ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం
1947, నవంబరులో పొట్లపల్లి రామరావుగారి "చుక్కలు" ఈ అనుభూతి కవితా పంథాలో వెలువడినదే. ఇందులోని ఏ చుక్క భావం ఆ చుక్కదే. ఇవి ఏ చుక్కకి ఆ చుక్కగా విడిపోయి ఉన్నాయి. ఇవన్నీ ఆలోచననీ, అనుభూతినీ
అందించేవే. ఈ చుక్కలలో పుస్తకాల గురించీ, శబ్దం గురించీ, మాతృప్రేమ గురించీ, భూమిగురించీ, - ఇలా ఒకటేమిటి మనిషికి అవసరమైన ప్రతి వస్తువూ ఇందులో కవితా వస్తువులయ్యాయి. ఇందులోని చుక్కలన్నీ వచన
కవితనాశ్రయించే ఉన్నాయి.
1977, జనవరిలో వెలువడిన “సీమోల్లంఘున” పణతుల రామచంద్రయ్యగారిది. ఇందులోని ఖండికలు ఇరవైయ్యొకటి (21). “సీమోల్లంఘని, “మరచిపోయిన పాట; కిటికీ, 'దీర్ఘరాత్రి' మొదలైనవి ఇందులోని కొన్ని కవితా ఖండికలు.
ఈ కవితా ఖండికలన్నీ వచన కవితలో సాగినవి కావటమే కాక అమభూతి ప్రధానంగా వెలువడినవి.
పి. హనుమయ్యగారి “విభావరి 1978, జనవరిలో వెలువడింది. ఇది “అనిబద్ధకావ్యఖండిక'. ఇందులో మొత్తం ఎనభై(80) ఖండికలున్నాయి. అనుభూతితో వ