నవంబర్ ఒకటి 2018 వతేదీన డా.మంగళగిరి ప్రమీలాదేవి గారు దివంగతులయ్యారు. ఆవిడ వయసు 75 సంవత్సరాలు. మచిలీపట్నంలో హిందూకాలేజ్ లో తెలుగులెక్చరర్ గా ఉద్యోగబాధ్యతలు నిర్వహించారు.చిన్నవయసులోనే సంగీతం లో డిగ్రీ పొందడమేకాక సాహిత్యంలో కూడా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.నలభైగ్రంధాలు రచించారు.తెలుగు, హిందీ, సంస్కృతం భాషలలో పాండిత్యంఉన్నవ్యక్తి. పదసాహిత్యంలో పరిశోధనలు చేసి పి.హెచ్.డి.పట్టా పొందారు.పదసాహిత్యపరిషత్ అనే సంస్థ స్థాపించి అనేక సాహిత్య సభలు మచిలీపట్నం లోనూ, హైదరాబాద్ లోనూ ఘనంగా నిర్వహించారు. ఆవిడ రాసిన పద్యగేయనాటికలకు 1971లో ఆంధ్రప్రదేశ్సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
ఈమధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు ఆవిడకు సరస్వతీ సమ్మాన్ పురస్కారం ఇచ్చి సత్కరించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఉగాది పురస్కారం ఇచ్చి గౌరవించింది. సుమారు నలభై సంవత్సరాలుగా ఆవిడ నాకు మంచి స్నేహితురాలు.సుజనిరంజనిలో కూడా మంచి వ్యాసాలు రాశారు.ప్రతిభ మాత్రమే కాదు మంచితనానికి మారుపేరులా ఉండే డా.మంగళగిరి ప్రమీలాదేవి గారు హఠాత్తుగా మనందరినీ వదిలి వెళ్ళి పోవడం తీరని లోటుగా భావిస్తున్నాను.తమిరిశ జానకి