Author: Sujanaranjani

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య కీర్తనల్లో అనేక రసవత్తర ఘట్టాలను సృష్టించాడు. ముఖ్యంగా భాగవత సన్నివేశాలను సరస సన్నివేశాలతో సంభాషణలతో మనం ఈ రోజుల్లో అనుకునే ఒక స్కిట్ (ఒక చిన్న హాస్య సంభాషణ) లాంటిది. ఈ జాణతనా లాడేవేలే జంపుగొల్లెతా వోరి" అనే శృంగార కీర్తనలో సంభాషణల (డైలాగుల) రూపంలో ఎంత రక్తి కట్టించాడో చూడండి. అన్నమయ్య గొల్లభామలను "గొల్లెత" అని పిలవడం పరిపాటి. అలాంటి ఒక చల్లలు (మజ్జిగ) అమ్మే ఒక గొల్లభామతో సరసాలాడుతున్నాడు బాల కృష్ణుడు. విశేషమేమిటంటే ఆ గొల్లభామ ఏం తీసిపోలేదు తనూ నాలుగాకులు ఎక్కువే చదివినట్టుంది. మీరూ విని ఆనందించండి. కీర్తన: పల్లవి: జాణతనా లాడేవేలే జంపుగొల్లెతా వోరి ఆణిముత్యముల చల్లలవి నీకు గొల్లలా చ.1 పొయవే కొసరుజల్ల బొంకుగొల్లెతా వోరి మాయింటి చల్లేల నీకు మనసయ్యీరా మాయకువే చల్ల చాడిముచ్చు గొల్లెతా వోరి పోయవొ పోవొ మాచల్ల పులుసేల నీకును? || జాణతనా|| చ.2 చిలుకవే గోరం

స్వాతంత్ర్యం

కవితా స్రవంతి
-డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ఎంతమంది వీరుల బలిదానమో ఈ స్వాతంత్ర్యం ఎంతమంది త్యాగమూర్తుల రక్తతర్పణమో ఈ స్వాతంత్ర్యం దేశం కోసం.... ప్రాణాలను అర్పించిన వీరులది ఈ స్వాతంత్ర్యం లాఠీ దెబ్బలు తిన్న దేశభక్తులది ఈ స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం మేడిపండేమి కాదు అనేక పోరాటాల త్యాగఫలం స్వాతంత్ర్యం సూర్యోదయమేమి కాదు అనేక త్యాగాల ఫలితం శతాబ్ధాల పీడనకు సమరనాదం ఈ ఉద్యమం పరదేశి పాలనకు చరమగీతం ఈ పోరాటం ఆంగ్లేయులను ఎదిరించిన దేశభక్తి మనది అడుగడుగున పోరుసల్పిన స్వరాజ్యకాంక్ష మనది స్వాతంత్ర్యం.... మనదైన అస్తిత్వ నినాదం తరతరాల వారసత్వానికి మార్గదర్శనం ఏ గాయం కానిదే పోరాటం చిగురించదు ఏ రక్తం స్రవించనిదే ఉద్యమం మొలకెత్తదు కోట్లమంది భారతీయుల వజ్రసంకల్పం ఈ స్వాతంత్ర్యం దేశభక్తుల శంఖారావం మనకు దక్కిన స్వాతంత్ర్యం

తొంగిచూసుకుంటే

కవితా స్రవంతి
- డా.దూసి పద్మజ బరంపురం ఇప్పుడు విమానంలో ఎగురుతున్నది నేనేనా? ఏ.సి కార్లు, క్రాఫింగ్ జుట్టు, బంగారు నగలు, హై హీల్స్, చీనీ చీనాంబరాలు, ప్రశ్నలు, ప్రశంసలు, తన కోసం పచార్లు, పలకరింపులు అంతా వింత ! బాల్యమంతా మసక ప్రౌఢమంతా పరాయి పంచన పన్నెత్తి పలకరించే వారు లేరు కన్నెత్తి చూసే ఆత్మబంధువులూ లేరు. అంతా అంధకారం అంతా కొరతే. చాలీ చాలని తిండీ, బట్టా.. బువ్వే బూరి గంజే పానకం రోజులు. అంతా విధి రాత అనుకోనా? లేదా కన్నవాళ్ళ అసమర్ధత అనుకోనా? అంతా ముళ్ళ దారే అయినా భయపడలేదు. ఆశల్ని చంపుకుని, ఆవేదనని అణుచుకుని, ఆశయాన్ని విడువ లేక అవమానాన్ని తట్టుకుని, ఆపన్నహస్తం కోసం ఎదురు చూపులెన్నో అయినా నిరాశపడలేదు. పెళ్ళి పేరుతో వదిలించు కున్న పెద్దలు. అత్తింట అన్నీ ఆరళ్ళే. నీ గుండెని తాకే ఒక్క మనిషైనా లేడు. అందరూ నీకు గుదిబండలే. ఏకాకివై శ్రమిస్తున్న రోజులు ఏరువాకై పారుతున్న ప్

అష్టవిధనాయికలు

శీర్షికలు
(పద్య ఖండిక) స్వాధీనభర్తృక ................... మత్తేభము పతియే దైవమటంచునెంచివ్రతమున్ భక్తిన్ ఘటించున్ పతి వ్రతగెల్వంగఁవశీకృతుండగు సతీస్వాధీనుడౌభర్తయున్ స్తుతి జేతున్భవదీయకౌశలముఁ విధ్యుక్తంబులౌ నీహొయల్ ద్యుతిసౌందర్యవిలాసముల్ కళలు సత్యోత్కృష్టసౌభాగ్యముల్ వాసక సజ్జిక ............... మత్తేభము పడకన్ పద్మదళమ్ములన్ బరచి పుష్పంబుంచి ద్వారంబులన్ పడకింటన్ రమణీలలామకదిలెన్ప్రాణేశునిన్ దల్చి వా ల్జడకున్ పూవులగూర్చివేచె హృదయోల్లాసంబులన్ గూర్చగా వడిచేరన్ జనుదెంచు ప్రేమికునికై స్వాలంకృతస్త్రీత్వమై విరహోత్కంఠిక ...,.,.........,.,, మత్తేభము క్షణముల్ దీర్ఘములై గతింపగను కక్షంబూనెనేమో యనన్ గణుతింపన్ వ్యథలుండుకోటి విరహోక్కంఠీమనోగీతికన్ తృణమేతానన విస్మరించుటనసంతృప్తిన్ యథాతప్తతన్ వణకంగన్ మృదులాధరద్వయముతాన్ వాపోవుచాంచల్యయై! విప్రలబ్ద ............ మత్తేభము కినుకన్ జెందెను రాత్

పుస్తకసమీక్ష-అష్టవిధ నాయికలు

శీర్షికలు
శ్రీ గాదిరాజు మధుసూదన రాజు గారు రచించిన అష్టవిధ నాయికలు (పద్యఖండిక) పై పూజ్యశ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య వారి సమగ్రసమీక్షా వ్యాసం ఈరోజు గాదిరాజు మధుసూదన రాజుగారి కవిత్వానికొద్దాం. మధుసూదన రాజుగారు సుక్షత్రియ వంశంలో జన్మించి వృత్తి రీత్యా ప్రభుత్వ నేత్రవైద్యాధికారిగాఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. పూర్వీకులది భీమవరం. బెంగుళూరులో స్థిరనివాసము. క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు పేరుతో ఇటీవలబ్లాగొకటి పెట్టారు. శంకరాభరణం బ్లాగులో 2019లో అనుకుంటా వారి పద్యాన్ని చూశాను. నాలాంటి వాడే ఎవరో తెలీక సార్! మీరు క్రొత్తా అని అడిగితే వారు చమత్కారంగా "నా కలం చాలా పాతది - కవి రచయితల చరితలో పాతది - జర్నలిజంలో నలభై ఏళ్ళ ముందున్నది. కవుల సమాఖ్యలో బూజుపట్టిన మాజీది - బ్లాగులోకంలో ఈమధ్యే దూరినది" అని క్లుప్త పరిచయం చేసుకున్నారు. 1979 నుండి నేటి వరకు అన్నిప్రముఖపత్రికలలో కవితలు కథలు ప్రచురింప

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
చెల్లాచెద్యురైపోతాం మళ్ళీ కనిపించం! సీలు వెక్కగలిగినవాదే సింహాననానికి అర్హుడు!!" 48 ' సింహాసనం' అనే ఖండికలో సింహాసనానికి అర్హుడైన వ్యక్తి సిలువను సైతం ఎక్కగలిగినవాడై ఉండాలని చెప్పాడీ కవి. సింహాసనాన్ని మించిన స్ధానంలో వేసుకుంటే వారు ఎప్పుడో ఒకప్పుడు కిందకి జారిపోక తప్పుదు. “చివర్నుండి మొదలుకు నడిచిననాకు మొదలు దొరికింది కానీ చివరవతలేముందో చె ప్పేదెవరూ?"49 అని ప్రశ్నించుకుంటాడు ఈ కవి.

వీక్షణం-94-వరూధిని

వీక్షణం
జూన్ నెల వీక్షణం సమావేశం ఆన్ లైను సమావేశంగా జూన్ 14, 2020 న జరిగింది. ఇండియా నుంచి సమావేశానికి హాజరైన శ్రీమతి వెంకట లక్ష్మి మల్లాది గారి పరిచయ కార్యక్రమంతో సమావేశపు మొదటి సెషన్ ప్రారంభమయ్యింది. రెండవ సెషన్ "ప్రసంగం" లో భాగంగా  శ్రీమతి రఘు మల్లాది 'చాటువులు ఆధునిక కాలాన్వయం’ అనే  అంశంపైన ముప్ఫై నిముషాలు ప్రసంగించారు. ఏడేళ్ల కిందట తోలి వీక్షణ సమావేశంలో అధ్యక్షత వహించింది మొదలుగా నాలుగైదు సమావేశాలు వారింట జరుపుకున్న మధుర క్షణాల్ని గుర్తుచేసుకున్నారు. చాటువుల్ని ఇవేళ చాటుగా చెప్పుకోవాల్సిన దుస్థితి పట్టిందన్నారు. "సర్వజ్ఞ నామధేయము" "వీసపు ముక్కు నత్తు" వంటి చాటువుల్ని ఉదహరిస్తూ ఆ నాటి సమాజంలో కుల ప్రస్తావన ఏ విధంగా ఉందో వివరించారు. ఇప్పటి సమాజంలో చాటువులు కాదు కదా అసలు కవికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కొరవడిందన్నారు. ఈ విషయంగా చర్చలో భాగంగా డా||కె.గీత మాట్లాడుతూ కవికి సామాజిక బాధ్యత ఉం

తాపీ ధర్మారావు గారు

సారస్వతం
*శారదాప్రసాద్ * తాపీ ధర్మారావు గారు తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు,హేతువాది మరియు నాస్తికుడు .తన కాలానికి కన్నా ముందు ఆలోచనలతో వర్ణాంతర వివాహాలు, దండల పెళ్లిళ్లకు అప్పట్లోనే పురోహితుడు ఈయన . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.ధర్మారావు గారు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం )లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు.వారి ఇంటి పేరును గురించి వారే ఈ విధంగా చెప్పారు --- "మా పూర్వీకుల ఇంటి పేరు బండి వారో, బండారు వారోనట! సైన్యంలో సిపాయిలుగా ఉంటూ, సైన్యం నుంచి విడుదలై వచ్చాక ఏదో పని చేసుకొనేవారట. మా తాతయ్యకు ముత్తాత లక్ష్మయ్య వాళ్ళ ఊళ్ళో (శ్రీకాకుళం) తాపీ పనిలో బాగా పేరు తెచ్చుకున్నారట. కొడుకూ, కూతురూ చనిపోవడంతో తన దగ్గర పెరుగుతున్న మనుమణ్ణి లక్ష్మయ్య బడిలో వేసినప్పుడు ‘తాపీ లక్ష్మయ్య మనుమడు అప్పన్న’ అని