అతడు – ఆవిడ
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
కలలు కనేది అతని కనులు,
ఆ కలలకు ఆవిడ జ్ఞాపకాలే ఆధారం.
ఇష్టపడేది అతని మనసు,
ఆ ఇష్టానికి ఆవిడ ఒకప్పటి సాహచర్యమే ఆధారం.
అతని నిదురలో ఆవిడ కల,
అతని మెలకువలో ఆవిడ ఇల.
అతని చేష్టలలో అవిడ నిష్ఠ,
అతను ద్రష్ట .... ఆవిడ స్రష్ట.
అతను దాసుడు ...ఆవిడ దేవత,
అతడు వ్యాసుడు ఆవిడ భారత.
అతను వెన్నెల...ఆవిడ చంద్రం,
అతను కిరణం....ఆవిడ రవి.
ఆవిడే అతని ఉహలకు మేలుకొలుపు,
ఆవిడే అతనికొక తీయని పిలుపు.
ఆవిడే అతని జీవితానికి ఒక మలుపు,
ఆవిడే అతనికి ఒక మాయని కొలుపు.