1947, నవంబరులో పొట్లపల్లి రామరావుగారి “చుక్కలు” ఈ అనుభూతి కవితా పంథాలో వెలువడినదే. ఇందులోని ఏ చుక్క భావం ఆ చుక్కదే. ఇవి ఏ చుక్కకి ఆ చుక్కగా విడిపోయి ఉన్నాయి. ఇవన్నీ ఆలోచననీ, అనుభూతినీ
అందించేవే. ఈ చుక్కలలో పుస్తకాల గురించీ, శబ్దం గురించీ, మాతృప్రేమ గురించీ, భూమిగురించీ, – ఇలా ఒకటేమిటి మనిషికి అవసరమైన ప్రతి వస్తువూ ఇందులో కవితా వస్తువులయ్యాయి. ఇందులోని చుక్కలన్నీ వచన
కవితనాశ్రయించే ఉన్నాయి.
1977, జనవరిలో వెలువడిన “సీమోల్లంఘున” పణతుల రామచంద్రయ్యగారిది. ఇందులోని ఖండికలు ఇరవైయ్యొకటి (21). “సీమోల్లంఘని, “మరచిపోయిన పాట; కిటికీ, ‘దీర్ఘరాత్రి’ మొదలైనవి ఇందులోని కొన్ని కవితా ఖండికలు.
ఈ కవితా ఖండికలన్నీ వచన కవితలో సాగినవి కావటమే కాక అమభూతి ప్రధానంగా వెలువడినవి.
పి. హనుమయ్యగారి “విభావరి 1978, జనవరిలో వెలువడింది. ఇది “అనిబద్ధకావ్యఖండిక’. ఇందులో మొత్తం ఎనభై(80) ఖండికలున్నాయి. అనుభూతితో వెలువడిన కవితా సంపుటి ఇది
1979 జనవరిలో వచ్చిన “శిలలు వికసిస్తున్నాయి” ఈ మార్గంలోనే వచ్చిన మరో వచన కవితా సంకలనం. దీన్ని రచించిన కవి రామాచంద్రమౌళి. ఈ కవితా సంకలనంలో మొత్తం ఇరవైఏడు (27) కవితా ఖండికలు ఉన్నాయి.
“శిలలు వికసిస్తున్నాయి, “గాయాలు-పాఠాలు, “అగ్నిపుష్పం”, “’మరోజన్మకోసం’ “సృష్టి, ‘“ఉనికీ-ధ్వనీ, “కావ్యం” మొదలైనవి ఇందులోని కొన్ని కవితాఖండికలు.
వీరిదే 19084, డిసెంబర్లో వచ్చిన “స్మృతిధార”. ఇందులోని మొత్తం కవితల సంఖ్య ఏభైరెండు (52). “ఆకురాలేకాలం” “జ్ఞానరేభి, “స్మృతిధారి, “గాలిలో కాగితం ముక్క”, “అనంతయాత్రి, “జీవితాన్ని దక్కించుకో”, “హృదయాన్ని
జయించే మరో హృదయం; “మహారోహణం’ , “ఎడతెగని దీక్ష, ‘తరుముకొచ్చే జ్ఞాపకాలు మొదలైనవి ఇందులోని కొన్ని వచన కవితా ఖండికలు. స్మృతిధారలోవి కవితా ఖండికలు అనుభూతి ప్రధానంగా సాగిన రచనలు.
1979, మేలో వచ్చిన ‘కవిసేని’ వారి “కొమ్మలు చీల్చుకు వస్తున్న పూలు” కూడా ఈ మార్గంలోనే వెలువడిన మరో రచన. ఇందులో శేషేంద్ర, రావు వెంకటరావు, అవధాని, కలచవీడు మురళీధర్, వై శ్రీరాములు, ఎం.ఎ.
సత్యనారాయణ, మల్లెల, వనమాలి, రామాచంద్రమౌళి, సమద్, సాత్యకి, మోనా, మద్దూరి లక్ష్మీనరసింహం, ఆంకొండి వెంకటరత్నం, సాంధ్యశ్రీ, సువర్ణ, డా. తంగిరాల సుబ్బారావు గార్ల కవితలు ఉన్నాయి.
గోదావరి శర్మగారి “గోదావరి గలగలలు” 1980 లో వెలిసింది. ఇందులో ఎనభై(80) కవితా ఖండికలు ఉన్నాయి. – సంధ్య”, “భయంభయం, ‘స్నపిత సంగీతం”, ‘నిషాచరుణ్లీ, “స్పర్శ, “పదాలు? ‘క్షణభంగురం’
మొదలైనవి ఈ సంపుటిలోని కొన్ని ఖండికలు. వచన కవితలో వెలువడిన ఈ సంపుటి అనుభూతి ప్రధానంగా వెలువడింది.
ఇక్కడ నేను అనుభూతి వాద కవులని స్థాలీఫులాకన్యాయంగా మాత్రమే చర్చించటం జరిగింది. ఈ కాలంలో ఉన్న కవులందరూ తమ తమ ప్రవృత్తులద్వారా సమాజానికి సమగ్రమైన అనుభూతిని అందించటానికి
తోద్పడుతున్నారన్న విషయం మాత్రం నిజం. ఇది ఎవరూ కాదనలేని సత్యం.