ఎవరు మారాలి?
-ఆర్. శర్మ దంతుర్తి
నలభై ఐదేళ్ళ సుబ్బారావు ఇంట్లో పెళ్ళాంతో గొడవపడి పార్కులోకి వచ్చాడు ప్రశాంతంగా కూర్చోవడానికి. దూరంగా ఎవరికీ కనబడకుండా కూర్చోవడంలో ఉన్న ఆనందం వేరు. తెలుసున్నవాళ్ళెవరైనా కనబడితే తాను ఒక్కడూ పార్కుకి వచ్చాడంటే ఇంట్లో గొడవ జరిగి ఉంటుందని కనిపెట్టగలిగే ప్రబుధ్ధులు బోల్డుమంది ఉండడం ఒకటైతే, అలా కనిపెట్టకపోయినా ఏవో కబుర్లలో పెట్టి చంపుతారు. కదలకుండా చీకటిపడే దాకా మహా సీరియస్సుగా ఆలోచించేడు సుబ్బారావు ఏం చేయాలో. మర్నాడు పొద్దున్నే ఊరికి వంద మైళ్ళ దూరంగా ఉన్న అడవుల్లో ఈ మధ్యనే తెరిచిన మోడర్న్ యోగా సెంటర్ లో తేలాడు – ఆఫీసుకు శెలవు పెట్టి మరీను. ఈ యోగా సెంటర్లో జేరితే ఆరునెలల్లో దేవుడు కనబడ్డం గేరంటీ. మొదటి అయిదు నెలలూ సెంటర్లో ఉండక్కర్లేదు కానీ ఆరోనెలలో దేవుడు కనబడ్డానికి ముప్పై రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రాముకి తప్పనిసరిగా ఒక్కరే రావాలి, పెళ్ళాం పిల్లలూ, అందర్నీ వెంటబెట్టుకుని వ