Author: Sujanaranjani

మహాకాలదేవా

కవితా స్రవంతి
…నాగలక్ష్మి N.భోగరాజు. మహాకాలదేవా - అమేయ ప్రభావా అవంతీనివాసా - అహో భక్తపాలా నిత్య నూతనము నీదు దర్శనము నిన్ను చూచుటే నాకు భాగ్యము ఎన్నబోకయా నాదు నేరము నన్ను బ్రోవుమా నాగభూషణా ||మ|| మహాకాళియే కన్నతల్లిగా హరసిద్ధిమాతయే కల్పవల్లిగా కాలభైరవుడు కరుణ చూపగా వెలసినారయా మమ్ము బ్రోవగా ||మ|| మంగళకరమౌ నీదు రూపమూ తొలగించునుగా మహాపాపమూ భస్మహారతది అత్యద్భుతమూ తిలకించిన మా జన్మ ధన్యమూ || మ||

పద్యం – హృద్యం

-నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: సమస్య - రైలింజెను రోడ్డుమీద రయమున దిరిగెన్ ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న: 'శివరాత్రి' అనే నాలుగు అక్షరములు నాలుగు పాదములలో మొదటి అక్షరముగా వచ్చునటుల మీకు నచ్చిన ఛందస్సులో శివుని స్తుతిస్తూ పద్యము వ్రాయవలెను. ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి. చిరువోలు  సత్య ప్రసూన, న్యూ ఢిల్లీ తే// గీ//  శివుడొకడె మహాదేవుడౌ  క్షేమకరుడు వరమొసగు భక్త సులభుడ సురులకెపుడు ర

తపస్సమీరం..!

కవితా స్రవంతి
తపస్సమీరం..! -శైలజామిత్ర తారను అనుసరించి చదరంగ వ్యూహంలో గగన తలంపై చందమామ బరువుగా ఇరుక్కుంది ఒకవైపు ఆహ్వానం.. మరోవైపు వీడ్కోలు! ఒక ఇంటి నుండి మరో ఇంటికి చేరినట్లు.. ప్రయాణం ఏదయినా రాత్రే కళ్ళు విప్పుతుంది యానం ఎక్కడికైనా అందరితో మాట్లాడుతుంది చిరుగాలికి తల పంకిస్తూ పాదు గుండెలోంచి ముళ్ళమధ్య నుండి తీయని గులాబీ దర్శనమిస్తుంది.. ఆకలి పులి అవకాశానికై ఎదురుచూసినట్లు ఇంటి ముందు బిక్షగాని స్వరం సైతం చరిత్రను సృష్టిస్తుంది . బిడ్డను చంకనెత్తుకుని వచ్చే దారిలో అమ్మ కనే కలల దృశ్యం రాబోయే సూర్యోదయానికి ముచ్చెమటు పట్టిస్తుంది.. గాయం మానిపోయి దాని స్థానంలో మరో గాయం చేరినట్లు మనిషి కళ్ళకు ముఖాన్నీ వర్ణచిత్రాలై కనిపిస్తాయి మాసిన దుస్తుతో కూర్చున్న విరామ సమయం గెలుపు నుండి ఓటమి దాకా సంశయాల్ని నింపుతుంది.. చినిగిపోతుందని వస్త్రం, పగిలిపోతుందని కుండ నలిగిపోతుందని గుండెను వాడటం మానే

సాహితీ వార్తలు

సాహిత్య అకాడమీ గ్రహీతలకు అభినందనలు ఎన్నో ఏళ్ళ కృషి , దీక్ష , పట్టుదల తో సాగుతున్న కవి లేదా రచయిత ఎవరైనా ఒక్క సాహిత్య అకాడమీ అవార్డు రావడంతో ఒక్కసారిగా సేదదీరుతారు. అంటే సాహిత్యం లో తమకంటూ ఒక పేజీ ఉంటుందని ఎవరికైనా ఆనందం కలుగుతుంది. ప్రస్తుతం కవిగా సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న దిగంబర కవి నిఖిలేశ్వర్ గారు అసలు పేరు కుంభం యాదవరెడ్డి. తెలుగులో నిఖిలేశ్వర్ రచించిన అగ్నిశ్వాస కవిత్వానికి ఈ అవార్డు ఇచ్చారు. వీరు కవి గానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజాదృక్పథం గల రచనలను చేశారు. 1956 నుండి 1964 వరకు తన అసలు పేరు మీదే వివిధ రచనలు చేశారు. 1965 నుండి తన కలం పేరుని నిఖిలేశ్వర్‌ గా మార్చుకొని, దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచం లో విరజిల్లారు. దిగంబర కవులలో ఒకరిగా, 1965 నుండి 1970 వరకు మూడు సంపుటాల దిగంబర కవిత్వమును ప్రచురించారు. నిఖిలేశ్వర్ విప్లవ కవిత్వోద్యమంలో కూడా ప్రధానమైన కవ

సుజననీయం

సుజననీయం
ప్రొ. వేల్చేరు నారాయణరావు ప్రవాసాంధ్రుడైన నారాయణరావు గారు అమెరికా దేశంలో తెలుగు ఆచార్యుడిగా పనిచేశారు. ప్రఖ్యాత తెలుగు వాగ్గేయకారులైన అన్నమయ్య, క్షేత్రయ్య గార్ల సాహిత్యాన్ని మరియు శ్రీకాళహస్తీశ్వర శతకం, బసవ పురాణం, క్రీడాభిరామం వంటి ప్రసిద్ధ తెలుగు రచనల్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పురస్కారాన్ని 14వ గ్రహీతగా, తొలి భార్తీయునిగా అందుకొన్నారు. 1971నుండి ప్రముఖ తెలుగు సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని, ఇతరులతో కలిసి ఆంగ్లంలోకి అనువదిస్తూ తెలుగుభాషకు ఎనలేని సేవ చేస్తున్నారు. డేవిడ్ షుల్మన్ తో "క్లాసికల్ తెలుగు పోయెట్రీ: యాన్ ఆంథాలజీ" అను రచనకు సహ రచయితగా, సహ సంపాదకుడిగా మరియు "గాడ్ ఆన్ ద హిల్: టెంపుల్ పోయెమ్స్ ఫ్రం తిరుపతి" అను రచనకు సహ ఆంగ్లానువాదకుడిగా వ్యవహరించారు. "ట్వంటీయత్ సెంచురీ తెలుగు పోయెట్రీ: యాన్ ఆంథాలజీ" అను గ్రంథానికి సంపాదకత్వం, అనువాదం అందించారు. గురజాడ అప్పారా