పండూ పంచాడు. అవి చక్కగా పసుపు రంగులోఉన్న మధుర మామిడిఫలాలు , కమ్మనివాసనతో పెద్ద కొబ్బరి బోండా లంత ఉన్నాయి. వాటిని అందు కున్న పల్లెవాసులకళ్ళు మిలమిలా మెరిశాయి.పిల్లలు వెంటనే వాటి ని కొరికి తినసాగారు. అక్కడం తా ముందున్న విషాద వాతావరణం , మారిపోయి సంతోషం అలుము కుంది. అందరూ మనసారా సునందు కు కృతఙ్ఞతలు వారికి తెలిసినరీతిగా చెప్పు కున్నారు. వారి ముఖాల్లోని ఆనందం చూస్తుంటే సునందు హృదయం పరవసించింది.
సునందు వారివద్ద సెలవు తీసుకుని , ఆనందాశ్రమంవైపు నడక సాగించాడు.గురుదేవుల మిత్రు లైన , విజయా నందుల వారిని కలిసి నమస్కరించి , తమగురుదేవులు పంపిన ‘ వెదురుబుట్ట ‘ సమర్పిం చాడు. విజయానందులు ఆబుట్ట తెరువగా దానిలో ఒకే ఒక్క చూతఫలం ఉంది. విజయా నందులు చిరునవ్వుతో ఓక్షణం కళ్ళు మూసుకుని , ” సునందూ!మంచిది. మామిత్రులు సత్యానందు లకు కృతఙ్ఞతలు తెలియ జేయి. బయల్దేరు , చీకటైపోతుందేమో! ఈ కదళీ ఫలాలను వారికి సమ ర్పించు కుంటున్నా మనిచెప్పు. ” అని ఆవెదురు బుట్ట నిండా కదళీ ఫలాలు నింపి పంపారు విజయా నందులవారు.’ ఎవరు తమ ఆశ్రమానికి వచ్చినా భుజించందే పంపని తమ గురు దేవులు ఇలా ఇతన్ని పంపడం ఆశ్రమంలోని శిష్యులందరికీ ఆశ్చర్యం కలిగించింది. ” గురుదేవా! ఇతను సునందుడని తమ కెలాతెలిసిందండీ!” అని తమశిష్యు లు వెలి బుచ్చి న సందేహానికి , విజయానందులవారు , చిరునవ్వు తో ” మన చుట్టుపక్కల ఆశ్రమాలన్నింటి లో కీ సునందుడే గజ ఈతగాడు.వారిగురుదేవులు ఇంత వరద ఉధృతిలో అతణ్ణితప్ప మరె వ్వరిని పంపరు.అంతేకాక అతని విద్యాభ్యాసం పూర్తికా వచ్చింది, వాని గురుదేవులు అతడునేర్చిన విద్య ఆచరణలో ఎంత మాత్రం ఉంచు తున్నాడో అని పరిశీలించదలచి ఇలా పoపి ఉండవచ్చు. ” అన్నారు .
సునందు విజయానందులు ఇచ్చిన ఆ వెదురుబుట్టను తిరిగి భుజా నికి కట్టుకుని ,తిరుగు ప్రయా ణమయ్యాడు.అతడు ఆపల్లెవాసుల వద్దకు రాగానే వారంతా “ఈ అయ్య మళ్ళా మనకోసం ఏదో తెచ్చా డు రండి రండర్రా!” అని అందరినీ పిల్చు కున్నారు. సునందు తిరిగి వారందరికీ తన వీపు కున్న బుట్ట లోని , పెద్ద పెద్ద కదళీ ఫలాలను పంచి , నదిలోకి దిగి ఈదసాగాడు.వదర ఉధృతి కొంత తగ్గడంతో అతి సులువుగా ఈదు కుంటూ కావేరిదాటి , నడిచి చీకటిపడే వేళకు ఆశ్రమం చేరాడు.
ఆశ్రమ ద్వారం సమీపంలోనే ఉన్న చెట్టు క్రింద ఉన్న అరుగుమీద ఆచార్యులవారు ధ్యానముద్ర లో ఉన్నారు. సునందు వారిని సమీపించి , పాదాలంటి నమస్కరించాడు .గురుదేవులు , చిరునవ్వుతో కళ్ళుతెరిచి , ” జాగ్రత్తగా వచ్చావు కదా! నీకోసమే ఎదురు చూస్తున్నాను . నిన్ను పంపిన కార్యం సిధ్ధించు కువచ్చా వుగా! . పద ఇద్దరం భోంచేద్దాం. . ” అంటూ సునందు శిరస్సును ప్రేమగా స్పృసించి , లేచారు సత్యా నందుల వారు.
” గురుదేవా! మన్నించాలి. నేను పొరపాటు చేశాను. తమ ఆఙ్ఞను ధిక్కరించి …”అని సునందు అంటుండ గా..” నిన్ను అభోజనం గా పంపినందుకు అంతా బాధపడ్డారు ! మనం ఇద్దరమూ ఆకలిగా ఉన్నాం , పద సునందూ! అందరూ మనకోసం సాయం భోజనానికి ఎదురు చూస్తున్నారు. ” అంటూ సత్యా నందుల వారు , సునందును చేయిపుచ్చుకుని బయల్దేరదీశారు సునందు కు అర్ధమైంది , తమ గురువు గారు కూడా మధ్యాహ్న భోజనం చేయలేదని , గురుదేవుల గొ ప్ప దనానికి సునందు హృదయం పరవ సించింది.
భోజనం చేస్తే కడుపు నిండితే ఈదటం కష్టమవుతుంది.అందువల్లే అభోజనంగా గురువుగారు పంపారని మిగతాశిష్యులకు నిదానంగా తెలిసింది
నీతి:- విద్యను ఆచరలో ఉంచినపుడే సిధ్ధిస్తుంది.