Author: Sujanaranjani

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య కీర్తన: పల్లవి: చూడఁ బిన్నవాఁడు గాని జూటుఁదనాలు తనవి యేడఁ జూచినాఁ దానే యేమని చెప్పుదునే ॥పల్లవి॥ చ.1. దొంగాడుఁ గృష్ణుఁడు తొయ్యలుల మొగములు తొంగిచూచీ ముంగురులు దూలాడఁగా ముంగిట ముద్దులువెట్టి మోవితేనె లానుకొంటా యెంగిలిసేసి నిదె యిందరి నొక్కమాఁటె ॥చూడ॥ చ.2. వెన్నముద్దుకృష్ణుఁడు వేడుకతో జవరాండ్ల- చన్నులంటి సారె సారె సాముసేసీని చిన్నిచేతు లటుచాఁచి సిగ్గులురేఁచి చెనకి సన్నలు సేసి పిలిచి సరసములాడీని ` ॥చూడ॥ చ.3. వుద్దగిరికృష్ణుఁడు వొడిపట్టి మానినుల అద్దుకొని కాఁగిలించి ఆసలురేఁచీ వొద్దిక శ్రీవేంకటాద్రి నొనగూడి మాచేఁతలు సుద్దులుగాఁ జెప్పి చెప్పి సొలసి నవ్వీనే ॥చూడ॥ (రాగము: బౌళి, శృం.సం.కీర్తన; రేకు: 839-2; సం. 18-230) విశ్లేషణ: పల్లవి: చూడఁ బిన్నవాఁడు గాని జూటుఁదనాలు తనవి యేడఁ జూచినాఁ దానే యేమని చెప్పుదునే చూడడానికి చాలా చిన్న బాలుడిలా అమాయకంగా కనిపిస్తున్

ఎవరు?!

కవితా స్రవంతి
-సముద్రాల హరిక్రృష్ణ. దాశరధి!! తా శరధి! శరధి మద విదారి! ఆశల కాదని,సతిని విడచిన,వింత దారి!! ఎవడన్న వీడు, కఠిన శాసకుడొ ఎవడమ్మ వీడు లలిత నాయకుడొ?! (1) సుదతి వీడెనని వగచి సోలినాడే కుదురె కానని కపి సేన కూర్చినాడే ఎదురెలేని నీరధికి వారధి కట్టినాడే పదితలల రాకాసిని పడగొట్టినాడే. ఇంత చేసి,సీతనే చినపుచ్చినాడే పతిగ,నా విధిగ వెత దీర్చితన్నాడే! (2) కొందరెవ్వరో రవ్వ చేసిరని, రాజునని అది విని,ఇల్లాలినే కానల విడచినాడే పది.మంది మాటయే పాడియన్నాడే ఎదిచేసిన జనవాక్యమే తుది అన్నాడే! ఆనతిచ్చి సీత నడవి దింపించినాడే తానే శిక్షల వేసి బిట్టు కుమిలినాడే!! తనవారని చూడని వాడు రాజారాముడేమో మనసార వలచిన వాడు సీతారాముడేమో అన్ని ధర్మముల నిక్కపు ఆకృతి రాముడేమో అన్ని సరిత్తుల సంద్రపు విస్త్రుతి రాముడేమో! ******

మొగ్గలు

కవితా స్రవంతి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ సుఖదుఃఖాల ఆటుపోట్లను తట్టుకుంటున్నప్పుడల్లా కవిత్వం సాగరంలా తీరంవైపు పరుగెడుతుంటుంది బీడుగుండెలలో దాహార్తిని తడిపే ప్రవాహిని కవిత్వం సమాజగతిని నిత్యం పహరాకాస్తున్నప్పుడల్లా కవిత్వం జెండాలా రెపరెపలాడుతుంటుంది నిరంతర ఆర్తనాదాల అలల కచేరి కవిత్వం కవిత్వంతో కాసేపు ముచ్చట్లు పెడుతున్నప్పుడల్లా కర్తవ్యాన్ని బోధించమని సందేశమిస్తుంటుంది నటరాజుని పరవశ తాండవనృత్యం కవిత్వం పలుకుబడులతో అక్షరాలను పలకరిస్తున్నప్పుడల్లా మాండలిక మాధుర్యం పల్లెగానాన్ని వినిపిస్తుంటుంది పల్లెపదాలను అభిషేకించే అందమైన చిత్రం కవిత్వం సమాజ సంఘర్షణలను నిత్యం చిత్రిస్తున్నప్పుడల్లా ఆలోచనల ఘర్షణలు రగులుకుంటూనే ఉంటాయి అనేక వ్యధల రోదనల ఆవేదనా వీచిక కవిత్వం

వెకిలి బుద్ధులెందుకు ?

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజ రావు. వేదమంత్రాలతో ఒక్కటైన వారికి వెకిలి బుద్ధులెందుకు? పెద్దల ఆశీస్సులతో ప్రేమను పండించుకున్నవారికి పంతాలెందుకు? కాదనకుండా మీ కోరికలన్నిటిని తీరుస్తున్న ఇంటిపెద్దలపై అనవసరపు అలకలెందుకు? బంధుసముహంలో బంధమేర్పరుచుకున్నవారికి విడిగా ఉందామన్న ఆలోచనలెందుకు? ఉమ్మడి కుటుంబంలోని ఉన్నతత్వాన్ని ఉరితీద్దామన్న ఊసులెందుకు? కలివిడితనం లోని కమనీయతను కర్కశంగా కాలరాస్తారెందుకు? వైవాహిక జీవితంలో ఓర్పులేని,ఓర్వలేని మీకు విరివిగా ఈ వైరాలెందుకు?

సురాపానం

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి ఉపన్యాసం ముగించిన ఉరువేల కాశ్యపుడికి తన శిష్యులైన అయిదువందలమంది జటిలుల మొహాలలో ప్రతిబింబించే అసంతృప్తి కనబడుతూనే ఉంది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. తనకీ తన తమ్ముడికీ ఉన్న శక్తుల గురించి ఈ శిష్యులకి తెలిసినా, తెరలు తెరలుగా వచ్చే బుద్ధుడి గురించి వినే వార్తలతో వీళ్ళకి తన మీద గౌరవం తగ్గుతున్నట్టే తెలుస్తోంది. తాను కొలిచేది అగ్నిదేవుణ్ణనీ, దానివల్లే కాలనాగుని లొంగదీసుకుని అగ్నిగృహంలో ఉంచగలిగాడనీ తెలిసినా మునుపు ఉన్న గౌరవం ఇప్పుడు లేనట్టుందే? ఆలోచనల్లో ఉన్న కాశ్యపుడిని శిష్యుడు సాగత స్థవిరుడు అడుగుతున్నాడు, “తధాగతుడు ఇటువైపు వస్తున్నాడని వినిపించింది కదా ఎప్పుడండీ ఆయన వచ్చేది?” ఉరువేల కాశ్యపుడికి లోపలనుంచి మాత్సర్యం తన్నుకువచ్చింది. ఇన్నేళ్లనుండీ తన దగ్గిరున్న ఈ శిష్యులకి తానంటే నమ్మకం పోతోంది అప్పుడే. ఒక్కసారి బుద్ధుడి గురించి విన్నారు ఎక్కడో, అప్పట్నుండీ, తధాగతుడు రా

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
శ్రీరామావతార సమాప్తి శ్రీరాముడు తరువాత వానరప్రముఖులను, విభిషణుణ్జి తన దగ్గరకు రప్పించుకున్నాడు. వాళ్ళందరికి చెప్పవలసిన సంగతులు చెప్పాడు. ఆయనను సుగ్రీవాదులు అనుగమిస్తామన్నారు. శ్రీరాముడు విధివిధానంగా అయోధ్యా పౌరులు, వానర ప్రముఖులతో సరయూనది చేరి మహాప్రస్థానం పాటించాడు, వానర ప్రముఖులు శ్రీరాముడి యుద్దసహాయకులు అందరూ తమ తమ దేవతాలోకాలకు చేరుకున్నారు. అయ్యోధ్య పౌరులందరికీ కూడా 'సంతానకాలు' అనే దివ్యలోకాలు లభించాయి. ఫలశ్రుతి శ్రీరామాయణం ఆదికావ్యం, సాటివేని మహాకావ్యం. దీని కథానాయకుడు శ్రీరామచంద్రుడు. ఉత్తమగుణాలన్నీ సమగ్రంగా కలిగినవాడు. ధర్నానికి ఆయన ప్రతిరూపం, రాజుగానే కాక, ఒక ఉత్తమ మానవుడుగా లోక క్షేమమే ధ్యేయంగా భావించినవాడు. సత్యమే ఉత్తమధర్మంగా స్వీకరించి, తన తండ్రిని సత్యసంధుడిని చేయటానికి రాజ్యం విడిచి అడవులకు పోయినవాడు. రక్షించమని కోరినవాడు శత్రువైనా సరే కాపాడటం వ్రతంగా పెట్టుకున్నవాడ

ఆకాశమే హద్దు!

సుజననీయం
పుట్టగానే బంగారు తొట్టెలో నిద్రపోక పోవచ్చు. జీవితం వడ్డించిన విస్తరి కాకపోవచ్చు. 'ఆడ'తనం ఎన్నో అడ్డంకులను తెచ్చిపెట్టవచ్చు. జాతి, మత, వర్ణాలు అనేక ఆటంకాలను ఎదురుపెట్టవచ్చు. వీటన్నిటిని అధిగమిస్తూ, 'ఆసాధ్యం' కానిదేది లేదంటూ అగ్రరాజ్యంలో ఒక అధినేతగా వెలుగబోతున్న అచ్చమైన భారతీయత పేరున్న 'కమల దేవి ' హార్రీస్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. (గమనిక: సిలికానాంధ్ర ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. ఏ ఒక్క రాజకీయ సిద్ధాంతాన్ని బలపరచదు. సిలికానాంధ్ర ఒక సాంస్కృతిక సంస్థ.)

ఆనంద దీపావళి

కథా భారతి
-G.S.S.కళ్యాణి. "ధనత్రయోదశినాడు నీకు మాహాలక్ష్మిలాంటి ఆడపిల్ల పుట్టింది!", అంటూ మహేశ్వరి చేతిలో అప్పుడే పుట్టిన పాపాయిని పెట్టింది ఆమె తల్లి స్వరాజ్యం. పాపాయిని మహేశ్వరి ముద్దాడుతూ ఉంటే పక్కనే నిలబడి, "అమ్మా! చెల్లి ఎంత ముద్దుగా ఉందో!", అన్నాడు కిట్టూ. "ఇదిగోరా కిట్టూ! నువ్వు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న నీ చెల్లి!", అంటూ పాపాయిని కిట్టూ ఒళ్ళో పెట్టింది మహేశ్వరి. తన చిట్టి చెల్లిని ఎత్తుకుని మురిసిపోయాడు కిట్టు. "అమ్మా! చెల్లి పేరు చిట్టి!!", మహేశ్వరితో అన్నాడు కిట్టు ఉత్సాహంగా. "సరేరా! నీ చెల్లిని నీకు ఎలాకావాలంటే అలా పిలుచుకో!", అంటూ కిట్టూని ముద్దు పెట్టుకుంది మహేశ్వరి. అప్పటినుండీ చిట్టి కిట్టూకి ప్రాణమైపోయింది. కిట్టూ ఏ ఆట ఆడుతున్నా చిట్టిని ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు. చిట్టి ఎప్పుడైనా కిట్టు చేసిన పనిని చూసి నవ్వుతూ కేరింతలు కొడితే కిట్టూ తెగ సంతోషపడిపోయేవాడు. కొం

ఏది నిజం

కవితా స్రవంతి
 -- తాటిపర్తి బాలకృష్ణా రెడ్డి నీదే ఇజం నాదే ఇజం ఏది నిజం? ఈ ఇజాల మధ్య నలిగేదే నిజం మనుషుల్లో పోయిన మానవత్వం జనాల కొచ్చిన జడత్వం తంత్రాలతో కుతంత్రం వ్యాకోచిస్తున్న సంకుచితత్వం సుత్తి కొడవలి నెత్తిన టోపీ ఖాకి నిక్కరు చేతిన లాఠీ బొడ్లో కత్తి బుగ్గన గాటు మెడలో మాల చేతిన శంఖం చంకన గ్రంధం వక్తలు ప్రవక్తలు ఇజాలు వేరట నిజాలు వేరట వారిదో ఇజం వీరిదో ఇజం ఏది నిజం? ఈ ఇజాల మధ్య నలిగేదే నిజం మసిదు మాటున నక్కే ముష్కరులు గుడి నీడన చేరిన గాడ్సేలు చర్చి చావిట్లో చైల్డ్ యభ్యుసర్స్ అడవుల్లో అతివాదులు మన మధ్య మితవాదులు ఎవరివాదనలు వారివి నిజవాదం నేడో వివాదం నీదే ఇజం నాదే ఇజం ఏది నిజం? ఈ ఇజాల మధ్య నలిగేదే నిజం ఇజాల నీడలో నిజాలు దాగవు నిజాల వెలుగులో ఇజాలు ఇమడవు నిజాన్ని చూడలేని అంధులు సాటి మనిషిలో శత్రువుని చూడగా మానవత్వం ఎండమావే మనుషులంతా ఒక్కటనే మిద్య మన మ